Vaastu Tips : ఈ దిశలో గుడ్ల గూబ ఫోటో లేదా విగ్రహం పెడితే అంతా శుభమే అంటున్న వాస్తు పండితులు
ఇంట్లో రకరకాల ఫోటోలను పెడుతుంటాం.దేవుడు ఫోటోలతో పాటు పక్షులు మరియు జంతువులు ఇలా కొన్ని రకాల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటాము.అయితే కొంతమంది గుడ్లగూబ ఫోటోలు కూడా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు.గుడ్లగూబ ఫోటో లేదా విగ్రహం ను సరైన దిక్కులో ఉంచినట్లయితే శుభ ఫలితాలను పొందవచ్చు అని చెబుతున్నారు.
ఇంట్లో రకరకాల ఫోటోలను పెడుతుంటాం. దేవుడు ఫోటోలతో పాటు పక్షులు మరియు జంతువులు ఇలా కొన్ని రకాల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటాము.
అయితే కొంతమంది గుడ్లగూబ (owl) ఫోటోలు కూడా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. కానీ చాలామందికి గుడ్లగూబ అనగానే ఒక తెలియని భయం ఉంటుంది. దాని ఆకారం చూసి భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు.
ఇంట్లో పెట్టుకుంటే ఏదైనా చెడు జరుగుతుందని భయపడుతుంటారు. కొందరు లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ అని శుభ ప్రదం గా భావిస్తారు. కొంతమంది గుడ్లగూబ శుభప్రదం అని భావిస్తే మరి కొంతమంది అపశకునం (abomination) గా భావిస్తారు.
ఇంతకీ వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో గుడ్లగూబ ఫోటో లేదా విగ్రహం ను పెట్టుకోవడం మంచిదా, కాదా?. ఒకవేళ ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం.
అయితే వాస్తు పండితులు ఏమని చెబుతున్నారు అంటే, గుడ్లగూబ ఫోటో లేదా విగ్రహం ను సరైన దిక్కులో ఉంచినట్లయితే శుభ ఫలితాలను పొందవచ్చు అని చెబుతున్నారు.
ఆఫీసులలో లేదా వ్యాపారాలు చేసే ప్రదేశంలో ఫోటో లేదా విగ్రహం ను సరైన దిశలో ఉంచడం వలన లాభం కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఆఫీస్ లేదా పనిచేసే చోట గుడ్ల గూబ ఫోటో లేదా విగ్రహం (statue) పెట్టుకోవడం వలన విజయాలు సొంతమవుతాయి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇది ఒక మంచి మార్గంగా చెప్పవచ్చు. ఆఫీస్ లో ఈ ఫోటోను లేదా విగ్రహాం ను ఏర్పాటు చేసుకోవడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ప్రతికూల శక్తి తగ్గిపోయే లా చేయడంలో తోడ్పడుతుంది.
గుడ్లగూబ ఫోటో లేదా విగ్రహమును దుకాణాల్లో కౌంటర్ పైన లేదా ఆఫీసులలో కంప్యూటర్ టేబుల్ పైన పెట్టవచ్చు.
అయితే దీనిని కూర్చున్న దగ్గర కుడివైపు (right) ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే చేసే పనులకు ఆటంకాలు తొలగిపోయి ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది.
ఇంకా గుడ్లగూబ ఫోటో లేదా విగ్రహం ను ఇంట్లో (home) కూడా పెట్టుకోవచ్చు. స్టడీ రూమ్ లేదా హాల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో గుడ్లగూబ ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు అని వాస్తు పండితులు చెబుతున్నారు.
ఇంటికి నరదృష్టి (People’s perspective) వంటి ప్రతికూల శక్తి తగలకుండా ఉండాలంటే, గుడ్లగూబ ఫోటో లేదా విగ్రహాం ను ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా దీనిని ఇంటి ముఖ ద్వారం (front door) లో నుండి కనిపించేలా ఏర్పాటు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Also Read : Vaastu Tips : ప్రతిరోజూ కర్పూరం తో ఇంట్లో ఇలా చేయండి, శుభ ఫలితాలను పొందండి
అంతేకాకుండా ఇంట్లో గుడ్లగూబ ఫోటో లేదా విగ్రహం ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు తగ్గిపోయి అనుబంధాలు బలపడతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.
కాబట్టి ఇంట్లో గుడ్లగూబ ఫోటో లేదా విగ్రహం పెట్టుకోవడం వలన శుభప్రదం అని చెప్పవచ్చు. అయితే దీనిని సరైన దిశలోనే అమర్చాలి అన్న విషయం గుర్తుంచుకోవాలి.
కాబట్టి వాస్తు శాస్త్రం పై నమ్మకం ఉన్నవారు పాటించండి. శుభ ఫలితాలను పొందండి.
Comments are closed.