Tortoise : లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వాటిల్లో తాబేలు (Tortoise) ఒకటిగా పరిగణించబడుతుంది. తాబేలు ఇంట్లో ఉండటం చాలా పవిత్రంగా భావిస్తారు. అయితే నిజమైన తాబేలు ను ఇంట్లో పెంచుకోవడం అంత సులభం కాదు. కాబట్టి లోహం (the metal) తో చేసిన తాబేలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్రం రెండింటిలోనూ tortoise శుభప్రదంగా పరిగణించబడుతుంది. తాబేలు విష్ణుమూర్తి తో సంబంధం కలిగి ఉంటుంది. ఎందుకంటే శ్రీ మహా విష్ణువు కూర్మావతారంలో జన్మించాడు. కనుక తాబేలు ఉన్నచోట లక్ష్మీదేవి కూడా నివాసం చేస్తుందని చెబుతారు.
తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచుకోవడం వలన అదృష్టం (good luck) ఎలా కలుగుతుందో తెలుసుకుందాం. అలాగే ఎటువంటి తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచడం వల్ల,ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం.
Crystal Turtle (స్పటిక తాబేలు) :
ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఇంట్లో స్పటిక తో తయారుచేసిన తాబేలు ఉంచడం వలన ఆర్థిక పరమైన ఇబ్బందులు మెల్లగా తగ్గుముఖం పడతాయి. స్పటిక తాబేలు డబ్బులు కి సంబంధించిన సమస్యలను దూరం చేయడంతో పాటు, ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది.
Metal Tortoise (లోహపు తాబేలు) :
లోహంతో తయారు చేసిన తాబేలును ఉత్తర దిశలో ఉంచడం వలన కోరికలు త్వరగా నెరవేరుతాయి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.
Brass Tortoise (ఇత్తడి తాబేలు) :
విద్యార్థులకు చదువుపై ఆసక్తి లేకుండా ఉంటే, చదువుకునే సమయంలో వారి యొక్క దృష్టి చదువులో నిమగ్నం చేయాలంటే, స్టడీ టేబుల్ పై ఇతడి లోహంతో చేసిన తాబేలును ఉంచడం వలన వారి మనసు చదువుపై కేంద్రీకరిస్తారని భావిస్తారు. ఇత్తడి తాబేలును స్టడీ టేబుల్ పై ఉంచడం వల్ల దృష్టి లోపాలు కూడా తగ్గుతాయి.
Silver Tortoise (వెండి తాబేలు) :
నూతన ఉద్యోగం లేదా నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తున్న ట్లయితే ఆఫీస్ లేదా వ్యాపారం చేసే ప్రదేశంలో వెండితో తయారుచేసిన తాబేలు ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి ని ఆకర్షించ వచ్చు. అలాగే వచ్చిన సంపద కూడా స్థిరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.
Also Read : Vaastu Tips : మనీ పర్స్ ఇలా ఉంటే మహాలక్ష్మి మీ వెంటే
Tortoise ring (తాబేలు ఉంగరం) :
తాబేలు ఉంగరం ధరించడం వల్ల కూడా శుభ ఫలితాలను పొందవచ్చు. అందుకే చాలామంది లోహంతో చేసిన తాబేలు ఉంగరాన్ని ధరిస్తారు. అయితే చాలామంది తమ విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ, ధన త్రయోదశి, దీపావళి మరియు శుక్రవారం ఇటువంటి పవిత్రమైన మరియు ప్రత్యేకమైన రోజులలో లోహంతో చేసిన తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందవచ్చు అని భావిస్తారు.
కాబట్టి వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్రం పై నమ్మకం ఉన్నవారు పాటించండి. శుభ ఫలితాలను పొందండి.