Valentine Week Propose Day 2024: ప్రేమికుల వారం మొదలైంది. ఈ వారంలో రెండో రోజు అంటే ఫిబ్రవరి 8 (February 8)న ప్రపోజ్ డే ను జరుపుకుంటారు. ఈరోజు కోసం చాలామంది ప్రేమికులు, తమ ప్రేమను వ్యక్తపరచడానికి ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉంటారు. రోజ్ డే మరుసటి రోజున “ప్రపోజ్ డే” సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమలో ఉన్నవారు ఈ వారం ను ముఖ్యమైన వ్యక్తితో జరుపుకుంటూ ఉంటారు.
రోజ్ డే రోజున గులాబీ పువ్వును ప్రేమించిన వ్యక్తికి బహుమతిగా ఇవ్వడం, అలాగే ప్రపోజ్ డే (Propose day) రోజున తమ మనసులో మాటను గ్రాండ్ ప్రపోజల్ చేయడం చాలా ప్రత్యేకం. ప్రపోజ్ డే రోజున చాలామంది తమ భాగస్వామి పట్ల తమ ప్రేమను వ్యక్త పరిచి, పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేస్తుంటారు.
అయితే ఈ ప్రత్యేకమైన Valentine Week Propose Day 2024 రోజున ప్రపోజ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. అవేమిటో తెలుసుకుందాం.
మీరు ప్రేమించిన వ్యక్తికి సర్ ప్రైజ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లయితే, మీ ప్లాన్ వారికి నచ్చుతుందా లేదా తెలుసుకోవాలి. అవతల వ్యక్తి యొక్క ఇష్టాలను మరియు అభిప్రాయాలను అర్థం చేసుకొని అప్పుడు గ్రాండ్ ప్రపోజల్ ప్లాన్ చేయాలి. మీ ప్లాన్ వారికి అనుకూలంగా లేకపోతే వారు మీ ప్రేమను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి ఏ విధంగా చేస్తే బాగుంటుందో అది గ్రహించి సర్ ప్రైజ్ తో పాటు గ్రాండ్ ప్రపోజల్ అమలు చేయాలి.
ప్రపోజల్ అనేది ఒక ప్రత్యేకమైన సందర్భం. మీరు ఏం ప్లాన్ చేసిన మీ భాగస్వామికి నచ్చితేనే అది సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరు చేసే ప్లాన్ ఇద్దరికీ కంఫర్ట్ గా ఉండాలి. మీ భాగస్వామి యొక్క కోరికను దృష్టిలో పెట్టుకొని ప్రపోజల్ ప్లాన్ చేయడం మంచిది.
మన మనసులో ఉన్న ప్రేమ మరియు భావోద్వేగాలను వ్యక్తపరచడం చాలా సున్నితత్వం తో కూడుకున్న అంశం. దీనిని జాగ్రత్తగా అమలు చేయాలి. మీరు వారికి ఏ విధంగా ప్రపోజ్ చేయాలనుకుంటున్నారో ముందుగానే ఆలోచించుకోవాలి.
మీరు ప్రపోజ్ చేసేటప్పుడు మాటల్లో సున్నితత్వం మరియు ప్రేమ కనిపించాలి. మీ ప్రపోజల్ మనసును తాకేలా ఉండాలి. నిర్లక్ష్యంగా మరియు మొరటుగా మీ మాటలు ఉండకూడదు.
కొంతమంది ఉంగరం ను ఫుడ్, కేక్, డ్రింక్స్ వంటి వాటిలో దాచిపెట్టి సర్ప్రైజ్ చేయాలి అని అనుకుంటారు. అలాంటివి చేయకండి. అవి చాలా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఉంగరమును దాచిపెట్టి సర్ప్రైజ్ చేయాలి అనుకుంటే ఆహారంలో కాకుండా, వేరే ఏదైనా ప్లాన్ చేయండి.
మీరు ప్రపోజ్ చేయాలి అనుకున్నప్పుడు వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలుసుకోవాలి. వారి ఇంట్లో పరిస్థితి బాగోలేక, బాధగా ఉన్నప్పుడు మీరు ప్రపోజ్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ వారు ఇబ్బందులు మరియు కష్టాలలో ఉన్నప్పుడు, మీరు భావోద్వేగంతో నీకు నేను కష్ట,సుఖాల్లో తోడుంటాను అని చెప్పి ప్రపోజ్ చేయండి. పువ్వులు, చాక్లెట్లు ఇవ్వడం కన్నా వారి పరిస్థితి లకు అనుగుణంగా మీరు ప్రపోజల్ చేయడం మంచిది.
కాబట్టి ప్రేమికులు, ఈ “ప్రపోజ్ డే” రోజున మీ భాగస్వామికి ఎలా చెబితే మిమ్మల్ని అంగీకరిస్తారో ఆ విధంగా ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించండి.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…