హిందూ సాంప్రదాయం ప్రకారం ముఖ్యమైన పండుగలలో దీపావళి పండుగ (Diwali festival) ఒకటి. దసరా నవరాత్రులు ముగిశాయి. ఇప్పుడు అందరూ ఎంతగానో ఎదురు చూసే పండుగ దీపావళి పండుగ. హిందూ మతంలో దీపావళి పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం దీపావళి పండగను జరుపుకోవడానికి కొన్ని కథలు ఉన్నాయి.
రాక్షసుడైన నరకాసురుడుని వధించి ప్రజలకు మరియు మునులకు రాక్షసుడు నుండి విముక్తి కలిగించిన రోజును దీపావళి పండుగ గా జరుపుకుంటారు.
ఇదే కాకుండా శ్రీరాముడు వనవాసం పూర్తి చేసుకుని తిరిగి అయోధ్యకు వచ్చిన రోజు సందర్భంగా కూడా దీపావళి పండుగను జరుపుకుంటారని పురాణాలలో వ్రాయబడింది. అప్పటి నుండి దీపావళి పండుగను జరుపుకునే ఆనవాయితీ (custom) కొనసాగుతుంది.
Also Read : Vaastu Tips : ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయండి లక్ష్మీ కటాక్షం పొందండి
దీపావళి పండుగకు ముందే ప్రజల తమ ఇంటిని దుమ్ము లేకుండా శుభ్రం చేసుకుని అందంగా అలంకరించుకోవడం మొదలుపెడతారు. కొంతమంది ఇంటికి రంగులు (Colors) కూడా వేయిస్తుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం మరియు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ ఇంటి పై ఉండాలంటే వాస్తు ప్రకారం కొన్ని రకాల రంగులను ఇంటి గోడలకు వేయించడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గోడలకు ఎటువంటి రంగులు వేస్తే ఆ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందో తెలుసుకుందాం. వాస్తు నియమాలను పాటించి ఇంటికి వేసే రంగులను ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి.
ఇంటి గోడలకు లేత రంగులో ఉండే వాటిని ఎంచుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇటువంటి రంగులు వేస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు మరియు సంపదలు ఎల్లప్పుడూ ఆ ఇంటిపై ఉంటాయి.
లేత రంగులు (Light colors) ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. ముదురు రంగులు అనగా నలుపు రంగు వంటివి వేస్తే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని వాస్తు శాస్త్రం సూచిస్తుంది.
పండగల సందర్భంగా ఇంటికి లేత రంగులు అనగా తెలుపు, లేత నారింజ, లేత గులాబీ, లేత పసుపు, లేత నీలం ఇటువంటి రంగులు వేయించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి రావడంతో పాటు చూడడానికి కూడా ప్రశాంతంగా మరియు ఆహ్లాదకరంగా (Pleasantly) ఉంటుంది.
దీపావళి రోజున లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో ఎరుపు రంగు (Red Color) ఉండే వస్త్రాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు కాబట్టి. అలాగే పూజ చేసే సమయంలో ఎరుపు పువ్వులు అనగా మందారం మరియు ఎర్ర గులాబీ వంటి పువ్వులతో పూజ చేయాలి.
అయితే లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే ఇష్టం అని గోడలకు (Walls) ఎరుపు రంగు వేయించ కూడదు. ఎందుకంటే ఎరుపు రంగు ముదురు రంగు కాబట్టి.
Also Read : Vaastu Tips : లక్ష్మీ దేవిని ఆహ్వానించాలంటే మీ ఇంటి సింహ ద్వారం ముందు ఇవి ఉంచకండి
ఇంటికి రంగులు వేసే విషయంలో లేత రంగులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. ముదురు రంగుల వల్ల ఇంట్లో ప్రశాంతత (calmness) ఉండదు. కాబట్టి లేత రంగులు ఎంచుకోవాలి. తద్వారా ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు.
వాస్తు శాస్త్రం మీద నమ్మకం ఉన్నవారు పాటించండి. లక్ష్మీదేవి అనుగ్రహం మరియు సానుకూల శక్తిని (Positive energy) పొందండి.