TS Inter Results 2024, Useful news : తెలంగాణలో ఇంటర్ ఫలితాలకు డేట్ ఫిక్స్, మీ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకేసారి ప్రకటిస్తారు. తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 22న వెల్లడికానున్నాయి.
TS Inter Results 2024 : తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 22న వెల్లడికానున్నాయి.ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకేసారి ప్రకటిస్తారు. ఏప్రిల్ 10న, జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయింది. మార్కుల నమోదులో టెక్నికల్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పరీక్షకు హాజరైన వారు, పరీక్ష రాయనివారు, మాల్ ప్రాక్టీస్ వారి డేటాను కంప్యూటర్ లో పొందుపరిచారు. ఏప్రిల్ 21 నాటికి ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెప్బుతున్నారు. అన్నీ అనుకూలిస్తే, తెలంగాణ ఇంటర్మీడియట్ 1 మరియు 2 వ సంవత్సరాల పరీక్ష ఫలితాలు వెంటనే ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 25 లోపు అందుబాటులో ఉంటాయి.
ఎన్నికల కారణంగా ఫలితాలు తొందరగా..
దేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున, ఇంటర్ పరీక్షల మూల్యాంకనాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 మధ్య ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈసారి 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
వీరిలో 4,78,527 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు కాగా 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు కొనసాగుతుండగానే అధికారులు మార్చి 10న మూల్యంకన ప్రక్రియను ప్రారంభించారు. మూల్యాంకన ప్రక్రియ మొత్తం నాలుగు దశల్లో నిర్వహించగా.. ఏప్రిల్ 10 నాటికి ముగిసింది.
జవాబు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి
ఇంటర్ బోర్డు పరీక్ష సందర్భంగా సమాధాన పత్రాల మూల్యాంకనంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించిన సంగతి తెలిసిందే. జవాబు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మార్కులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
వాల్యుయేషన్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈసారి సంగారెడ్డి జిల్లాలోనూ వాల్యుయేషన్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. గతేడాదిలా కాకుండా ఈసారి ఫలితాల విడుదల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఏప్రిల్ 20 తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు.
TS ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలు 2024 ఎలా చెక్ చేయాలి
- అధికారిక వెబ్‌సైట్,http://tsbie.cgg.gov.in కి వెళ్లండి.
- హోమ్‌పేజీలో ‘Telangana Inter Results 2024’ లింక్‌పై క్లిక్ చేయండి.
- మీరు మొదటి సంవత్సరం విద్యార్థి అయితే, “TS ఇంటర్ 1వ సంవత్సరం ఫలితాలు 2024” లింక్‌పై క్లిక్ చేయండి. మీరు రెండవ సంవత్సరం విద్యార్థి అయితే, “TS ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాలు 2024″పై క్లిక్ చేయండి.
- మీ TS ఇంటర్ 2024 హాల్ టిక్కెట్ నంబర్‌ను నమోదు చేయండి.
- ‘Get Result’ బటన్‌పై క్లిక్ చేయండి.
- మీ ఇంటర్ ఫలితాలు కనిపిస్తాయి.
- డౌన్‌లోడ్ చేసిన తర్వాత, భవిష్యత్తు సూచన కోసం తెలంగాణ ఇంటర్ ఫలితాల 2024 కాపీని ప్రింట్ చేయండి.
TS Inter Results 2024
Comments are closed.