UPSC Results 2024, valuable Information : యూపీఎస్సీ సివిల్స్‌ ఫైనల్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్‌ ఇదే.

ప్రతిష్టాత్మక ఐఏఎస్, ఐపీఎస్ తదితర కేంద్ర సర్వీసుల రిక్రూట్మెంట్ పరీక్ష సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (UPSC CSE),2023 ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది.

UPSC Results 2024 : దేశవ్యాప్తంగా అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల ఎంపిక కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (CSE)- 2023 ఫలితాలు విడుదలయ్యాయి. UPSC Civil Services Final Results ను  యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తం 1016 మందిని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్ 2023 నోటిఫికేషన్‌ను ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1105 వివిధ సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగాలు భర్తీ చేయ‌నున్నారు

ఇందులో జనరల్‌ కోటాలో 347 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీ 165 , ఎస్టీ విభాగం నుంచి 86 మంది చొప్పున ఎంపికయ్యారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్‌ సర్వీసులకు 180 మంది ఎంపిక కాగా ఐఎఫ్‌ఎస్‌కు 37, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. ఇక సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ – ఎ కేటగిరీలో 613 మంది, గ్రూప్‌ బి సర్వీసెస్‌లో 113 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది.

ఈ ఏడాది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఎ, గ్రూప్ బి నియామకాలకు మొత్తం 1016 మంది ఉత్తీర్ణత (UPSC CSE final results) సాధించారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు 2023 మే 28న, యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో నిర్వహించారు. 2024 జనవరి 2 నుంచి ఏప్రిల్ 9 వరకు దశలవారీగా పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ రౌండ్ నిర్వహించారు.

UPSC Results 2024

అభ్యర్థులకు యూపీఎస్సీ సూచన.

అభ్యర్థులకు ఫలితాలపై ఏమైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించవచ్చునని యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. సమాచారం కోసం గానీ, లేదా స్పష్టత కోసం అన్ని వర్కింగ్ డేస్‌లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 011 23385271, 011 23098543, 011 23381125 ల్యాండ్ లైన్ నెంబర్లలో లేదా ఫెసిలిటేషన్ కౌంటర్‌లో సంప్రదించవచ్చని యూపీఎస్సీ సూచించింది.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..?

1. ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.upsc.gov.in ఓపెన్‌ చెయ్యాలి.

2.హోమ్‌పేజ్‌లో కనిపించే ‘Final Result – CIVIL SERVICES EXAMINATION, 2023’ ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలి.

3. క్లిక్ చేయగానే సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్‌ కనిపిస్తుంది.

4. సివిల్స్‌ సర్వీసెస్ తుది ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

5. మీ పేరును చెక్‌ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నంబర్/ రోల్ నంబర్‌తో చెక్ చేసుకోవాలి.

UPSC Results 2024

Comments are closed.