Telugu Mirror: శరీరం ఆరోగ్యంగా ఉండటానికి మరియు వివిధ రకాల వ్యాధుల సమస్యలను తగ్గించడానికి అందరూ ప్రతి రోజు పౌష్టికాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మీరు ఎక్కువగా శాకాహారం తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలను అందిస్తుందని అధ్యయనాలు అంటున్నాయి. శాకాహారం వల్ల గుండె సంబంధిత సమస్యలను తగ్గించడానికి మరియు బరువును అదుపులో ఉంచడం వల్ల వచ్చే ఉపయోగాలను లెక్కలోకి తీసుకున్నట్లయితే ఇటువంటి డైట్ ప్లాన్(Diet Plan)లకు డిమాండ్ బాగా పెరిగింది.
కానీ ఇది ప్రాణాంతకం అవుతుందా?
ఈ రోజు మనము రా వేగన్ ఫుడ్(Ra Vegan Food)తీసుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.
నిజానికి రష్యా(Russia)కు చెందిన 39 సంవత్సరాల ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఝన్నా సామ్స్సోనోవా(Zhanna Samsonova) మరణం అనేక ప్రశ్నలను రేకెత్తించింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్(food influencer)ఆకలితో చనిపోయింది. ఆమె తన రోజువారి ఆహారంలో భాగంగా కొన్ని రకాల ఫ్రూట్స్ మాత్రమే తినేది. ఈమె సోషల్ మీడియా(social media)లో కూడా ఫేమస్ అయింది .మరియు వివిధ ప్లాట్ ఫామ్ లలో మిలియన్ మంది అభిమానులను సొంతం చేసుకుంది.
మీడియా నివేదికల ప్రకారం ఝన్నా గడిచిన ఐదు సంవత్సరాల నుండి ముడి శాఖాహారాన్ని ఫాలో అవుతుంది. ఇందులో కొన్ని రకాల పండ్లు, పండ్ల స్మూతీలు, పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాల మొలకలు మరియు రసాలు ఉన్నాయి. స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఝన్నాకు కలరా లాంటి ఇన్ఫెక్షన్ బారిన పడింది. దీనికి కారణం కేవలం మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం కారణమని అనుకుంటున్నారు.
Also Read: oil free pakodi: నూనె లేకుండా పకోడీ లు.. మీరు. కూడా ప్రయత్నించండి ఇలా..
కొన్ని నెలల క్రితం ఆమె పాదాల వాపు మరియు శోషరస సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు ఆమె స్నేహితులు తెలిపారు. ఝన్నా మరణం వల్ల శాకాహారం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే ప్రశ్నలను లేవనెత్తింది.
శాకాహారి ఆహారం అనగా మొక్కలకు సంబంధించినవి. అనగా కూరగాయలు, కాయలు, పండ్లు, ధాన్యాలు వంటివి. శాకాహారి ఆహారాన్ని అనుసరించే వ్యక్తులు జంతువులకు సంబంధించిన ఆహారాన్ని తీసుకోరు. అనగా మిల్క్ ప్రొడక్ట్స్, ఎగ్స్ తో పాటు వాటి మాంసం తినరు.
ఇప్పటివరకు జరిపిన అన్ని అధ్యయనాల ప్రకారంగా శరీరానికి అధికంగా పోషకాలను రవాణా చేయడంతో పాటు, బరువు అదుపులో ఉంచడం, మధుమేహం మరియు క్యాన్సర్ నుండి కాపాడడంలో, గుండె వ్యాధుల నుండి రక్షించడంలో ఈ రకమైన డైట్ ప్లాన్ వల్ల ఉపయోగాలు ఉన్నాయని కనుగొన్నారు.
ఉడికించని శాఖాహార ఆహారం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ విధమైన ఆహారంలో కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయని మీరు దీన్ని ప్రత్యేకించి ప్రణాళిక బద్ధంగా తీసుకోనప్పుడు ఇటువంటి దుష్ప్రభావులు వస్తాయని నిపుణులు అంటున్నారు. రా వేగన్ డైట్ వల్ల దేహంలో విటమిన్ -డి మరియు కాల్షియం లోపం వల్ల శరీరానికి ప్రమాదం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
మరి కొన్ని అధ్యయనాల ప్రకారం ఇటువంటి డైట్ వల్ల శరీరంలోని విటమిన్ బి12 మొత్తాన్ని కూడా తగ్గించడం వలన రక్తహీనత, నాడీ వ్యవస్థ దెబ్బ తినడం, వంద్యత్వం మరియు కొన్ని పరిస్థితుల్లో గుండె వ్యాధులకు కూడా కారణమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
ఒకే డైట్ ప్లాన్ అందరికీ ఉపయోగపడేలా ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆరోగ్య పనితీరు వివిధ రకాలుగా ఉంటుంది. అందువల్ల నిపుణుల సలహా లేకుండా, సొంత ఆహార ప్రణాళికను పాటించడం ఆరోగ్యానికి ప్రమాదకరం.
మీ కుటుంబంలో ఎవరికైనా డైట్ ప్లాన్(Diet Plan)అనుసరిస్తూ ఉంటే వారికి ప్రయోజనం కలిగి ఉన్నట్లయితే మీరు వారిని చూసి అదే డైట్ అనుసరించకూడదు. ఎందుకంటే మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియకుండా మీరు సొంత డైట్ ప్లాన్ ఫాలో అవ్వకూడదు.
కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి .వైద్యుల సలహా తప్పకుండా పాటించాలి. డైట్ ప్లాన్ చేయాలనుకుంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి.