Toyota Urban Cruiser Taisor, Valuable car: మార్కెట్ లోకి కొత్త 2024 టొయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్.

Toyota Urban Cruiser Taisor

Toyota Urban Cruiser Taisor

Toyota Urban Cruiser Taisor :ఇది రెండు ఇంజన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది: 1.2-లీటర్ న్యతురల్ ఆస్పిరేటెడ్ మరియు 1.0-లీటర్ టర్బో పెట్రోల్. 1.2-లీటర్ ఇంజన్ 89 బిహెచ్‌పి మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది, అయితే టర్బోచార్జ్డ్ యూనిట్ 99 బిహెచ్‌పి మరియు 148 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. రెండు ఇంజన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి. అంతేకాకుండా, 1.2-లీటర్ ఇంజన్‌ 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT)తో కూడా వస్తుంది, అయితే టర్బో పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో కూడా వస్తుంది. అదనంగా, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) వేరియంట్ అందుబాటులో ఉంది. Taisor ధర ₹7.74 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్).

Toyota Urban Cruiser Taisor Exterior

ఈ కార్ డిజైన్ విషయానికి వస్తేయ్, టైసర్ యొక్క ముందు భాగం రీడిజైన్ చేయబడిన DRL తో వస్తుంది, ఇది ఇప్పుడు DRL మరియు ఇండికేటర్ రెండు కలిపి వస్తుంది. ఫ్రంట్ గ్రిల్ హనీ క్రోమ్ బ్లాక్ ఫినిషింగ్‌తో ప్రీమియమ్ లుక్‌ని ఇస్తుంది. బంపర్ చివరన గ్రే స్ప్లిటర్‌ వస్తుంది, ఇది SUV యొక్క రఫ్ లుక్ ని ఇంకా పెంచుతుంది. అసలు అర్బన్ క్రూయిజర్ యొక్క డబుల్ హౌసింగ్ డిజైన్‌తో పోలిస్తే ట్రై-LED హెడ్‌ల్యాంప్స్ ఈ కార్ యొక్క ఫ్రంట్ పార్ట్ కి క్లీనర్ మరియు మరింత ఆకర్షణీయమైన లుక్ ని ఇస్తుంది.

Toyota Urban Cruiser Taisor Side Profile

సైడ్ లుక్ విషయానికి వస్తేయ్, టైజర్ ఒరిజినల్ మోడల్‌తో పోలిస్తే డిఫరెంట్ డిజైన్‌తో కొత్త అల్లాయ్ వీల్స్‌ తో వస్తుంది. రూఫ్ రైల్స్, గ్రాబ్ హ్యాండిల్స్ మరియు షార్క్ ఫిన్ యాంటెన్నా వెహికల్ యొక్క మొత్తం
లుక్ ని పెంచుతుంది.

Toyota Urban Cruiser Taisor Back profile

వెనుక వైపున, టైజర్ ఒక ఫ్లాట్ స్పాయిలర్, రేక్డ్ గ్లాస్ మరియు కనెక్ట్ చేయబడిన టెయిల్ ల్యాంప్స్ తో కూపే SUV లుక్ ని ఇస్తుంది. వెనుక బంపర్‌లో సెన్సార్లు, రిఫ్లెక్టర్లు మరియు స్కిడ్ ప్లేట్ కోసం క్లాడింగ్ ఉన్నాయి, ఇది ఒక రఫ్ లుక్ ని ఇస్తుంది.

Toyota Urban Cruiser Taisor Interior

ఇంటీరియర్ విషయానికి వస్తేయ్, Taisor డ్యాష్‌బోర్డ్‌ పై అంతటా సిల్వర్ మరియు గ్రే టచ్‌లతో కూడిన ప్రీమియం డ్యూయల్-టోన్ ఇంటీరియర్‌ను అందిస్తుంది. 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉపయోగించడానికి ఈజీ గ ఉంది మరియు 360-డిగ్రీ వ్యూ రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్‌లకు ఇస్తుంది. క్యాబిన్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు కప్ హోల్డర్‌లు మరియు హ్యాండ్‌బ్రేక్ క్రింద చిన్న స్టోరేజ్ స్పేస్‌తో సహా చాల స్టోరేజ్ స్పేస్‌లు ఉన్నాయి.

Toyota Urban Cruiser Taisor Driver Assistance

డ్రైవర్ అసిస్టెన్స్ పరంగా, Taisor ఒక హెడ్స్-అప్ డిస్ప్లే తో వస్తుంది, MIDతో అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు మీడియా కంట్రోల్స్ మరియు క్రూయిజ్ కంట్రోల్ బటన్‌లతో కూడిన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌తో వస్తుంది. ఇతర ఫీచర్లలో ఆటో స్టార్ట్-స్టాప్, ట్రాక్షన్ కంట్రోల్, ఆటో-డిమ్మింగ్ IRVM మరియు క్లాత్ ఫినిషింగ్‌తో మాన్యువల్‌గా అడ్జస్ట్ చేయగల సీట్లు ఉన్నాయి.

Toyota Urban Cruiser Taisor Rear Seats

వెనుక సీట్లు తగిన తొడ(thigh) సపోర్ట్ మరియు లెగ్ రూమ్ తో మంచి స్పేస్ మరియు కంఫర్ట్ అందిస్తాయి. ఏదేమైనప్పటికీ, స్లోప్డ్ రూఫ్ డిజైన్ కారణంగా ఎత్తైన ప్రయాణీకులకు హెడ్‌రూమ్ కొంచం ఇబ్బంది గ ఉంటుంది. వెనుక సీట్లలో వెంట్‌లు మరియు USB పోర్ట్‌లు కూడా ఉన్నాయి, అయితే ఆర్మ్‌రెస్ట్ లేదా కప్ హోల్డర్‌లు లేవు.

ముగింపులో, టొయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ స్టైల్, కంఫర్ట్ మరియు ప్రాక్టికాలిటీని కలిపి వస్తుంది, చిన్న డిజైన్ మార్పులు మరియు ప్రీమియం ఫీచర్లు అసలు అర్బన్ క్రూయిజర్ నుండి వేరుగా ఉంటాయి. Taisor ప్రారంభ ధర రూ. 8.7 లక్షలు నుండి రూ. 15.8 లక్షలు వరకు వెళ్తుంది, ఇది దాని సెగ్మెంట్ లో మిగతా వెహికల్స్ కి గట్టి పోటీ ఇస్తుంది.

Toyota Urban Cruiser Taisor Specifications.

Category Specification
Engine 1.5L K15B Petrol Engine
Displacement 1462 cc
Max Power 103 bhp @ 6000 rpm
Max Torque 138 Nm @ 4400 rpm
Transmission 5-speed Manual / 4-speed Automatic
Fuel Efficiency (ARAI) Manual: 17.03 kmpl / Automatic: 18.76 kmpl
Length 3995 mm
Width 1790 mm
Height 1640 mm
Wheelbase 2500 mm
Ground Clearance 198 mm
Boot Space 328 litres
Fuel Tank Capacity 48 litres
Seating Capacity 5
Front Suspension MacPherson Strut with Coil Spring
Rear Suspension Torsion Beam with Coil Spring
Front Brakes Ventilated Disc
Rear Brakes Drum
Tyre Size 195/60 R16
Steering Type Power Steering
Turning Radius 5.2 metres
Front Headlamps Tri-LED
Rear Tail Lamps LED
Front Grille Honey Chrome Black
Exterior Highlights Roof Rails, Shark Fin Antenna
Interior Highlights Burgundy Finish, 9-inch Touchscreen
Safety Features Dual Airbags, ABS with EBD, Rear Parking Sensors
Variants V-Near Drive
Price Range (Ex-Showroom) Rs. 8.7 lakhs to Rs. 15.8 lakhs

Toyota Urban Cruiser Taisor

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in