హిందూమతంలో దీపావళి (Diwali) పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దీపావళి రోజున లక్ష్మీదేవిని దేవి మరియు గణేశుడు ని పూజిస్తారు. ఇంట్లోకి లక్ష్మీదేవికి స్వాగతం పలకడానికి దీపావళి పండుగ ముందే ఇంటిని శుభ్రపరచడం (cleaning up) మరియు అలంకరించుకోవడం వంటి పనులు చేస్తుంటారు.
వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళి రోజున కొన్ని ప్రత్యేక మొక్కలను (Special plants) ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వలన ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తద్వారా సిరిసంపద (wealth) లు మరియు పాజిటివ్ ఎనర్జీ పెరుగుదల ఉంటుంది.
దీపావళి పండుగ రోజున ఎటువంటి మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం.
తులసి మొక్క:
కార్తీక మాసంలో తులసి (basil) మొక్కను అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీపావళి రోజున ఈ మొక్కను నాటితే చాలా ఎక్కువ శుభ ఫలితాలు కలుగుతాయి. తులసి మొక్క ఇంట్లో ఉండటం వలన సానుకూల శక్తి వేగంగా పెరుగుతుంది. దీంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. తద్వారా సంపద, అభివృద్ధి పెరుగుతుంది.
లక్కీ బాంబు:
దీపావళి సందర్భంగా ఇంట్లో లక్కీ బాంబు మొక్కను పెంచుకోవడం వల్ల అదృష్టం ను తీసుకువస్తుంది. అంతేకాకుండా చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఏమైనా వస్తుంటే వాటిని తొలగించి తిరిగి పని ప్రారంభం అవ్వడానికి తోడ్పడుతుంది. అంతట శక్తి లక్కీ బాంబు కి ఉంది. లక్కీ బాంబు పేరుకు తగినట్టుగానే అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ మొక్కను ఆగ్నేయ దిశ (Southeast direction) లో ఉంచడం వలన శుభ ఫలితాలు పొందవచ్చు.
శంకు పువ్వు మొక్క:
ఈ మొక్క పువ్వును శంకు పువ్వు లేదా అపరాజిత పిలుస్తారు. దీపావళి రోజున ఈ మొక్కను ఇంటి ఆవరణలో నాట వచ్చు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. సిరిసంపదలు కలుగుతాయి.
వాస్తు ప్రకారం ఈ మొక్కను తూర్పు, ఉత్తరం, ఈశాన్యం (East, North, North-East) దిశలలో ఈ మొక్కను నాటడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ మొక్కను ప్రధాన ద్వారానికి కుడివైపు న పెంచడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
Also Read : Vaastu Tips : ఏ దిక్కున ఏ రంగు డోర్ మ్యాట్ ఉంచితే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది? తెలుసుకోండి!
జెడ్ ప్లాంట్ :
వాస్తు ప్రకారం దీపావళి పండుగ రోజు జెడ్ ప్లాంట్ పెంచుకోవడం వలన సంపద, ఆనందం, శ్రేయస్సు (Prosperity) ను తీసుకువస్తుంది. ఈ మొక్కను ఇంట్లోనే కాకుండా ఆఫీస్ లో కూడా పెంచుకోవచ్చు. చేసే వ్యాపారాలలో అభివృద్ధి కలిగేలా చేస్తుంది. ఆర్థికంగా బల పడేలా చేస్తుంది. ఈ మొక్కను ఇంటికి తూర్పు దిశలో పెంచుకోవాలి.
కాబట్టి కొద్ది రోజుల్లోనే దీపావళి పండుగ రానుంది.ఆ రోజున ఇటువంటి లక్కీ ప్లాంట్స్ ను ఇంట్లో పెంచుకునే ప్రయత్నం చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థికంగా బల పడండి.
వాస్తు శాస్త్రం పైన నమ్మకం ఉన్నవారు పాటించండి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించండి.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…