Telugu Mirror: టివిఎస్ కంపెనీ (TVS Company) నుండి న్యూ జనరేషన్ కోసం తీసుకు వచ్చిన అపాచీ సిరీస్ (Apache Series) లో మొదటిదైన అపాచీ ఆర్‌టిఆర్ 310 లాంఛ్ అవడంతో అపాచీ సిరీస్ విక్రయాలు డబుల్ అవుతాయని టివిఎస్ మోటార్ కంపెనీ భావిస్తోంది.
ఈ రోజు టివిఎస్ (TVS) కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడిన స్పోర్ట్స్ బైక్ కోసం బుకింగ్ లు ఈ నెలాఖరులోపు డెలివరీలతో మొదలవుతాయి. కొత్త RTR 310 బైక్ ఇప్పుడు దాని ప్రస్తుత ప్రొడక్ట్ అయిన Apache RR310తో పాటు 250-350cc సెగ్మెంట్లో అమ్మకాలకు లభిస్తాయి.
టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్, సీఈవో కేఎన్ రాధాకృష్ణన్ (CEO K S Radhakrishna) మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ “ఈ బైక్ యొక్క బుకింగ్ లు మొదలైనవి. ఈ నెల చివరిలో ట్రయల్ రైడ్ లు కూడా ప్రారంభమవుతాయని వినాయక చతుర్థి అనంతరం నెలాఖరులో డెలివరీ మొదలై భారత దేశం (India) లో దీపావళికి అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా ఇతర మార్కెట్ లలో, లాటిన్ అమెరికా (Latin America) , ఆసియా (Asia) తోపాటు యూరప్ (Europe) లలో విక్రయించబడుతుంది. యూరప్ లో రాబోయే ఆర్థిక సంవత్సరంలో అందించవచ్చు.” అని చెప్పారు.“ఈ ప్రారంభంతో, ఇప్పుడు మేము భారతదేశంలో ఈ బైక్ అమ్మకాలను తప్పకుండా రెట్టింపు చేయాలని చూస్తున్నాము, ఇది ప్రస్తుతం 6,000 నుండి 7,000 వరకు ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు మేము దీనిని ప్రారంభించిన మొదటి సంవత్సరంలో RR310 మరియు RTR310 మధ్యన కనీసం 25,000 వరకు ఉంటాయని భావిస్తున్నాము.
కొత్త TVS Apache RTR 310, TVS Apache RR 310, BWM G 310 R, G 310 GS మరియు G 310 RR బైక్ మోడల్ వలెనే 312.12 cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. భారతీయ మార్కెట్లో RTR 310 ధర రూ. 2.43 లక్షల (ఎక్స్ – షో రూమ్) వద్ద అందుబాటులో ఉంటుంది.
దాదాపు ₹ 50 కోట్ల వ్యయంతో ఈ బైక్ ను యువతను లక్ష్యంగా చేసుకుని డెవలప్ చేయబడింది మరియు డిజైన్ పరంగా, ఇది దాని ఫ్రీస్టైలింగ్ పరంగా రూపొందించబడింది మరియు డైనమిక్‌గా ఉంది అలాగే కంపెనీ రెండు కిట్‌లతో బైక్ ను – డైనమిక్ మరియు డైనమిక్ ప్రో డిజైన్ ఆప్షన్స్ తో అందిస్తుంది, RR 310లో అందించినటువంటి ఫ్యాక్టరీ కస్టమ్-బిల్ట్ కిట్ యువతను టార్గెట్ చేసుకుని రూపొందించింది.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…