ఇంట్లో అందరూ సంతోషంగా, సిరిసంపదలతో తులతూగాలంటే వాస్తు నియమాలను పాటించాల్సిందే. ఇంట్లో వాస్తు దోషాలు (Errors) ఉంటే వివిధ రకాల సమస్యలు వస్తుంటాయి. కొంతమంది వాస్తు ని తేలికగా తీసుకుంటారు.
కానీ కొన్నింటి వల్ల కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో డబ్బులకు ఇబ్బంది (Trouble with money) రాకూడదు అనుకుంటే కొన్ని చిట్కాలను పాటించాలి.
వాస్తు శాస్త్రంలో రకరకాల పద్ధతుల (methods) గురించి చెప్పబడ్డాయి. వాటిల్లో కొన్ని రకాల వస్తువులను మరియు బొమ్మలను ఇంట్లో ఉంచడం వలన ఆ ఇంట్లో శుభ ఫలితాలను పొందవచ్చు.
ఇంట్లో గుర్రం, తాబేలు, ఏనుగు, జింక, కుక్క, సింహం విగ్రహాలను కొంతమంది అలంకరణ (decoration) కోసం ఎక్కడపడితే అక్కడ ఉంచుతారు. అలా కాకుండా ఈ బొమ్మలను వాస్తు శాస్త్రాన్ని పాటించి వాటిని ఉంచవలసిన స్థానంలో ఉంచినట్లయితే చక్కటి ఫలితాలను పొందవచ్చు.
ఈ బొమ్మలను ఏ దిక్కులో ఉంచితే సిరిసంపదలు వస్తాయో తెలుసుకుందాం.
ఏనుగు : (Elephant)
వాస్తు శాస్త్రంలో ఏనుగు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి అమ్మవారికి ప్రతిరూపం ఏనుగు. అటువంటి ఏనుగు విగ్రహాలను ఇంట్లో ఆగ్నేయ మూలన (Southeast corner) ఉంచడం వలన సంపద పెరగడమే కాకుండా పిల్లలు చదువుల్లో రాణిస్తారు.
Also Read : Vaastu Tips : ఏ దిక్కున ఏ రంగు డోర్ మ్యాట్ ఉంచితే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది? తెలుసుకోండి!
తాబేలు : (Tortoise)
వాస్తు శాస్త్రంలో అదృష్టాన్ని ఆకర్షించడానికి తాబేలు ను ముఖ్యమైన జంతువుగా నమ్ముతారు. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇళ్లల్లో, షాపుల్లో తాబేలు బొమ్మలను కనిపిస్తున్నాయి. తాబేలు బొమ్మలు ఇంట్లో మరియు షాపుల్లో ఉత్తరం (North) లేదా తూర్పు దిశ (East direction) లో ఉంచాలి.
గుర్రం : (Horse)
గుర్రాన్ని విజయానికి మరియు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు. గుర్రపు బొమ్మలను ఇంట్లో దక్షిణ దిశ (South direction) లో ఉంచడం వలన శుభప్రదంగా భావిస్తారు.
కుక్క : (Dog)
పెంచుకోవడం చాలా మంచిది. ఒకవేళ కుక్క ను పెంచుకోవడం ఇష్టం లేకపోతే కుక్క బొమ్మ (Dog toy) లను పెట్టుకోవచ్చు. కుక్క బొమ్మలు ఇంట్లో ఉండటం వల్ల సంతోషం మరియు ఆనందం నెలకొంటాయి.
Also Read : Vaastu Tips : మనీ పర్స్ ఇలా ఉంటే మహాలక్ష్మి మీ వెంటే
జింక : (Deer)
చాలామంది చాలా ఇష్టంగా జింక బొమ్మలను కొంటారు. వీటిని ఇంట్లో ఉంచడం వల్ల శుభప్రదంగా చెప్పవచ్చు. వాస్తు ప్రకారం జింక బొమ్మలను తూర్పు దిశలో ఉంచడం మంచిది. వీటిని తూర్పు దిశ (East direction) లో ఉంచడం వల్ల ఇంట్లో సమస్యలు తగ్గుముఖం పడతాయి.
కోతి : (Monkey)
చాలామంది ఇళ్లల్లో కోతి బొమ్మలు ఉంటున్నాయి. వాస్తు ప్రకారం కోతి బొమ్మలు ఉంచడం వలన మంచి లాభాలు (Good profits) కలుగుతాయి.
సింహం : (Lion)
వాస్తు శాస్త్రం ప్రకారం సింహం బొమ్మలను కానీ విగ్రహాలను గాని నైరుతి దిశ (Southwest direction) లో ఉంచితే చాలా మంచిది. ఈ సింహపు బొమ్మలు ఇంట్లో ఉండటం వల్ల సంపద పెరుగుతుంది.
కాబట్టి వాస్తు శాస్త్రం (Vaastu Shastra) మీద నమ్మకం ఉన్నవారు పాటించండి. శుభ ఫలితాలను పొందండి.