TVS ICube: వాహనాల వినియోగం ఈరోజుల్లో అధికంగా పెరిగింది. ఎక్కడికి వెళ్లిన బైక్స్ (Bikes) , ఇతర వాహనాలను వాడుతూనే ఉంటున్నాం. అయితే, మీరు కూడా కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) అయిన ఐక్యూబ్ పోర్ట్పోలియో (I Cube Port Folio) ను విస్తరించింది.
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) తాజాగా రెండు అదనపు కొత్త ఫీచర్ల (New Feature) ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ రెండు కొత్త ఫీచర్లను చేర్చడంతో, స్కూటర్ ఇప్పుడు మొత్తం ఐదు ఎంపికలను కలిగి ఉంది. టీవీఎస్ (TVS) కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను పదకొండు రంగుల్లో అందిస్తోంది. iCube బేస్ (icube Base) మోడల్ రెండు కొత్త వేరియంట్లలో ఒకటి.అయితే, దీని యొక్క ధర రూ. 95 వేలు (ఎక్స్-షోరూమ్) కి కంపెనీ నిర్ణయించింది.
టీవీఎస్ ఐక్యూబ్ యొక్క బేసి వేరియంట్ 2.2kwh బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంది. పూర్తిగా ఛార్జ్ (Full Charge) చేస్తే 75 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. అంటే, దీని గరిష్ట వేగం గంటకు 75 కి.మీ అని చెప్పవచ్చు. రెండు గంటల్లో బ్యాటరీని 80% వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్‌లో 5-అంగుళాల TFT డిస్‌ప్లే, GPS మరియు థెఫ్ట్ అలారం (Teft Alaram) వంటి ఫీచర్లు ఉన్నాయి. సీటు కింద 30 లీటర్ల స్టోరేజ్ ను అందించారు.
మరో కొత్త మోడల్ ఏంటంటే TVS iQube ఎస్టీ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.4kWh బ్యాటరీ కెపాసిటీ (Battery Capacity) ని కలిగి ఉంది. ఈ వెహికిల్ యొక్క ధరను రూ. 1.56 లక్షలు (ఎక్స్-షోరూమ్)కి కంపెనీ నిర్ణయించింది. ఈ స్కూటర్ ని పూర్తిగా ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. బ్యాటరీ 2.50 గంటల్లో 80% వరకు ఛార్జ్ అవుతుంది. ఇది 7-అంగుళాల TFT డిస్ప్లేను కలిగి ఉంది. ఈ కార్ట్‌లో బ్లూటూత్ (Bluetooth) , అలెక్సా వాయిస్ అసిస్టెన్స్ (Alexa Voice Assistance) మరియు డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అయితే, ఇందులోనే TVS iCup ST యొక్క 5.1kwh ఎడిషన్ కూడా ఉంది. దీని ధర రూ.1.85 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఈ వెహికిల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీ ప్రయాణించగలదు. దీని గరిష్ట వేగం గంటకు 82 కి.మీ ఉంటుంది. 4.18 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
జూలై 15లోపు ST వెర్షన్‌లను బుక్ చేసుకున్న వారికి లాయల్టీ బోనస్ ద్వారా రూ.10,000 తగ్గింపు లభిస్తుంది. రెండు కొత్త వేరియంట్లతో పాటు, స్కూటర్ ఇప్పుడు ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
ఐక్యూబ్ (2.2kwh),
ఐక్యూబ్ (3.4kwh),
ఐక్యూబ్ ఎస్ (3.4kwh),
ఇక్యూబ్ ఎస్టీ (3.4kwh),
ఇక్యూబ్ ఎస్టీ (5.1 kwh).
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…