Telugu Mirror : ఆగస్టు నెల జరుగుతుంది. ఈ నెలలో కొన్నిసార్లు ఎండలు ఎక్కువగా వస్తాయి మరి కొన్నిసార్లు భారీగా వర్షాలు కురుస్తుంటాయి. వర్షం పడిన తర్వాత వాతావరణంలో తేమ వలన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీని ప్రభావం ఎక్కువగా చర్మంపై పడుతుంది. వాతావరణం (Weather) లో మార్పుల వల్ల చర్మం పొడి బారడం జరుగుతుంది. దీనివలన కాళ్లు, చేతులలో మరియు ముఖం నిర్జీవంగా కనిపిస్తుంటాయి. అటువంటి సందర్భంలో మీరు మీ పూర్వచర్మాన్ని పొందడం కోసం ఇంటి చిట్కాలను పాటించవచ్చు. వీటిని పాటించడం ద్వారా నిర్జీవంగా మారిన మీ చర్మాన్ని తిరిగి పొందవచ్చు. కొంతమంది పార్లర్ కు వెళ్లి సమయం మరియు డబ్బులు వృధా చేయడానికి ఇష్టపడరు.మరి కొంతమందికి పార్లర్ కి వెళ్లే సమయం దొరకదు. ఇంకొందరికి ఆ అవకాశం ఉండకపోవచ్చు. అటువంటి వారి కోసం ఇవాళ మీకు మేము కొన్ని ఇంటి చిట్కాలను చెప్పబోతున్నాం అవేమిటో తెలుసుకుందాం.
1. నిమ్మరసం మరియు తేనె ఉపయోగించి నిర్జీవంగా మారిన మీ కాళ్లు, చేతులు, మరియు ముఖంను కాంతివంతంగా మార్చుకోవచ్చు. ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ తాజా నిమ్మరసం మరియు ఒక టీ స్పూన్ తేనె వేసి కలపాలి. ఈ పేస్ట్ ని చర్మానికి అప్లై చేసి అరగంట తర్వాత కడగాలి. దీంతో నిర్జీవంగా మారిన మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.
2. పెరుగు మరియు టమాటో ను కూడా చర్మం లో ఉన్న డల్ నెస్ ను తగ్గిస్తుంది. దీని కోసం ముందుగా ఒక టమాట తీసుకొని దానిపై ఉన్న తొక్కను ఒకటి నుంచి రెండు స్పూన్ల పెరుగును కలిపి పేస్టులా చెయ్యాలి. ఎక్కడ మీ చర్మం డల్ గా అనిపిస్తుందో అక్కడ మీరు ఈ పేస్ట్ ని అప్లై చేసి ఆరిన తర్వాత కడగాలి. తద్వారా మెరిసే చర్మాన్ని పొందవచ్చు.
3. ఆర్గానిక్ పసుపు (organic turmeric) మరియు శెనగపిండి రెండు కూడా చర్మానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ పసుపు మరియు ఒక కప్పు శెనగపిండిని వేసి అందులో రోజ్ వాటర్ (rose water) పోసి పేస్టులా తయారు చేయాలి. ఈ పేస్ట్ ని మీ చర్మంపై అప్లై చేసేటప్పుడు మసాజ్ చేస్తూ రాయాలి. 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి. దీనితో చర్మం వస్తుంది.
4. బంగాళదుంపలో చర్మానికి ఉపయోగపడే లక్షణాలు దాగి ఉన్నాయి. బంగాళదుంప తొక్క తీసి కడిగి ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసి రసాన్ని తీయాలి. ఈ రసంలో కాటన్ ముంచి నిర్జీవంగా ఉన్న చర్మంపై అప్లై చేసి మర్దన చేయాలి. 20 నిమిషాల తర్వాత కడగాలి.
కాబట్టి ఈ నెలలో వచ్చే చర్మ సమస్యల నుండి ఇటువంటి కొన్ని ఇంటి చిట్కాలను పాటించి నిర్జీవంగా మారిన మీ చర్మం మెరిసే చర్మంగా మార్చుకోండి. ఇంటి చిట్కాలలో అన్ని సహజంగా ఉండే పదార్థాలను వాడుతుంటాం. కాబట్టి తరచుగా ఈ చిట్కాలను అనుసరిస్తే తప్పకుండా గ్లోయింగ్ స్కిన్ (Glowing Skin) ను పొందవచ్చు.