Vaastu Tips For Diwali House Decoration : దీపావళికి మీ ఇంటిని ఇలా ఉంచితే లక్ష్మీ కటాక్షం మీ పైనే.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే
దీపావళి రోజున లక్ష్మీ పూజ చేసి లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి పండగ ముందే ఇంటిని శుభ్రం చేయడం మొదలు పెడతారు. దీపావళి పండుగ సందర్భంగా వాస్తు ప్రకారం ఇంటిని ఏ విధంగా అలంకరించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చో తెలుసుకుందాం.
హిందూమతంలో ముఖ్యమైన పండుగలలో దీపావళి (Diwali) పండుగ ఒకటి. ఈ సంవత్సరం దీపావళి పండుగను నవంబర్- 12 ఆదివారం రోజున జరుపుకోనున్నారు.
14 సంవత్సరాలు వనవాసం ముగించుకొని రాముడు అయోధ్యకు తిరిగివచ్చిన రోజున దీపావళి గా జరుపుకుంటారని నమ్ముతారు.
అంతేకాకుండా సముద్ర మధనం సమయంలో లక్ష్మీదేవి ఆ రోజున జన్మించింది అని కూడా నమ్ముతారు. కాబట్టి దీపావళి రోజున సిరిసంపదలకు అధిదేవత (the supreme deity) లక్ష్మీదేవి కాబట్టి ఆ రోజున లక్ష్మీదేవి మరియు వినాయకుడిని పూజించే సాంప్రదాయం ఉంది.
దీపావళి రోజున లక్ష్మీ పూజ చేసి లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి పండగ ముందే ఇంటిని శుభ్రం చేయడం మొదలు పెడతారు. పరిశుభ్రం (cleanliness) గా లేని ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదని నమ్ముతారు.
సిరిసంపదల దేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే వాస్తు నియమాలను పాటించి ఇంటిని అలంకరించుకోవడం వలన ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం (advent) చేస్తుందని చెబుతారు.
దీపావళి పండుగ సందర్భంగా వాస్తు ప్రకారం ఇంటిని ఏ విధంగా అలంకరించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చో తెలుసుకుందాం.
ఇంట్లో పాతవి, పనికిరాని వస్తువులను తీసివేయాలి. పాతవి, పనికిరాని వస్తువులు అనగా న్యూస్ పేపర్స్, పగిలిన అద్దాలు, చిరిగిన బట్టలు, తెగిన చెప్పులు, పాడైపోయిన బూట్లు ఇవే కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉంటే దీపావళికి ముందే తీసివేయాలి. ఇవి ఇంట్లో ఉండడం వల్ల ప్రతికూల శక్తి (Negative energy) ని పెంచుతాయి. తద్వారా కష్టాలు వస్తాయి.
Also Read : Vaastu Tips : లక్ష్మీ దేవిని ఆహ్వానించాలంటే మీ ఇంటి సింహ ద్వారం ముందు ఇవి ఉంచకండి
మురికి అనేది పేదరికానికి సంకేతంగా భావిస్తారు. కాబట్టి ఇంట్లో ఉన్న దుమ్ము, ధూళి, చెత్త వీటన్నిటిని తీసేసి ఇంటిని శుభ్రం చేయాలి. లేదంటే మురికి (dirty) గా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు.
ఇంటి ప్రధాన ద్వారమును కూడా శుభ్రం చేయాలి. మెయిన్ డోర్ శబ్దం వస్తే దానిని వెంటనే రిపేర్ చేయించాలి. వాస్తవానికి తలుపుల నుండి వచ్చే ఏ శబ్దమైన శుభ సూచకం (A good sign) కాదు.
ప్రధాన ద్వారం పై వెండి స్వస్తిక్ మరియు లక్ష్మీదేవి పాదాల గుర్తులను ఉంచాలి. దీంతో పాటు గుమ్మాన్ని మామిడి ఆకులతో అలంకరించాలి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. ఇలా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది.
Also Read : Vaastu Tips : ఇంటి గోడలకు ఈ రంగులు వేస్తే సానుకూల శక్తులు లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తాయి
ఇంటి ఈశాన్యం దేవుని స్థానం. కాబట్టి ఈశాన్యం మూల కూడా చాలా శుభ్రంగా ఉండాలి. ఈశాన్యం మూలలో ఎటువంటి వస్తువులను పెట్టకూడదు. దేవుని ఫోటోలు మరియు పూజకు సంబంధించినవి మాత్రమే ఉంచాలి.
కాబట్టి దీపావళి పండుగ త్వరలోనే రాబోతుంది కనుక ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే అందంగా అలంకరించుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది.
వాస్తు శాస్త్రం పై నమ్మకం ఉన్నవారు పాటించండి. సుఖ సంతోషాల తో మరియు సిరి సంపదలతో ఆనందంగా జీవించండి.
Comments are closed.