Valentine’s Day : ప్రేమికుల రోజున మీ పార్టనర్ కి ఎట్టి పరిస్తుతులలో వాస్తు శాస్త్ర ప్రకారం ఈ బహుమతులు ఇవ్వకండి.

Valentine's Day: Lover's Day
Image Credit : The Grio

Valentine’s Day : ప్రేమికులు, ప్రేమికుల రోజు (Valentine’s Day) కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. తమ ప్రేమను తెలపడానికి ఫిబ్రవరి 14 కోసం చాలామంది ప్రేమికులు వెయిట్ చేస్తుంటారు. తాము ఇష్టపడే వ్యక్తికి ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలని ప్రేమికులు అందరూ కోరుకుంటారు.

అయితే కొన్ని రకాల బహుమతులను ఇవ్వడం అంత మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాటి వలన విడిపోయే ప్రమాదం అధికంగా ఉంటుందని వారు సూచిస్తున్నారు.

Valentine’s Day రోజున మీరు ఇష్టపడే భాగస్వామికి ఎటువంటి గిఫ్ట్ ఇవ్వ కూడదో తెలుసుకుందాం.

Black dress :

మీ భాగస్వామికి ప్రేమికుల రోజున నలుపు రంగులో ఉన్న బట్టల (clothes) ను బహుమతిగా ఇవ్వకండి. వాస్తు శాస్త్రం ప్రకారం నలుపు రంగులో ఉన్న దుస్తులను బహుమతిగా ఇవ్వడం “దుఃఖానికి” దారితీసే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Handkerchief :

ప్రేమికుల రోజున ఒకరికొకరు ఎట్టి పరిస్థితులలోనూ రుమాలు (Handkerchief )ను గిఫ్ట్ గా ఇచ్చి పుచ్చు కోకూడదు. ఈ విధంగా చేయడం వల్ల భాగస్వాముల మధ్య “గొడవలు” అయ్యే అవకాశం ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

Valentine's Day: Lover's Day
Image Credit : notino.ie

Sandals or shoes :

మీ భాగస్వామికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పులు మరియు బూట్లను బహుమతిగా ఇవ్వకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చెప్పులు లేదా బూట్లు బహుమతిగా ఇవ్వడం “విభజనకు” గుర్తుగా పరిగణించబడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఎండిపోయిన పువ్వులు, గడియారాలు, పదునైన వస్తువులు, గాజు వస్తువులు వంటివి బహుమతిగా ఇవ్వకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇటువంటివి బహుమతిగా ఇవ్వడం వలన మీకు మరియు మీ జీవిత భాగస్వామికి “వివాదాలు” ఏర్పడతాయి.

Also Read : Valentine Week List 2024 : ఫిబ్రవరి 7 నుండి 14 వరకు ప్రేమికులు జరిపే వేలంటైన్స్ వీక్ లోని ముఖ్యమైన రోజులు ఇక్కడ చూడండి

అలాగే మునిగిపోతున్న ఓడ ను కూడా బహుమతిగా ఇవ్వకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇటువంటి ఫొటోలు ఇవ్వడం “అశుభమైనదిగా” భావిస్తారు. మరియు ఆర్థిక ఇబ్బందులతో పాటు, బంధం బలహీనంగా మారుతుందని కూడా నమ్ముతారు.

కాబట్టి మీ మధ్య ఉన్న బంధం, “దృఢంగా” ఉండాలంటే ఇటువంటి బహుమతులను ఇవ్వకండి.

వాస్తు పై నమ్మకం ఉన్నవారు పాటించండి. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in