Telugu Mirror : భారత దేశంలో TVS మోటార్స్(TVS Motors) తనదైనా గుర్తింపు తో TVS రైడర్ 125 యొక్క మరో స్టైలిష్ సూపర్ స్క్వాడ్ ఎడిషన్‌ను ప్రారంభించారు. సూపర్ హీరోస్ అయినా మార్వెల్ ను ప్రేరణగా తీసుకొని ప్రత్యేకమైన డిజైన్ తో రూపొందించబడింది. ఐరన్ మ్యాన్ మరియు బ్లాక్ పాంథర్ స్ఫూర్తితో రూపొందించి, దేశం మొత్తంలో అన్ని TVS స్టోర్లలో ఈ మోటార్ సైకిల్ రూ. 98,919 తో లభ్యమవనుంది.
Reliance Jio: త్వరలో జియో నుంచి అద్భుతమైన ఫీచర్స్ తో రెండూ 5G స్మార్ట్ ఫోన్స్ విడుదల
ఇతర రైడర్ వెర్షన్స్ వలె ఇది మూడు వెర్షన్స్ తో మనకు అందుబాటులో ఉంది.యూత్ కి ఎంతగానో దగ్గరయిన ఈ సూపర్ స్క్వాడ్ ఎడిషన్ టాప్ వెర్షన్ కనెక్టివిటీతో రూపొందించబడింది. సూపర్ హీరో మార్వెల్ ఈ ఉత్పతుల(Products) ను కొత్తగా మొదటి సారి మాత్రమే అందించడం లేదు. ఈ సూపర్ స్క్వాడ్ ఎడిషన్(Super Squad eddition) మార్వెల్ ఫాన్స్ లో మంచి క్రేజ్ ని తీసుకొచ్చింది.ఇది సింగల్ సీట్ కెపాసిటీ , స్ప్లిట్ సీట్ మరియు SX వేరియంట్ లను కలిగి ఉంది.యాంత్రికంగా ఈ మోటార్ బైక్ లో చేర్పులు మార్పులు ఏమి చేయలేదు. ప్రస్తుతం ఇప్పటి తర ఇంజన్నే అందిస్తుంది. ఔట్లుక్ డిజైన్లని మాత్రం స్టైలిష్ గా ఆకర్షణీయంగా మార్చారు.
ఫీచర్లు :
ఈ సూపర్ ఎడిషన్ బైక్స్ లో 124.8cc, 4-స్ట్రోక్, 3-వాల్వ్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ మోటార్ బైక్‌కు శక్తినిస్తుంది. ఈ ప్రత్యేకమైన ఎడిషన్ ఇంజిన్ 6,000rpm వద్ద 11.2Nm శక్తిని కలిగిస్తుంది. మరియు 7500rpm వద్ద 11.4hp టార్క్ ని ఉత్పత్తి చేసే పవర్(Power) ని కూడా కలిగి ఉంది. పవర్ ని కూడా అందజేస్తుంది. ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన Fi ఇంజిన్(Fi engine) 5-స్పీడ్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది మరియు 60 kmpl కంటే ఎక్కువ ప్రయాణం చేయొచ్చు.
ఈ ప్రత్యేకమైన మోడల్ బ్రేకింగ్ విషయానికి వస్తే బైక్(bike) కి ముందు 240mm డిస్క్ మరియు వెనుక 130mm డ్రమ్ ను కలిగి ఉంటుంది. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 10 లీటర్లు మరియు బైక్ కి టైర్లు ఇరువైపులా 17 అంగుళాలతో నడుస్తుంది . సీటు హయిట్ 780ఎంఎం మరియు బైక్ యొక్క కార్బ 123 కిలోల బరువు ఉంటుంది. ఇక ఎలక్ట్రానిక్(Electronic) విషయానికి వస్తే , TVS రైడర్ 125 గేర్ స్థానం సూచించే పరికరంతో కూడిన డిజిటల్ పరికర క్లస్టర్(Cluster) ను కలిగి ఉంది.వివిధ మోడ్ లలో అందించే పవర్ మోడ్ మరియు ఎకో మోడ్ తో కూడి ఉంది.