UPI Lite : యూపీఐ లైట్ పై ఆర్బీఐ కీలక నిర్ణయం, చెల్లింపుల్లో ఇక ఇబ్బందులు ఉండవు
UPI లైట్ రెండేళ్ల క్రితం సెప్టెంబర్ 2022లో ప్రారంభం అయింది. ఆర్బీఐ కీలక నిర్ణయం ఏంటంటే?
UPI Lite : UPI లైట్‌ని విస్తరించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించడానికి, UPI లైట్ ఇ-మాండేట్ కిందకు తీసుకొస్తున్నట్లు తెలిపింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)కి సౌలభ్యంగా తీసుకొచ్చిన వెర్షన్ UPI లైట్.
UPI లైట్ రెండేళ్ల క్రితం సెప్టెంబర్ 2022లో ప్రారంభం అయింది. ఇది మనీ వాలెట్‌గా పనిచేస్తుంది. UPI లైట్‌తో చెల్లింపులు చేసేటప్పుడు PINని నమోదు చేయవలసిన అవసరం లేదు. ప్రస్తుతం, UPI లైట్ రోజువారీ పరిమితి రూ. 2000. అంటే UPI లైట్‌ని ఉపయోగించి ఒక రోజులో రూ. 2,000 చెల్లించవచ్చు. అయితే ఒక్క లావాదేవీలో రూ. 500 చెల్లించలేరు.
రిజర్వ్ బ్యాంక్ తన ఇ-మాండేట్ సిస్టమ్‌లో UPI లైట్‌ని యాడ్ చేసింది. ఇ-మాండేట్ పద్ధతిని ఉపయోగిస్తున్నప్పుడు, బ్యాలెన్స్ ఆటోమేటిక్‌గా UPI వాలెట్‌లోకి లోడ్ అవుతుంది. వినియోగదారు డబ్బును లోడ్ చేయడం మర్చిపోయినా, పేర్కొన్న పరిమితి కంటే బ్యాలెన్స్ తగ్గినప్పుడు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నుండి UPI లైట్ ఆటోమేటిక్‌గా మనీ లోడ్ చేస్తుంది.
ఈ పరిమితిని వినియోగదారు నిర్ణయించాలి. దాంతో, వాలెట్ బ్యాలెన్స్ ఎప్పుడూ తగ్గకుండా ఉంటుంది. డిజిటల్ చెల్లింపులు చేయడం సులభంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది, మీరు ఇక ఎక్కడికి వెళ్లినా నగదు అవసరం ఉండదు.
RBI యొక్క ‘పరపతి విధాన కమిటీ’ (RBI MPC సమావేశం జూన్ 2024 ముగింపులు) యొక్క ముగింపులను ఈరోజు ప్రకటించిన RBI గవర్నర్ శక్తికాంత దాస్, UPI లైట్లో అమలు చేస్తున్న సర్దుబాట్లను కూడా వెల్లడించారు.
ఫాస్టాగ్ వినియోగదారులకు శుభవార్త..
RBI గవర్నర్ ప్రకారం, ఫాస్ట్‌ట్యాగ్‌తో పాటు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) ఈ మాండేట్ సిస్టమ్ లో చేర్చబడుతుంది. ఫలితంగా, వాలెట్లోని బ్యాలెన్స్ వినియోగదారు పేర్కొన్న పరిమితి కంటే తక్కువగా ఉంటే, లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నుండి వాలెట్‌కు ఆటోమేటిక్ గా డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. దీంతో టోల్గేట్ ఛార్జీలు, ప్రయాణ సమయంతో ఎలాంటి ఇబ్బందులు రావు.
RBI MPC రికార్డు స్థాయిలో వరుసగా ఎనిమిదోసారి రెపో రేటును స్థిరంగా ఉంచింది. భారతీయ ఆర్థిక వ్యవస్థపై రిజర్వ్ బ్యాంక్ తన అంచనాలను పెంచింది, 2024-25కి దాని GDP వృద్ధి అంచనాను 7.2%కి పెంచింది.
Comments are closed.