Cancer నివారణ లో కూరగాయల ప్రభావం..40% నిరోధించే ఛాన్స్

Telugu Mirror: క్యాన్సర్ (cancer) ఒక ప్రాణాంతక వ్యాధి .ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ యొక్క మరణాల రేటు అధికమవుతుంది. ప్రతి సంవత్సరం ఈ క్యాన్సర్ వ్యాధి బారిన పడేవారు పెరుగుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

దురదృష్టం ఏమిటంటే చాలా సందర్భాలలో వ్యాధి చాలా తీవ్ర రూపం దాల్చే వరకు గుర్తించబడటం లేదు. మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్(Prostrate Cancer)మరియు ఆడవారిలో అండాశయం మరియు రొమ్ము క్యాన్సర్(Breast Cancer)వచ్చే ప్రమాదం అధికంగా కనిపిస్తుంది. ఈ వ్యాధి వలన ప్రతి సంవత్సరం లక్షల మంది మరణించడానికి కారణం అవుతుంది.

ప్రజలందరూ కూడా క్యాన్సర్ నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు అంటున్నారు. ఒకవేళ ఇప్పటికే మీకు ఆ వ్యాధి కారకాలు ఉంటే మరింత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కొన్ని రకాల కూరగాయలు మరియు పండ్లు కూడా క్యాన్సర్ ను నిరోధించే ప్రభావం కలిగి ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ తీవ్రమైన మరియు ప్రాణాంతకమైన వ్యాధి నుండి రక్షించడంలో కొన్ని రకాల కూరగాయలుతీసుకోవడం వలన మనకు క్యాన్సర్ కారకాలు రాకుండా కాపాడతాయి. ఆ కూరగాయలు ఏమిటో తెలుసుకుందాం.

Also Read:Check Ghee Quality: మార్కెట్లో నెయ్యి అమ్మకం..స్వచ్ఛతను తనిఖీ చేయండి ఇలా..

 బ్రొకోలి: బ్రొకోలీ(broccoli)అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని చాలామందికి తెలియదు. ఇది ఆంటీ కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉండడం దీని ప్రత్యేకత మరియు బ్రోకోలీలో సల్పో రాఫేన్ అనే సమ్మేళనం ఉంది. ఇది కౄసీఫెరస్ కూరగాయల(cruciferous vegetables)లో ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ కార్సినోజెనిక్ గుణాలను కలిగి ఉంటుంది. దీనిలో సల్ఫోరాఫేన్ ను కలిగి ఉండడం వల్ల రొమ్ము క్యాన్సర్ కణాల స్థాయిని మరియు సంఖ్యను 75% వరకు తగ్గిస్తుందని ఒక టెస్ట్ ట్యూబ్ అధ్యాయనం ప్రకారం రుజువయింది.

బ్రోకలీ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది.

క్యారెట్: క్యారెట్(carrot) కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పరిశోధనలో తేలింది. క్యారెట్ తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఐదు అధ్యాయనాల ద్వారా తెలిసిన విషయం ఏమనగా క్యారెట్లు తినడం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని 28% వరకు తగ్గిస్తుందని కనుగొన్నారు .ఇదే కాకుండా క్యారెట్ తినేవారికి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా 18% తగ్గిస్తుందని కనుగొన్నారు.

దాల్చిన చెక్క: దాల్చిన చెక్కలో అనేకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయని అధ్యయనంలో పేర్కొన్నారు. దీనిని వాడటం వల్ల, రక్తంలో చక్కెర మరియు శరీరంలో వచ్చే మంటను తగ్గించడంలో ప్రత్యేక ప్రయోజనాలను శరీరానికి అందిస్తుంది. టెస్ట్ ట్యూబ్ అధ్యయనాల ప్రకారం, దాల్చిన చెక్క క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికట్టడానికి తోడ్పడుతుందని పరిశోధకులు తెలిపారు దాల్చిన చెక్కలో ఉండే సారం క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తుందని పరిశోధనలో కనుగొన్నారు.

ఆలివ్ ఆయిల్: గుండె ఆరోగ్యానికి అత్యంత శ్రేష్టమైన నూనె ఆలివ్ ఆయిల్(olive oil) అని పరిశోధకులు గుర్తించారు. అయితే ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. కొలొ రెక్టల్ క్యాన్సర్ వంటి ఇబ్బందుల నుండి రక్షించే లక్షణాలు ఉన్నాయని అధ్యయనాలు పేర్కొన్నాయి.

అధ్యయనాల ప్రకారం ఆలివ్ నూనె(olive oil)ను ఉపయోగించే వ్యక్తులలో రొమ్ము క్యాన్సర్ మరియు జీర్ణ వ్యవస్థ యొక్క క్యాన్సర్లు వచ్చే సమస్యలు వారిలో చాలా తక్కువగా ఉంటాయి.

కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఆహార పదార్థాలలో యాంటీ కార్సినోజెనిక్ గుణాలను కలిగి ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 40 శాతం వరకు తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలియజేశారు. కాబట్టి వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకుందాం.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in