Reliance Jio: త్వరలో జియో నుంచి అద్భుతమైన ఫీచర్స్ తో రెండూ 5G స్మార్ట్ ఫోన్స్ విడుదల

Telugu Mirror: భారత దేశానికి చెందిన బహుళ జాతీయ బహుముఖ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries)భారతీయ మొబైల్ మార్కెట్‌లో జియో నుంచి ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్లు సమాచారం . ఈ పరికరాల గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రానప్పటికీ, అవి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్ నుండి గుర్తింపును పొందాయి, BIS నుంచి ధృవీకరణ జరగడం అనేది త్వరలో ఫోన్ ల విడుదలను సూచిస్తుంది. ఆగస్ట్ 28న జరుగుతున్న రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశ (AGM) ఈవెంట్ లో ఎప్పటినుండో ఆతృత గా ఎదురుచూస్తున్న కొత్త జియో ఫోన్‌(Jio Phone)ల గురించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చిస్తున్న Jio పరికరాలు 4GB RAM మరియు 32GBఇంటర్నల్ స్టోరేజ్(internal storage) కెపాసిటీ తో పాటు స్నాప్‌డ్రాగన్ 480 SoC ద్వారా శక్తిని పొందుతాయని అనుకుంటున్నారు.

గాడ్జెట్స్ లీకర్ ముకుల్ శర్మ (@stufflistings) Jio ఫోన్‌లు BIS జాబితాలో లిస్ట్ అయిన విషయాన్ని స్క్రీన్ షాట్ ద్వారా X (ట్విట్టర్)లో షేర్ చేశాడు. టిప్ స్టర్ ద్వారా లీక్ అయిన సమాచారం లో రాబోయే రిలయన్స్ Jio స్మార్ట్ ఫోన్ ల మోడల్ నంబర్ లు JBV161W1 మరియు JBV162W1 కలిగి ఉన్న డివైజ్ లు ఆగస్ట్ 11, శుక్రవారం నాడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) యొక్క ఆమోదాన్ని పొందాయి. ఈ జాబితాలో కేవలం మోడల్ నంబర్‌లను మాత్రమే వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్‌లకు చెందిన ఎటువంటి స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు.

Image Credit: Gadgets Now

Also Read: Tecno Pova 5: అద్భుతమైన ఫీఛర్స్, సూపర్ స్పెసిఫికేషన్స్ తో Tecno pova 5 మరియు Tecno Pova 5 Pro..త్వరలో మీ కోసం

రిలయన్స్ జియో కూడా త్వరలో విడుదల అవుతున్న జియో ఫోన్‌ల గురించి ఎలాంటి స్పెక్స్ ని వెల్లడించలేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వారి 46వ వార్షిక సమావేశం (AGM) ఆగష్టు 28 భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమంలో రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ కొత్త జియో ఫోన్‌ల గురించి సమాచారాన్ని వెలువరిస్తారని రిలయన్స్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

జియో ఫోన్‌ల చుట్టూ గత కొద్ది కాలంగా పుకార్లు తిరుగుతూనే ఉన్నాయి. గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లో గతంలో చూసినప్పుడు Jio LS1654QB5 మోడల్ నంబర్‌ని కలిగిన Jio ఫోన్‌ని చూపెట్టినారు. ఈ పరికరం స్నాప్‌డ్రాగన్ 480+ SoCని కలిగి దానితో పాటు Adreno 619 GPU అలాగే 4GB RAM కెపాసిటీ కలిగి ఉంది.

విడుదలకు సిద్ధమైన Jio 5G డివైజ్ లో 32GB ఇంటర్నల్ స్టోరేజ్ నిల్వ మరియు 13-మెగాపిక్సెల్ డ్యూయల్ బ్యాంక్ కెమెరా సెటప్ ని గత లీక్‌లలో కనిపించాయి. రాబోయే హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 12తో నడుస్తుందని అంచనా అదేవిధంగా 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు అని భావిస్తున్నారు. డివైజ్ ముందు భాగంలో సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉన్న Jio ఫోన్ 18W 5,000mAh బ్యాటరీని కలిగి దానికి 18W ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని రూమర్స్ వచ్చాయి.

Leave A Reply

Your email address will not be published.