కొన్ని రకాల మొక్కలు (Plants) ఇంటికి అందాన్ని తీసుకురావడంతో పాటు, అదృష్టాన్ని మరియు సంపదను కూడా తెస్తాయి. కనుక చాలామంది ఇంటి ఆవరణలో మరియు ఇంటి లోపల కొన్ని రకాల మొక్కలను పెంచుకోవడం చాలా శుభ ప్రద్రంగా భావిస్తారు.
వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలు ఇంటికి హాని (harm) కలిగిస్తాయి. మరి కొన్ని రకాల మొక్కలు ఇంటికి సుఖసంతోషాలను మరియు అదృష్టాన్ని తీసుకురావడంతో పాటు ఇంట్లో సానుకూలత మరియు శ్రేయస్సును కూడా వచ్చేలా చేస్తాయి.
ఇటువంటి మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. డబ్బు ప్రవాహం (Money flow) పెరుగుతుంది. ఇటువంటి మొక్కలను లక్కీ ప్లాంట్స్ అని పిలుస్తారు.
ఈ రోజు కథనంలో వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎటువంటి మొక్కలు పెంచుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.
మనీ ప్లాంట్ :
మనీ కి మరియు మనీ ప్లాంట్ కి మధ్య ఉన్న సంబంధం అందరికీ తెలిసిన విషయమే. చాలామంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ లు ఉంటున్నాయి. అయితే ఈ మొక్కను సరైన స్థలంలో మరియు సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడూ కూడా కిందకు వ్రేలాడ కూడదు. మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడూ పైకే ప్రాకుతూ ఉండాలి. మనీ ప్లాంట్ ను పెంచే ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. మనీ ప్లాంట్ మొక్కను ఆగ్నేయ దిశ (Southeast direction) లేదా వాయువ్య దిశ (Northwest direction) లో పెంచితే మంచిది.
లక్కీ బాంబు :
వాస్తు శాస్త్రం ప్రకారం లక్కీ వెదురు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఇంటి లోపల లేదా ఇంటి ముందు వెదురు మొక్కను ఉంచడం చాలా శుభప్రదంగా చెప్పబడుతుంది. ఇంటి ముందు వెదురు చెట్టు నాటడం వీలుకాకపోతే ఇంటి లోపల ఈశాన్యం (Northeast) లేదా ఉత్తరం (North) వైపు వెదురు మొక్కను ఉంచవచ్చు. ఈ మొక్కను ఈ దిశలో ఉంచడం వలన కొద్ది రోజుల్లోనే మార్పును గమనిస్తారు. అందుకే ఈ మొక్కను అదృష్టం తెచ్చే మొక్కగా పిలుస్తారు.
Also Read : VAASTU TIPS : లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఈ మూడు వస్తువులు ఇంట్లో ఇలా ఉండాలి!
జెడ్ ప్లాంట్ :
జెడ్ ప్లాంట్ మొక్క సంపదను మరియు సానుకూల శక్తి (Positive energy) ని ఆకర్షిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ మొక్క ఆకులు మందంగా మరియు గుండ్రటి ఆకారంలో ఉంటాయి. ఈ మొక్కని ఇంట్లో పెంచుకోవడం చాలా సులభం. ఈ మొక్క విజయానికి మరియు శ్రేయస్సుకు ప్రాతినిథ్యం గా మారుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
దానిమ్మ :
దానిమ్మ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఈ మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకోవడం వల్ల ఆ ఇంటికి శ్రేయస్సు లభిస్తుంది. ఇంట్లో దానిమ్మ మొక్క ఉండడం వల్ల అప్పుల బాధలనుండి ఉపశమనం కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అయితే దానిమ్మ మొక్కను ఎప్పుడూ కూడా నైరుతి దిశ (Southwest direction) లో మాత్రం పెంచ కూడదు.
Also Read : Vaastu Tips : అన్నపూర్ణా దేవి అనుగ్రహం పొందాలంటే, వంట గదిలో ఈ వస్తువులను ఉంచకండి
స్నేక్ ప్లాంట్ :
స్నేక్ ప్లాంట్ మొక్క గాలిలో ఉన్న విషవాయువులను (Poisonous gases) గ్రహిస్తుంది. ఈ స్నేక్ ప్లాంట్ ను ఇంట్లో ఉంచడం వల్ల ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. గాలిని ప్యూరిఫైర్ చేస్తుంది. ఈ మొక్కను పెంచడం కోసం ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు.
Also Read : Vaastu Tips : మనీ పర్స్ ఇలా ఉంటే మహాలక్ష్మి మీ వెంటే
కాబట్టి వాస్తు శాస్త్రం మీద నమ్మకం ఉన్న వారు ఈ మొక్కలను ఇంటిలో పెంచుకోండి. తద్వారా అదృష్టాన్ని మరియు సిరిసంపదలను పొందండి.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…