Telugu Mirror : మీరు రూ.20,000 లోపులో మంచి ఫోన్ ల కోసం ఎదురు చూస్తున్నారా. ఈ ఐదు ఫోన్ లు మీకు 20 వేల లోపులో దాంతో పాటుగా Snapdragon ప్రాసెసర్ తో వస్తాయి.
iQoo Z6 Lite :
iQoo Z6 Lite 120Hz రిఫ్రెష్ రేట్ తో కూడిన 6.58 Inch FHD+ డిస్ ప్లే తో వస్తుంది. అలానే 6GB RAM మరియు 128GB ఇంటర్ నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది, Qualcomm Snapdragon 4 Gen 1 ప్రాసెసర్ తో వస్తుంది. iQoo Z6 Lite 50 – మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ” ఐ ఆటోఫోకస్ ” తో వస్తుంది. ఈ ఫోన్ 5G ను సపోర్ట్ చేస్తుంది. iQoo Z6 Lite యొక్క ధర రూ.13,999 కు లభిస్తుంది.
OnePlus Nord CE 2 Lite 5G :
OnePlus Nord CE 2 Lite 5000mAh బ్యాటరీ మరియు 33W superWOOC ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 64- మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 – మెగా పిక్సెల్ డెప్త్ లెన్స్ మరియు 2 – మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలతో వస్తుంది అలానే 16 – మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా తో వస్తుంది. ఈ హ్యాండ్ సెట్ 6.59 అంగుళాల డిస్ ప్లే వస్తుంది. ఈ ఫోన్ Snapdragon 695 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ 5G ను సపోర్ట్ చేస్తుంది. OnePlus Nord CE 2 Lite యొక్క ధర రూ.17,999.
Redmi Note 12 5G:
ఈ ఫోన్ 4GB + 128GB, 6GB + 128GB మరియు 8GB + 256GB ఇలా మూడు వేరియంట్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క స్టార్టింగ్ ధర రూ.16,999. ఈ హ్యాండ్ సెట్ Snapdragon 4 Gen 1 ప్రాసెసర్ తో వస్తుంది. అలానే 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 48-మెగా పిక్సెల్, 8-మెగా పిక్సెల్, 2-మెగా పిక్సెల్ కెమెరాలతో వస్తుంది.
Motorola Moto G71 5G:
ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది, అలానే 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 50- మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8- మెగా పిక్సెల్, 2-మెగా పిక్సెల్ కెమెరాలతో మరియు 16-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా తో వస్తుంది. ఈ ఫోన్ Snapdragon 695 ప్రాసెసర్ తో వస్తుంది. దీని యొక్క ధర రూ.18,690.
Samsung Galaxy F23 5G:
Samsung Galaxy F23 5G 6GB RAM మరియు 128GB ROM ను కలిగి ఉంది. అలానే ఈ ఫోన్ Snapdragon 750G ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగా పిక్సెల్ మరియు 2-మెగా పిక్సెల్ రియర్ కెమెరాలతో లభిస్తుంది. అలానే 8-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది 5000mAh బ్యాటరీ కెపాసిటీ తో వస్తుంది.
ఈ ఫోన్ రూ.15,799 కు లభిస్తుంది.