కొత్త తరం కోసం దూసుకు వచ్చిన TVS RTR 310 స్పోర్ట్స్ బైక్

tvs rtr 310is a new generation sports bike
image credit : Auto Car India

Telugu Mirror: టివిఎస్ కంపెనీ (TVS Company) నుండి న్యూ జనరేషన్ కోసం తీసుకు వచ్చిన అపాచీ సిరీస్ (Apache Series) లో మొదటిదైన అపాచీ ఆర్‌టిఆర్ 310 లాంఛ్ అవడంతో అపాచీ సిరీస్ విక్రయాలు డబుల్ అవుతాయని టివిఎస్ మోటార్ కంపెనీ భావిస్తోంది.

ఈ రోజు టివిఎస్ (TVS) కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడిన స్పోర్ట్స్ బైక్ కోసం బుకింగ్ లు ఈ నెలాఖరులోపు డెలివరీలతో మొదలవుతాయి. కొత్త RTR 310 బైక్ ఇప్పుడు దాని ప్రస్తుత ప్రొడక్ట్ అయిన Apache RR310తో పాటు 250-350cc సెగ్మెంట్లో అమ్మకాలకు లభిస్తాయి.

టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ డైరెక్టర్‌, సీఈవో కేఎన్‌ రాధాకృష్ణన్‌ (CEO K S Radhakrishna) మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ “ఈ బైక్ యొక్క బుకింగ్ లు మొదలైనవి. ఈ నెల చివరిలో ట్రయల్ రైడ్ లు కూడా ప్రారంభమవుతాయని వినాయక చతుర్థి అనంతరం నెలాఖరులో డెలివరీ మొదలై భారత దేశం (India) లో దీపావళికి అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా ఇతర మార్కెట్ లలో, లాటిన్ అమెరికా  (Latin America) , ఆసియా (Asia) తోపాటు యూరప్ (Europe) లలో విక్రయించబడుతుంది. యూరప్ లో రాబోయే ఆర్థిక సంవత్సరంలో అందించవచ్చు.” అని చెప్పారు.“ఈ ప్రారంభంతో, ఇప్పుడు మేము భారతదేశంలో ఈ బైక్ అమ్మకాలను తప్పకుండా రెట్టింపు చేయాలని చూస్తున్నాము, ఇది ప్రస్తుతం 6,000 నుండి 7,000 వరకు ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు మేము దీనిని ప్రారంభించిన మొదటి సంవత్సరంలో RR310 మరియు RTR310 మధ్యన కనీసం 25,000 వరకు ఉంటాయని భావిస్తున్నాము.

tvs rtr 310 is a new generation sports bike
image credit : TVS Motor

కొత్త TVS Apache RTR 310, TVS Apache RR 310, BWM G 310 R, G 310 GS మరియు G 310 RR బైక్ మోడల్ వలెనే 312.12 cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. భారతీయ మార్కెట్లో RTR 310 ధర రూ. 2.43 లక్షల (ఎక్స్ – షో రూమ్) వద్ద అందుబాటులో ఉంటుంది.

దాదాపు ₹ 50 కోట్ల వ్యయంతో ఈ బైక్ ను యువతను లక్ష్యంగా చేసుకుని డెవలప్ చేయబడింది మరియు డిజైన్ పరంగా, ఇది దాని ఫ్రీస్టైలింగ్ పరంగా రూపొందించబడింది మరియు డైనమిక్‌గా ఉంది అలాగే కంపెనీ రెండు కిట్‌లతో బైక్ ను – డైనమిక్ మరియు డైనమిక్ ప్రో డిజైన్ ఆప్షన్స్ తో అందిస్తుంది, RR 310లో అందించినటువంటి ఫ్యాక్టరీ కస్టమ్-బిల్ట్ కిట్ యువతను టార్గెట్ చేసుకుని రూపొందించింది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in