14 నిమిషాల్లో వందే భారత్ రైలు (Vande Bharat Train) కోచ్ ను ‘వందే వీర్స్’ కార్మికుల ద్వారా వేగంగా శుభ్రం చేయడాన్ని చూపించే వీడియోను ప్రభుత్వం షేర్ చేసింది – కార్మికులకు అప్పగించిన ఈ పనిని వారు 14 నిమిషాలలో చేసి చూపించారు. దేశవ్యాప్తంగా తిరిగే అన్ని వందేభారత్ రైళ్లలో ’14 నిమిషాల క్లీనింగ్ మిరాకిల్’ అని పిలిచే ఈ విధానాన్ని అమలుపరిచే క్రమాన్ని రైల్వే శాఖాధికారులు యోచిస్తున్నారు.
కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, తన X ఖాతాలో వీడియోను పోస్ట్ చేస్తూ, కేంద్రం యొక్క ఫ్లాగ్‌షిప్ స్వచ్ఛ్ భారత్ అభియాన్ కి అంకురార్పణ (germination) లేదా క్లీన్ ఇండియా ప్రచారానికి “అద్భుతమైన ప్రదర్శన” అని కేంద్ర సహాయ మంత్రి, తన X ఖాతాలో వీడియోను పోస్ట్ చేశారు.
The 14-minutes Cleaning Miracle of #VandeBharat is a brilliant showcase of #SwachhBharatAbhiyan!
Kudos to hardwork and dedication of #VandeVeers– the team of Railway staff who carried out the task.@RailMinIndia@AshwiniVaishnaw#GandhiJayanti#SwachhtaHiSeva #IndianRailways pic.twitter.com/CcsqEwfX5g
— Rajeev Chandrasekhar 🇮🇳 (@RajeevRC_X) October 2, 2023
వందేవీర్‌ల కృషి (hard work) మరియు అంకితభావానికి – ఈ పనిని నిర్వహించిన రైల్వే సిబ్బంది బృందం (sic) కి ఖుదోస్,” అని ఆయన తన పోస్ట్ కు జోడించారు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ కాంట్ రైల్వే స్టేషన్‌లో వేగవంతమైన, మరియు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవానికి ప్రసిద్ధి గాంచిన వందే భారత్ రైళ్లకు సంబంధించిన స్వచ్ఛతా (Purity) ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించారు.
32 వందేభారత్ రైళ్లు దేశవ్యాప్తంగా ఈ స్విఫ్ట్ క్లీనింగ్ మెకానిజంను అవలంబిస్తున్నాయని, ఇది రోజువారీ విధానంగా రూపు దిద్దుకుంటుందని రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఇక్కడ అంకురార్పణ చేసిన ఈ విధానం జపాన్ లోని బుల్లెట్ రైళ్లలో అవలంబించే (adopt) వేగవంతమైన శుభ్రపరిచే విధానాలను అనుకరిస్తుంది, శుభ్రపరిచే సమయాన్ని జపాన్ వారు 7 నిమిషాలలో సాధిస్తారు.
రైల్వే మంత్రిత్వ శాఖ యొక్క ఉన్నత వర్గాలు ANI వార్తా సంస్థకి తెలిపిన ప్రకారం ఒకప్పుడు 3-4 గంటల సమయం తీసుకునే ప్రక్రియ (process) ఇప్పుడు కేవలం 15 నిమిషాలలోనే నిర్వహించబడుతుంది.
Also Read : Vande Bharath trains: దేశంలో 11 రాష్ట్రాలను కలుపుతూ 9 వందే భారత్ రైళ్ళను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడి
Vande Bharat: రైల్వేశాఖ నిర్లక్ష్యం- రోటీలలో బొద్దింక ప్రత్యక్షం, ఫొటోలు వైరల్!
నలుగురు క్లీనింగ్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం వందే భారత్ రైలులోని ప్రతి కోచ్ ను శుభ్ర పరుస్తారని సంభంధిత శాఖా వర్గాలు తెలిపాయి. నెల రోజులు జరిగిన విస్తృతమైన శిక్షణా కార్యక్రమాలు ఈ సిబ్బందిని అంతర్భాగంగా (As an integral part) ప్రణాళిక చేసిన మాన్యువల్ క్లీనింగ్ విధానం కోసం సన్నద్ధం చేశాయి. అనేక మాక్ డ్రిల్‌లు వారిలోని నైపుణ్యాలను మరింత చక్కగా రూపొందించాయి, శుభ్రపరిచే వేగవంతమైన ఆపరేషన్‌ను అంతరాయాలు లేకుండా అమలు చేయడానికి గ్యారంటీ ఇస్తున్నాయి.
రైల్వే మంత్రి వైష్ణవ్ ఈ ఏడాది జనవరిలో భారతదేశంలోని ప్రీమియం రైళ్లను శుభ్రపరిచే విధానంలో మార్పు గురించి పేర్కొనడం విదితమే.
ఈ ముందడుగు, అనుకూల ఫలితాన్ని ఇస్తే అదేవిధంగా పూర్తిగా పనిచేస్తుందని నిర్ధారించిన తరువాత అన్ని రైళ్లకు ఒకే క్రియాశీలకమైన (active) శుభ్రపరిచే యంత్రాంగాన్ని విస్తరించాలని రైల్వే శాఖ ధృష్టి సారిస్తుందని అధికారులు ప్రకటించారు.