Building Railway Track in China: చైనా లో అద్భుతం.బిల్డింగ్ మధ్య రైల్వే ట్రాక్..ఎలా సాధ్యం?

Telugu Mirror: సాంకేతిక పరిజ్ఞానం లో ఎప్పుడూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుంది చైనా(China). చైనా లో తయారయ్యే ఉత్పత్తులకు భారత దేశంలో డిమాండ్ ఎక్కువ. చైనా ఉత్పత్తులను విమర్శిస్తూనే వాటిని వినియోగించే వారి సంఖ్య కూడా అదే నిష్పత్తిలో ఉంటుంది. చైనా టెక్నాలజి ,నూతన ఉత్పత్తులు మార్కెట్ లోకి వచ్చిన తరువాత ఒక్కోసారి ప్రపంచమే ఆశ్చర్య పోతుంది.సాంకేతికంగా చైనా ఎంత ముందుకు వెళ్ళిందో,చైనా దేశ ఉత్పత్తులను చూసిన తరువాత అనిపిస్తూ ఉంటుంది.

అభివృద్ది పరచిన సాంకేతిక పరిజ్ఞానంతో ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల ఆవిష్కరణలే కాకుండా,అధునాతన రైళ్ళని కూడా తన దేశపు సాంకేతిక విజ్ఞానంతో తయారుచేసిన ఘనత కలిగి ఉంది. చైనా మరియు జపాన్(Japan) రైళ్ళ వేగం కూడా ఆశ్చర్యపరుస్తాయి. అయితే చైనా రైల్వే టెక్నాలజీ ఇటీవల కాలంలో మరొక అద్భుతాన్ని సృష్టించింది. తాజాగా చైనా 19 అంతస్థుల నివాస సముదాయం మధ్య నుంచి రైల్వే ట్రాక్ ని నిర్మించింది. ప్రజలు నివసించే ఈ 19 అంతస్తుల భవనం ఇప్పుడు రైల్వే స్టేషన్ గానూ మారిపోయింది.

Also Read:Toy Business : ఇంట్లోనే ఉంటూ సంపాదించే ఛాన్స్.. సొంత వ్యాపారమే హాయి..

బిల్డింగ్ ల మధ్య నుండి వెళ్ళే రైలు:

అద్భుత మైన రైల్వే వ్యవస్థ ని కలిగి ఉంది చైనా. ప్రపంచంలోనే ట్రాక్ లేకుండా రైలు ని నడిపిన చరిత్ర కలిగిన దేశం చైనా. హై స్పీడ్ నెట్ వర్క్(High Speed Network) ను విరివిగా వాడుకుంటూ ప్రయాణీకులకు చైనా మరింత ఉత్తమ సేవలు అందిస్తోంది. ప్రయాణీకులకు అత్యుత్తమ సేవలను అందించడంలో ప్రపంచం లోనే చైనా రైల్వేస్ అత్యుత్తమ మైనదని అంటుంటారు.అయితే ఇటీవల చైనా ఒక నివాస భవంతి మధ్య నుంచి రైల్వే లైన్ ని నిర్మించింది. ఈ బిల్డింగ్ మధ్య నుంచి రోజూ రైళ్ళ రాకపోకలు సాగుతుంటాయి.19 అంతస్థులు కలిగిన ఈ గృహ సముదాయం లోని 6వ మరియు 8వ అంతస్తుల పై నుండి రైల్ ట్రాక్ నిర్మించారు. బిల్డింగ్ మధ్య నుంచి రైల్వే లైన్ నిర్మించడం ప్రపంచంలో ఇదే మొదటి సారి.

బిల్డింగ్ లోని వారికి ఇబ్బంది కలుగకుండా:

చైనా ఈ రైల్వే లైన్ నిర్మిస్తున్నప్పుడు ఈ మార్గంలో ఉన్న 19 అంతస్థుల భవంతి అడ్డుగా నిలిచింది. అయితే చైనా రైల్వే శాఖ అధికారులు,బిల్డింగ్ యజమానులను సంప్రదించి బిల్డింగ్ మధ్యగా రైల్వే లైన్ వేసేందుకు వారి అనుమతి పొందినారు. అనంతరం భవంతి మధ్య నుంచి ట్రాక్ వేశారు. ఈ ట్రాక్ నిర్మాణం ప్రపంచాన్నే ఆశ్చర్య పరిచింది. అయితే ఈ బిల్డింగ్ లో ఉంటున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ట్రాక్ ని నిర్మించారు.

Also Read:Thai N. Gok : 60 సంవత్సరాలుగా నిద్రపోని వియత్నాం వాసి ..

ఈ ట్రాక్ నిర్మాణం వలన ఆ బిల్డింగ్ లో నివసించే వారికి ఊహించని మేలు కలిగింది. ఇప్పుడు వారికి ఒక ప్రత్యేక రైల్వే స్టేషన్ ఏర్పడింది. ఇప్పుడు వారు ఇంటి నుంచి బయటకు వచ్చి,నేరుగా రైలులో కూర్చుని తరువాత స్టేషన్ కు చేరుకుంటున్నారు. ఇక రైలు రాకపోకల సమయంలో రైలు నుంచి వచ్చే శబ్ధం వలన బిల్డింగ్ లోని వారికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు సైలెన్సింగ్ టెక్నిక్(silencing technique) వినియోగించారు.

Leave A Reply

Your email address will not be published.