TS- EAPCET 2024 Exam Time Table : తెలంగాణలో విడుదల అయిన TS- EAPCET (ఈఎపిసెట్) – 2024 షెడ్యూల్..దరఖాస్తు కు చివరి తేదీ ఎప్పుడంటే..

TS Eamcet Key
Image Credit : Sakshi Education

తెలంగాణలో TS- EAPCET (ఈఎపిసెట్) – 2024 షెడ్యూల్ విడుదల అయింది.ఇటీవల EAMCET (ఎంసెట్) పరీక్ష పేరును తెలంగాణ ప్రభుత్వం EAPCET గా మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ అండ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ EAPCET -2024 షెడ్యూల్ విడుదల చేసింది.

ఈఏపీసెట్- 2024 కన్వీనర్, జేఎన్టియూ (JNTU) ప్రొఫెసర్, సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ బి. దీన్ కుమార్ మంగళవారం నాడు షెడ్యూల్ రిలీజ్ చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి – 21 వ తేదీన EAPCET -2024 నోటిఫికేషన్ విడుదల అవ్వనుంది. ఫిబ్రవరి – 26 వ తారీకు నుండి దరఖాస్తుల స్వీకరణ మొదలు కానుంది.

TS- EAPCET 2024 Exam Time Table : TS- EAPCET (EAPCET) - 2024 schedule released in Telangana.. When is the last date for application..
Image Credit : Sakshi Education

ఏప్రిల్ – 6 వ తేదీ వరకు ఎటువంటి ఆలస్య ఫీజు చెల్లించ కుండానే ఆన్ లైన్ లోనే దరఖాస్తులను స్వీకరిస్తారని తెలియజేసింది. తెలంగాణ – EAPCET పరీక్షలు మే – నెల 9 తేదీ నుండి 12 వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్ష ఆన్ లైన్ పద్ధతిలోనే కొనసాగుతుంది. ఈ పరీక్షలు (Exams) మొత్తం నాలుగు రోజులపాటు జరగనున్నాయి.

జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్  ఎడ్యుకేషన్ ( TSCH ) లకు సంబంధించిన సీనియర్ అధికారులు ఫిబ్రవరి – 6 మంగళవారం రోజున తెలంగాణ EAPCET – 2024 మొదటి CET కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.

Also Read : TSPSC Group-1 : తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం, గ్రూప్-1 పోస్టులు పంపు, త్వరలో నోటిఫికేషన్ విడుదల

ఈ సమావేశంలో టీఎస్(ఈఏపీసెట్) EAPCET షెడ్యూల్ ఖరారు చేశారు. అలాగే తెలంగాణ EAPCET -2024 సిలబస్ (Syllabus) పై కూడా స్పష్టత (Clarity) ను తెలియజేశారు.

ఇంటర్మీడియట్ మొదటి (First) మరియురెండవ (Second) సంవత్సరం సిలబస్  వంద శాతం టియస్- ఈఏపీసెట్ (TS – EAPCET) లో ఉంటుందని షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in