ఇల్లు అందంగా మరియు ఆకర్షణీయంగా ఉండేందుకు ఇంటి ముందు వివిధ రకాల మొక్కలు మరియు చెట్లను పెంచుతుంటాం. చెట్లు (Trees) మరియు మొక్కలను (Plants) పెంచడం వల్ల ఇంట్లోకి కలుషితమైన గాలి రాకుండా, స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి.
ఇంటి ఆవరణలో మొక్కలు లేదా చెట్లు ఉండటం వల్ల ఆ ఇల్లు అందంగా ఉండడంతో పాటు ఆ ఇంట్లో నివసించే వారికి సానుకూల శక్తి లభిస్తుంది. ఎందుకంటే కొన్ని రకాల మొక్కలు మరియు చెట్లు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. కలుషితమైన గాలిని (Polluted air) పీల్చుకొని మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి.
Also Read : Vaastu Tips : సుఖ సంతోషాలు,సిరిసంపదలు కలగాలంటే వాస్తు శాస్త్ర ప్రకారం ‘రాగి సూర్యుడి’ని ఈ దిశలలో ఉంచాలి.
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలు లేదా చెట్లను ఇంట్లో పెంచుకోవడం అంత మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
తెలియక మనం వాటిని నాటడం వలన సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ఇంటి ఆవరణలో పెంచ కూడని మొక్కలలో గోరింట చెట్టు (Henna tree) ఒకటి. ఈ చెట్టు ఇంటి లోపల ఉంటే అశుభం అంటున్నారు వాస్తు పండితులు.
చేతులకు గోరింటాకును పెట్టుకోవడం శుభప్రదంగా చెప్పవచ్చు. పండగలు మరియు ప్రత్యేక సందర్భాలలో గోరింటాకును చేతులకు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు.
పెళ్లి సమయంలో వధూవరులకు తప్పకుండా గోరింటాకు పెట్టడం మన భారతీయ సాంప్రదాయంలో ఉంది. పెళ్లయిన ఆడవాళ్ళకి 16 అలంకారాలలో గోరింటాకు ఒకటి.
గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎంత అందంగా ఉంటాయో, గోరింటాకు మొక్కని ఇంట్లో పెంచుకుంటే అంత అశుభం కలుగుతుంది. గోరింటాకు వాసన అందరినీ ఆకర్షిస్తుంది. కానీ గోరింట మొక్కకు ప్రతికూల శక్తు (Negative energy) లు ఉన్నాయని చాలామంది భావిస్తారు.
గోరింట మొక్కను ఇంట్లో నాటడం వలన ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.
గోరింట మొక్కను ఇంటి లోపల నాట కూడదు. ఒకవేళ తెలియక నాటి నట్లయితే దానిని తీసివేయాలి. ఇంటి లోపల కాకుండా ఇంటి బయట దూరంగా నాటుకోవాలి.
గోరింటాకు మొక్కను ఇంట్లో పెంచడం ద్వారా ఆ ఇంట్లో నివసించే వ్యక్తులు ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలతో (Health Problems) బాధపడుతూ ఉంటారు.
Also Read : Vaastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి అందంతో పాటు అదృష్టం, సంపదను తెచ్చే మొక్కలు ఇలా పెంచండి
ఆ ఇంట్లో నివసించే వారికి ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్యం వస్తూ ఉంటుంది. కాబట్టి గోరింట మొక్కను ఇంటి లోపల కాకుండా ఇంటి బయట ఎక్కడైనా నాటాలి.
ఇంట్లో గోరింటాకు మొక్క ఉండటం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడు అభిప్రాయ భేదాలు, గొడవలు వస్తుంటాయి. అలాగే ఆ ఇంట్లో నివసించే వారికి మనశ్శాంతి (peace of mind) ఉండదు.
గోరింట మొక్క ఇంట్లో ఉండడం వలన వారు చేసే ప్రతి పనిలో అడ్డంకుల (Obstacles) ను సృష్టిస్తుంది. వారి జీవితంలో పురోగతిని అడ్డుకుంటుంది.
Also Read : Vastu Tips : ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే.. మీ ఇంట్లో డబ్బు, ఆనందానికి లోటే ఉండదు..
కాబట్టి ఇంటి లోపల గోరింటాకు మొక్కలు పెంచ కూడదు. ఈ మొక్కను ఇంట్లో పెంచడం వలన ఆరోగ్యం పై చెడు ప్రభావం మరియు ఇంట్లో అసమ్మతి ,అలాగే పురోగతి (progress) నిలుపుదల ఇటువంటి సమస్యలు అధికంగా వస్తాయి.
కనుక గోరింటాకు మొక్కను వీలైనంతవరకు ఇంట్లో పెంచకుండా ఉండటం మంచిది. ఇంటి బయట దూరంగా ఎక్కడైనా పెంచుకోవచ్చని వాస్తు పండితులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం పై నమ్మకం ఉన్నవారు పాటించండి. సుఖసంతోషాలతో జీవించండి.