Telugu Mirror : వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న వ్యక్తి IRCTC ద్వారా ఆర్డర్ ఇచ్చిన భోజనంలో బొద్దింక రావడంతో ఆగ్రహానికి గురై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసాడు.అయితే అతని ఫిర్యాదు పై IRCTC వెంటనే స్పందించింది.ఇటీవల వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో భోపాల్ నుండి గ్వాలియర్ కు ప్రయాణించిన ఒక ప్రయాణికుడు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC ) వారిచే రైల్ లో ప్రయాణించే వారికి అందిస్తున్న ఆహారం నాణ్యత మీద తన ఆందోళనను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. తాను తెప్పించుకున్న భోజనంలో బొద్దింక వచ్చిందని తన ట్వీట్ లో పోస్ట్ చేసినాడు.తాను ప్రయాణించిన మార్గంలో పయనించిన చాలా మంది ప్రయాణీకులు కలుషిత మైన ఆహారాన్ని తిన్నారని,వారెవరూ భోజనం పై సంతృప్తిని వ్యక్త పరచలేదని తన ట్వీట్ లో పేర్కొన్నాడు.
అయితే ఆ ప్రయాణీకుడు IRCTC కి చేసిన ట్వీట్ లో “@IRCTCofficial వందేభారత్ రైలులో నా ఆహారంలో బొద్దింకను కనుగొన్నాను”అని అతను అందుకున్న ఆహారం కి సంభంధించిన అనేక ఫోటోలను జతచేసి ట్వీట్ చేసినాడు.అతను ట్వీట్ లో పంపిన ఫొటోలలో ‘రోటీలలో ఒకదానికి చిన్న బొద్దింక అంటుకున్నట్లు’ చిత్రాలు చూపెడుతున్నాయి.
@IRCTCofficial found a cockroach in my food, in the vande bharat train. #Vandebharatexpress#VandeBharat #rkmp #Delhi @drmbct pic.twitter.com/Re9BkREHTl
— pundook🔫🔫 (@subodhpahalajan) July 24, 2023
Samsung Galaxy Z Fold 5, Z Flip 5: హ్యాండ్ సెట్ అందుబాటులోకి .. ధర, ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకె
IRCTC అతని ఫిర్యాదుని వెంటనే పరిష్కరించింది.అలాగే వారికి తాజా ఆహారాన్ని అందించేలా ఏర్పాటు చేసింది.IRCTC వారు ఇలా స్పందించారు”IRCTC ఈ విషయం పై ఖచ్చితమైన చర్య తీసుకుంటుందని.అలాగే ప్రయాణీకునికి నాణ్యమైన ఆహారాన్ని ఏర్పాటు చేశామని.ఆహారాన్ని సరఫరా చేసే లైసెన్స్ దారునిపై ఈ సంఘటనకు తగిన పనిష్ మెంట్ తీసుకోవడం జరుగుతుందని.ఇటువంటి సంఘటనలను సహించేది లేదని పేర్కొన్నారు.”
ఈ సంఘటనకు సంభంధించిన ట్వీట్ ని మూడు రోజుల క్రితం పోస్ట్ చేయగా ఇప్పటివరకు 8,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.వీటి సంఖ్య ఇంకా పెరుగుతుంది.
చాలామంది ఈ పోస్ట్ ను చూసి కామెంట్లు పెట్టారు.నెటిజన్ ల స్పందన ఈ విధంగా ఉంది.ఒక నెటిజన్ తన స్పందనలో “మన అందరికీ పరిహారం ఇవ్వాలి ఎందుకంటే మనం అందరం ఇతనితో కలసి ప్రయానిస్తున్నాము.ప్రజా ప్లాట్ ఫారమ్ లలో ఇలాంటివి అమ్మే వారి లైసెన్సు ను రద్దు చేయాలి” అని కామెంట్ రాయగా IRCTC వారు బదులిస్తూ”సర్,ఇలాంటి అసౌకర్యమైన ప్రయాణానికి మేము హృదయ పూర్వక క్షమాపణను తెలియజేస్తున్నాం.ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాము.ఆహారాన్ని తయారు చేసేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోమని సరఫరా దారులకు గట్టిగా హెచ్చరించాము.అలాగే సరఫరా దారులకు భారీ జరిమానా విధించబడినది. కిచెన్ లో” పర్యవేక్షణ మరింత మెరుగు పరచబడినది. అని బదులిచ్చారు.
Diabetes: శరీరం లో ఇన్సులిన్ కొరత వలన డయాబెటిస్ కాకుండా వచ్చే ఇతర వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తలు.
మరొకరు వందే “భారత్ రైలులో నిజంగానే సర్వీస్ సక్రమంగా లేదు.అమ్మేవారిపై వెంటనే చర్య తీసుకోవాలి.మరియు లైసెన్సు రద్దు చేయాలని నేను అభ్యర్ధిస్తున్నాను.ఖానా తో ఖా లియా హై లేకిన్ ఆస్ పాస్ కే సభీ కా పేట్ ఖరాబ్ హో రహా హై.”అని కామెంట్ వ్రాశారు.
IRCTC క్యాటరింగ్ సర్వీస్ మంచిగా ఉండదు.ఆహారం అపరిశుభ్రంగా మరియు నాణ్యత లేని పదార్ధాలతో తయారు చేస్తారు”అని మరొకరు వ్యాఖ్యానించారు.ఇంకొకరు “IRCTC చాలా చెడ్డది” అని అడిగారు.