TS TET 2024 Result Date : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET 2024) పరీక్షలు జూన్ 2 తో ముగిశాయి. పరీక్షలు మే 20న ప్రారంభమై దాదాపు 12 రోజుల పాటు కొనసాగాయి. ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో (shifts) ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. పేపర్ 1 పరీక్షకు 86.03 శాతం హాజరు కాగా, పేపర్ 2 పరీక్షకు 82.58 శాతం హాజరు నమోదైంది.
తెలంగాణ టెట్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 15న విడుదలైంది.పేపర్ 1 పరీక్షకు 99,958 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 2 పరీక్షకు 1,86,423 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది టెట్ పరీక్షకు మొత్తం 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 12న టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. అభ్యర్థులు టెట్ కీ, రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్ సైట్ https://tstet2024.aptonline.in లో చెక్ చేసుకోవచ్చు.
విద్యాశాఖ ఇటీవలే పూర్తి చేసిన టెట్ పరీక్షలను తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో ఆన్‌లైన్‌లో నిర్వహించింది. మొత్తం పదకొండు జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించారు. డీఎస్సీ (DSC) నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అలాగే ప్రభుత్వ టీచర్ పోస్టుల నియామకాలకు నిర్వహించే టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (TRT) రాసేందుకు టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించవల్సి ఉంటుంది.
తెలంగాణ రెస్పాన్స్ షీట్‌లను ఇలా చెక్ చేసుకోండి :
- అభ్యర్థులు ముందుగా https://tstet2024.aptonline.inవెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- హోమ్ పేజీకి వెళ్లి, రెస్పాన్స్ షీట్‌ల లింక్‌పై క్లిక్ చేయండి.
- స్క్రీన్‌పై, జర్నల్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ మరియు పరీక్ష పేపర్ (పేపర్ 1 లేదా పేపర్ 2) వివరాలను ఎంటర్ చేయండి.
- తర్వాత, ప్రొసీడ్ క్లిక్ చేస్తే, అభ్యర్థి రెస్పాన్స్ షీట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
అభ్యంతరాలను ఈ క్రింది విధంగా వ్యక్తం చేయవచ్చు.
అభ్యర్థులు టెట్ ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను దాఖలు చేయవచ్చు. TET వెబ్‌సైట్‌లో అభ్యంతరాల కోసం https://tstet2024.aptonline.in వద్ద అబ్జెక్షన్ విండో ఉంటుంది. అభ్యర్థి జర్నల్ నంబర్, టెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, పరీక్ష పేపర్ వివరాలను నమోదు చేయవచ్చు మరియు కీపై అభ్యంతరాలు తెలియజేయవచ్చు.