స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు ప్రత్యేక సందర్భాలలో బహుమతులను ఇస్తూ ఉంటాం. ఏ ఈవెంట్ జరిగినా ఏదో ఒక బహుమతి (gift) ఇవ్వడం అనేది సాధారణ విషయం. ఒకొక్కరు ఒక్కో రకం వస్తువులను ఎంచుకుంటారు.
కొంతమంది చాలా ఖరీదు (cost) చేసే బహుమతులు, మరికొంతమంది చూడటానికి అందంగా ఉన్నా బహుమతులను ఇస్తుంటారు. అయితే ఏ వస్తువు పడితే ఆ వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను మాత్రం బహుమతిగా అసలు ఇవ్వకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇవ్వకూడని వస్తువులను బహుమతిగా ఇవ్వడం వలన తీసుకున్న వారిపై చెడు ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
Also Read : Vaastu Tips : ప్రశాంత జీవితం కొనసాగాలంటే ఇంటిలో ఈ నియమాలను పాటించండి.
ఎటువంటి వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదో తెలుసుకుందాం.
అక్వేరియం:
ఎట్టి పరిస్థితుల్లోనూ స్నేహితులకు గాని మరియు కుటుంబ సభ్యులకు గానీ అక్వేరియం ను గిఫ్ట్ గా ఇవ్వకూడదు. ఇది చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిని బహుమతిగా ఇచ్చినట్లయితే మీరు మీ శ్రేయస్సు (Prosperity) ను మరియు మీ కర్మను వారికి ఇచ్చినట్లు అవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.
పదునైన వస్తువులు:
పదునైన వస్తువులను బహుమతిగా ఇవ్వడం వలన ఇచ్చే వారికి మరియు తీసుకునే వారికి ప్రమాదం. కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులు (Sharp objects) దురదృష్టాన్ని తీసుకువస్తాయి పదునైన వస్తువులను బహుమతిగా ఇవ్వడం వలన వ్యతిరేక శక్తిని కలిగేలా చేస్తాయి.
వాచ్ :
గోడ గడియారాలు (Wall clock) మరియు వాచ్ లను బహుమతిగా ఇవ్వడం అంత మంచిది కాదు. ఇవి ప్రతికూల ప్రభావం ను ఉత్పత్తి చేస్తాయి. వీటిని బహుమతిగా ఇవ్వడం వలన ఇచ్చిన వారికి మరియు అలాగే తీసుకున్న వారికి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
వాలెట్ :
బహుమతిగా ఇవ్వ కూడని వస్తువులలో వాలెట్ ఒకటి. పర్సులు మరియు వాలెట్ లను ఇంకొకరికి బహుమతిగా ఇవ్వడం వల్ల మీ సానుకూల ఆర్థిక శక్తి (Economic power) ని బయటికి పంపిస్తున్నట్లు అర్థం. ఇలా చేయడం వలన మీ దగ్గర ధనం నిలబడదు అని నిపుణులు చెబుతున్నారు.
Also Read : Vaastu Tips : మనీ పర్స్ ఇలా ఉంటే మహాలక్ష్మి మీ వెంటే
పెన్నులు మరియు స్టేషనరీ వస్తువులు :
చాలామంది పెన్నులు స్టేషనరీ వస్తువుల (Stationery items) ను బహుమతిగా ఇస్తుంటారు. వీటిని బహుమతిగా ఇవ్వడం వలన తీసుకున్న వారికి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి ఇటువంటి వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదు అని గుర్తించుకోవాలి.జ్యోతిష్య శాస్త్రం పై నమ్మకం (trust) ఉన్నవారు పాటించండి. తద్వారా మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులతో ఆనందంగా జీవించండి.