TVS Super Bikes: సరసమైన ధరల్లో సూపర్ బైకులు, ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ
సరసమైన ధరల్లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
TVS Super Bikes: బైక్స్ వినియోగం ఈరోజుల్లో అధికంగా పెరిగింది. ఎక్కడికి వెళ్లిన బైక్స్, ఇతర వాహనాలను వాడుతూనే ఉంటున్నాం. అయితే, మీరు కూడా కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? కానీ, ఏ బైక్ కొనాలో అర్ధం కాట్లేదా? అయితే, సరసమైన ధరల్లో మంచి మైలేజ్ (Milage) ఇచ్చే బైక్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
TVS స్టార్ సిటీ ప్లస్ (TVS Star City Plus)
TVS నుండి వచ్చిన మరో బైక్, TVS స్టార్ సిటీ ప్లస్ అధిక మైలేజీ (High Mileage) ని కలిగి ఉంటుంది. ఈ బైక్ 70 కిలోమీటర్ల పరిధిని కూడా అందించగలదు. ఇది సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఫోర్-స్ట్రోక్ EFI ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ (Fuel Tank Capacity) కెపాసిటీ 10 లీటర్లు ఉంటుంది. 4 స్పీడ్ గేర్ బాక్స్ ఆప్షన్స్ తో వస్తుంది. ఇది 8.08పీఎస్ పవర్, 8.7 NM టాక్స్ ని ఉత్పత్తి చేస్తుంది. గరిష్టంగా ఇది 80.09 కీ.మీ మైలేజ్ ని ఇస్తుంది మరియు గరిష్టంగా 90 కీ.మీ ప్రయాణిస్తుంది. దీని బరువు 110 కిలోలు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ డిస్క్ (Front Disk) రియర్ డ్రమ్ ను కలిగి ఉంది. ఈ బైక్ యొక్క ప్రారంభ ధర రూ. 72 వేలు ఉంది.
టీవీఎస్ స్పోర్ట్స్ బైక్ (TVS Sports Bike)
అందరికీ అందుబాటులో ఉండేలా.. సరసమైన ధరల్లో టీవీఎస్ స్పోర్ట్స్ బైక్ ఒకటి. ఇక బైక్ గురించి తెలియాలంటే.. టీవీఎస్ స్పోర్ట్ బైక్ కూడా అత్యుత్తమ మైలేజ్ మోటార్ బైక్ ల జాబితాలో ఒకటి. ఈ బైక్ దాదాపు 75 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఆన్ రోడ్డు మైలేజ్ బైక్స్ లో ఇది నెంబర్ 1 బైక్ అని కంపెనీలు కూడా చెబుతున్నాయి. ఈ బైక్ రకరకాల రంగుల్లో లభిస్తుంది. బరువు కూడా తక్కువే. ఇది సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇటిఎఫ్‌ఐ టెక్నాలజీ 110 సిసి ఇంజన్‌తో పనిచేస్తుంది. ఫోర్ స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది.ఇది 8.19 పీఎస్ పవర్, 8.7 NM టాక్స్ ని ఉత్పత్తి చేస్తుంది.ఈ బైక్ యొక్క ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు ఉంటుంది. దీని ధర రూ. 67,000 నుండి ప్రారంభం అవుతుంది.
టీవీఎస్ రైడర్ బైక్ (TVS Rider Bike)
టీవీఎస్ నుండి వచ్చిన టీవీఎస్ రైడర్ బైక్ ఒకటి. ఈ బైక్ 124.8 cc సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఫోర్-స్ట్రోక్ EFI ఇంజిన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది 11.38పీఎస్ పవర్, 11.8 NM టాక్స్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఒక లీటర్ కి 71.91 కీ.మీ మైలేజీను ఇస్తుంది. యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, టీవీఎస్ రైడర్ ఎకో , స్పోర్ట్స్ రైడింగ్ మోడ్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఇది 5 సుపీడ గేర్ బాక్స్ లను కలిగి ఉంది. ఈ బైక్ యొక్క ప్రారంభ ధర రూ. 98,709 నుండి ప్రారంభం అవుతుంది.
Comments are closed.