TSPSC Hall Tickets : టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 హాల్ టికెట్లు విడుదల.. పరీక్ష తేదీలు ఇవే..!
తెలంగాణలో నిరుద్యోగులకు కీలక అప్డేట్ వచ్చింది. జూన్ 9వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి టీఎస్పీఎస్సీ హాల్ టికెట్లు విడుదల చేసింది.
TSPSC Hall Tickets : ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి మరో కీలక ప్రకటన వెలువడింది. గతంలో రద్దయిన గ్రూప్ 1 పరీక్ష మరోసారి నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమైంది. జూన్ 9వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి టీఎస్పీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది. పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు TSPSC వెబ్సైట్ https://www.tspsc.gov.in/ నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో తీసుకొచ్చింది.
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్లో అందించిన డైరెక్ట్ లింక్‌ని ఉపయోగించి తమ హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ TSPSC గ్రూప్ 1 అడ్మిట్ కార్డ్ 2024ని పొందేందుకు, అభ్యర్థులు తమ ID మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి, ఆ తర్వాత క్యాప్చాను నమోదు చేయాలి. మెయిన్ పరీక్షకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి TSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ మొత్తం 536 పోస్టులను భర్తీ చేయనుంది.
గతంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష అనేక పేపర్లు లీకేజీల కారణంగా రద్దు చేయబడింది. దీంతో గతంలో ప్రిలిమినరీ పరీక్షకు జారీ చేసిన హాల్‌టికెట్లు చెల్లవని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు కొత్త హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
TSPSC గ్రూప్ 1 హాల్ టికెట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి :
- TSPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- TSPSC గ్రూప్ 1 హాల్ టికెట్ డౌన్లోడ్ కోసం అందించిన డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ ID మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి.
- క్యాప్చా ధృవీకరణను పూర్తి చేయండి.
- మీ హాల్ టిక్కెట్‌ను డౌన్లోడ్ చేసి ప్రింట్ చేయండి.
Comments are closed.