Top Government Schemes: పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే టాప్ 3 ప్రభుత్వ పథకాలు ఇవే!
పిల్లల కోసం తప్పనిసరిగా ఎంతో కొంత పెట్టుబడి పెడితే, భవిష్యత్తు గురించి దిగులు చెందాల్సిన అవసరం ఉండదు. మరి ఇంతకీ ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
Top Government Schemes: పెళ్లి అనే జీవితంలోకి అడుగు పెట్టాక, అనేక బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. మొదటగా పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించాలి. పిల్లలు పుట్టినప్పటి నుండి వాళ్ళ చదువులు, పెళ్లిళ్లు వంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది. పిల్లల విషయాల్లో ఖచ్చితంగా ఆర్థికంగా ఎప్పటికప్పుడు అడుగులు వేస్తూ ఉండాలి. అయితే, పిల్లల కోసం తప్పనిసరిగా ఎంతో కొంత పెట్టుబడి పెడితే, భవిష్యత్తు గురించి దిగులు చెందాల్సిన అవసరం ఉండదు. మరి ఇంతకీ ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? రిస్క్ లేకుండా ఎక్కడ పెట్టుబడి పెడితే మంచిది? వంటి ప్రభుత్వం అందించే పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి స్కీం :
ఆడపిల్లల భవిష్యత్తుకు (Future Of Girls) పెద్దపీట వేసేవారికి సుకన్య సమృద్ధి స్కీం (SSY) సరైనది. నెలకు రూ.12,500 పెట్టుబడి (ఏటా రూ.1.5 లక్షలు)తో 8 శాతానికి పైగా వడ్డీ అందితే ఆఖర్లో రూ.70 లక్షల వరకు అందుకునే సౌకర్యం ఈ పథకంలో ఉన్నది.
వడ్డీరేటు ఎంత?
ప్రతీ 3 నెలలకోసారి ఈ పథకం వడ్డీరేటును సమీక్షించి ఓ నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ సెక్యూరిటీ (Government Security) ల వడ్డీరేట్లలోని హెచ్చుతగ్గుల ఆధారంగా స్వల్ప మార్పులుంటాయి. దీనిలో 8.2 శాతం వడ్డీరేటును నిర్ణయించారు. గతంలో ఓసారి ఏకంగా 9.2 శాతం వడ్డీనిచ్చారు. ఇప్పటిదాకా కనిష్ఠ స్థాయి 7.6 శాతం ఉంది.
ఎవరు అర్హులు?
భారతీయులై (Indians) ఉండాలి.
ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా గార్డియన్ (Guardian) లకు మాత్రమే అర్హత ఉంటుంది.
అమ్మాయి వయసు పదేండ్లు నిండేలోగానే స్కీం తీసుకోవాల్సి ఉంటుంది.
ఒక్కరికి ఒక్క ఖాతానే తెరుస్తారు.
కుటుంబంలో గరిష్ఠంగా ఇద్దరికి మాత్రమే స్కీం వర్తిస్తుంది.
పీపీఎఫ్ (PPF) లో పెట్టుబడి:
15 సంవత్సరాల లాక్-ఇన్ టర్మ్‌తో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. మంచి రాబడి (Good return) ని సాధించడానికి, మీరు కనీసం ప్రతి సంవత్సరం రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. దీనికి 7.1 వడ్డీ రేటును అందిస్తారు. మనకి ఎన్ని సార్లు అవసరం అయితే అన్ని సార్లు డిపాజిట్ చేసుకోవచ్చు.
ఏదైనా అవసరం వచ్చినప్పుడు మధ్యలోనే డబ్బును విత్ డ్రా (With Draw) చేసుకోవచ్చు. అయితే, 5 సంవత్సరాల తర్వాత 50% వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మరణం సంభవిస్తే అసలు మరియు వడ్డీ ని కలిపి ఈ యోజన అందిస్తుంది.
సావరిన్ గోల్డ్ బాండ్లు :
మీ పెట్టుబడిపై స్థిరమైన 2.5 శాతం వడ్డీ రేటును పొందండి, సంవత్సరానికి రెండుసార్లు చెల్లించండి. సురక్షితంగా మరియు భద్రతతో (With security) కూడిన ప్రభుత్వ మద్దతుతో, ఈ బాండ్లు తక్కువ-రిస్క్ పెట్టుబడి ఎంపిక. బంగారం ధరలు సాధారణంగా కాలక్రమేణా (Over time) పెరుగుతాయి, కాబట్టి మీరు మీ పెట్టుబడి విలువలో పెరుగుదలను చూడవచ్చు.
బంగారంలో పెట్టుబడి పెడితే మేకింగ్ చార్జెస్ 6 నుండి 14 శాతం వరకు ఉంటాయి. వెస్టీజ్ చార్జెస్ 5 నుండి 10 శాతం వరకు ఉంటాయి. అలాగే, జిఎస్టీ చార్జెస్ 3% వరకు ఉంటుంది. దాదాపుగా మొత్తం కలిపి 20 % వరకు చార్జెస్ ఉంటాయి. అయితే, ప్రతి సంవత్సరం వడ్డీ 2.5% మీ బ్యాంకు అకౌంట్ లో పడుతుంది. దీని కోసం ఆర్బీఐ వెబ్ సైట్ లో పెట్టుబడి పెట్టవచ్చు.
Comments are closed.