Triumph bike : డిమాండ్ పెంచుతూ రాకెట్ లా దూసుకెళ్తున్న ట్రయంఫ్ బైక్..

Telugu Mirror : ట్రయంఫ్(Triumph bike) ఇండియా తన కొత్త మోటార్ బైక్ స్పీడ్ 400 ను దేశంలో ధరల పెరుగుదల వలన బైక్ బుకింగ్ ధరలను పెంచింది.ట్రయంఫ్ స్పీడ్ 400 బుకింగ్ ధరలను రూ. 2000 నుంచి రూ.10,000 వరకు పెంచింది.అదేవిధంగా బుకింగ్ కోసం చెల్లించిన అమౌంట్ మొత్తం పూర్తిగా తిరిగి చెల్లించబడుతుంది. ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ ను ఇప్పటికీ ట్రయంఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ నుండి మాత్రమే బుక్ చేసుకోవచ్చు.

XMR 210 : హీరో కరిజ్మా మళ్లీ వచ్చింది! కొత్త XMR 210 యొక్క స్పోర్టీ డిజైన్..

ట్రయంఫ్ ఇండియా స్పీడ్ 400 బైక్ ను భారతీయ మార్కెట్(Indian Market) లో విడుదల చేసినప్పటినుంచి విశేషమైన స్పందన పొందింది. మొదటిలో ఈ బైక్ పదివేల బుకింగ్ లను చేరుకున్న తర్వాత కంపెనీ ఈ బైక్ ధరను రూ.2.23 లక్షల నుంచి రూ. 2.33 లక్షల వరకు పెంచింది. అయినా ఈ బైక్ మార్కెట్లో మంచి ఫలితాన్ని సాధించింది.

Image Credit : Autos MaxAbout

 

బజాజ్ కంపెనీ(Bajaj Company) దాని ప్రీమియం ఉత్పత్తి ధరలను అధికసార్లు మార్చినందున రాబోయే కాలంలో స్పీడ్ 400 బైక్ ధరను కూడా మరోసారి పెంచవచ్చని భావిస్తున్నాం.ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. కార్నివాల్ రెడ్, కాస్పియన్ బ్లూ మరియు ఫాంటమ్ బ్లాక్ ఆప్షన్ లలో ఆన్ లైన్ బుకింగ్ లో అందుబాటులో ఉంది.స్పీడ్ 400 బైక్ 398.15cc సింగిల్ – సిలిండర్ లిక్విడ్ కోల్డ్ మోటార్ తో 39.5bhp శక్తిని కలిగి ఉండి 37.5nm టార్క్ ని రొటేట్ చేస్తుంది.

Kitchen tips: మాడిపోయిన పాత్రలకు తల తల మెరిసే సూత్రాలు..

ఇది 6 -స్పీడ్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. మరియు షార్ట్ స్ట్రోక్(Short stroke) సెటప్ ను కలిగి ఉంది.టైం స్పీడ్ 400 బైక్ ఫీచర్లలో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, డ్యూయల్ ఛానల్, ABS , USD ఫ్రంట్ ఫొర్క్స్ అలాగే మోనో షాక్ ఉన్నాయి. ఈ బైక్ 17 – అంగుళాల అల్లాయ్ వీల్స్ పై రన్ అవుతుంది మరియు ముందు అలాగే వెనుక ఒకే డిస్క్ ను కలిగి ఉంటుంది.హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మరియు ఈ విభాగంలోని ఇతర బైకులకు ట్రయంఫ్ స్పీడ్ 400 ప్రత్యర్థిగా ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.