TS TET 2024 : తెలంగాణ టెట్ (TET) పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మే 20న ప్రారంభమయ్యే పరీక్షల టైమ్‌టేబుల్‌ను కూడా అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలు జూన్ 6 వ తేదీ నాటికి పూర్తి చేయాలి. అయితే, పరీక్ష టైమ్‌టేబుల్‌లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. మే 27వ తేదీన తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (Graduate MLC) (ఖమ్మం, నల్గొండ, వరంగల్) స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అదే రోజు పోలింగ్ జరుగుతుంది. దీంతో ఆ రోజే జరగాల్సిన టెట్ పరీక్ష ఉంటుందా లేక షెడ్యూల్ మారుస్తారా అనేది ప్రశ్నగా మారింది.
స్వల్ప మార్పులకు అవకాశం.
తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ మే 20న ప్రారంభమై జూన్ 6న ముగుస్తుంది.అధికారులు ఈ విధంగా షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. అయితే ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు (ఉప ఎన్నిక) ఎన్నికల సంఘం (Election Commission) తాజా షెడ్యూల్‌ను ప్రకటించింది. మే 27న పోలింగ్ జరగనుంది. అయితే ఈ మూడు జిల్లాల పట్టభద్రులు ఓటింగ్‌లో పాల్గొంటారు. ఇందులో చాలా మంది టెట్ రాసేవారు ఉంటారు.
అదే రోజు పోలింగ్, పరీక్షతో పాటు సమస్యలు తలెత్తవచ్చు. ఇదే అంశంపై ఇప్పటికే విద్యాశాఖ (Education Department) అధికారులు కసరత్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. గతంలో ప్రచురించిన షెడ్యూల్‌కు చిన్నపాటి సర్దుబాట్లు చేయడం వల్ల పోలింగ్‌లో పాల్గొనడం కష్టం కాదని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
ఈసారి జరగనున్న టెట్ పరీక్షకు మొత్తం 2,83,441 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1కి 99,210 దరఖాస్తులు రాగా, పేపర్ 2కి 1,84,231 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు తెలంగాణ టెట్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం విద్యాశాఖ ఉచితంగా మాక్ టెస్టులు రాసే అవకాశం కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఆప్షన్ తీసుకొచ్చింది. https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ పరీక్షలను రాసుకొవచ్చు.
తెలంగాణ టెట్ మాక్ టెస్టులు – ప్రాసెస్ ఇదే
- తెలంగాణ టెట్ మాక్ టెస్ట్‌లు తీసుకోవడానికి, దరఖాస్తుదారులు https://tstet2024.aptonline.in/tstet/ని సందర్శించాలి.
- వెబ్‌పేజీ పైన కనిపించే TS TET మాక్ టెస్ట్-2024 ఎంపికను క్లిక్ చేయండి.
- ఇక్కడ సైన్ ఇన్ చేయడం అవసరం. కింది ఆప్షన్‌లపై క్లిక్ చేయడం ద్వారా మీకు ప్రశ్నాపత్రం ఓపెన్ అవుతుంది.
- ఇలా మీరు ఎన్నిసార్లు అయినా పరీక్షలను రాసుకోవచ్చు.
- ఈ పరీక్షలు రాయడం వల్ల ఆన్‌లైన్‌లో రాసేటప్పుడు మీరు తీసుకోవలసిన జాగ్రత్తలను అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ TET కీలక తేదీలు:
- తెలంగాణ టెట్ – 2024
- టెట్ హాల్ టికెట్లు – మే 15, 2024.
- పరీక్షలు ప్రారంభం – మే 20, 2024.
- పరీక్షల ముగింపు – జూన్ 06,2024.
- టెట్ ఫలితాలు – జూన్ 12, 2024.
- అధికారిక వెబ్ సైట్ – https://schooledu.telangana.gov.in/ISMS/