Turmeric cures Vastu Doshas: పసుపు అనగానే అందరికీ గుర్తు వచ్చేది యాంటీ బయోటిక్. పసుపులో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి.పసుపులో ఉండే ఔషధ లక్షణాలు మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి.
పసుపు రోగాలను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే ఏదైనా గాయం అయిన వెంటనే ఆ ప్రదేశంలో పసుపును పెడుతుంటారు. ఈ విధంగా చేయడం వలన పసుపు యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది.
చాలా రకాల వంటల్లో పసుపు ను ఉపయోగిస్తారు. పసుపు ను పూజలు, శుభకార్యాలు మరియు వంటలలో నే కాకుండా, వాస్తు ప్రకారం కూడా మంచి శుభ ఫలితాలను అందిస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పసుపుతో కొన్ని రకాల వాస్తు దోషాలకు చెక్ పెట్టవచ్చని వాస్తు పండితులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం. Turmeric cures Vastu Doshas
ఆర్థిక సమస్యలతో బాధపడేవారు పసుపు ను ఉపయోగించి ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు. పసుపు ను ముద్దలా చేసి ఎరుపు రంగు వస్త్రంలో కట్టాలి. తర్వాత ఆ వస్త్రాన్ని డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ఆర్థిక ఇబ్బందులు మెల్లగా తగ్గుముఖం పడతాయి.
సంపాదించిన డబ్బు అంతా వృధాగా ఖర్చు అవుతుంటే, వారు కూడా క్రమం తప్పకుండా ఈ రెమెడీ ని పాటించినట్లయితే వృధా ఖర్చులు కూడా తగ్గుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Also Read : Vaastu Tips : వాస్తు శాస్త్ర ప్రకారం మీ ‘పడక గది’ని ఇలా ఉంచండి. తరచూ గొడవలు లేని దాంపత్య జీవితాన్ని పొందండి.
ఇంటి ప్రధాన ద్వారం మీద పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయడం వలన వాస్తు పరమైన దోషాలు ఉంటే తొలగిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే స్వస్తిక్ సింబల్ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆపుతుంది. ఆ ఇల్లు ప్రతినిత్యం పాజిటివ్ తో నిండి ఉంటుంది.
ఇంట్లో అధికంగా గొడవలు అవుతున్న వారు మరియు మానసిక ప్రశాంతత లేని వారు ఈ స్వస్తిక్ గుర్తును ఇంటి ప్రధాన ద్వారం పై కుడి వైపు ఉండేలా గీస్తే సమస్యలు తొలగిపోతాయి.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజూ పసుపు నీటిని చల్లడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు ప్రధాన ద్వారం దగ్గర, పసుపు నీటిని చల్లడం వలన ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుంది.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు కూడా ప్రతిరోజు పసుపు నీటిని ప్రధాన ద్వారం దగ్గర చల్లడం వలన ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.
కాబట్టి వాస్తు శాస్త్రం పై నమ్మకం ఉన్నవారు పాటించండి. ఇంట్లోకి పాజిటివ్ శక్తిని ఆహ్వానించండి. తద్వారా మానసిక ప్రశాంతత మరియు ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయట పడండి.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…