భారతీయ బ్యాంకులలో నెలకు రెండుసార్లు ఆరు రోజులు పనిచేసే అన్ని బ్యాంకు లకు త్వరలో అన్ని వారాంతాల్లో సెలవులు రానున్నాయని మీడియా నివేదిక తెలిపింది.
బిజినెస్ లైన్ నివేదిక ప్రకారం , జూలై 28వ తేదీన జరిగిన సమావేశంలో అన్ని శనివారాలను సెలవు దినంగా ప్రకటించాలని బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు తీసుకు వచ్చిన డిమాండ్ ను ఇండియాస్ బ్యాంక్ అసోసియేషన్(indias bank association)ఆమోదించింది.
అయితే ఇప్పుడు, ఈ పిటిషన్ ఆమోదం కోసం భారతీయ బ్యాంకుల నిర్వహణ ప్రతినిథి సంఘం వారు ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపినారు.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఈ డిమాండ్ ను అంగీకరించినట్లయితే, ఇకపై బ్యాంకులు వారంలో ఐదు రోజులు మాత్రమే పనిచేస్తాయి. అలాగే ఉద్యోగులు 1వ మరియు 3వ శనివారాల్లో పని చేసే అవసరం లేదు. అదేవిధంగా, బ్రాంచ్‌లలో రోజువారీ పని వేళలను 45 నిమిషాలు అధికంగా పొడిగించేలా చెయ్యొచ్చు అని బిజినెస్ లైన్(business line)నివేదిక పేర్కొంది.
ఆర్ధిక మంత్రిత్వ శాఖ తమ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతుందని బ్యాంకర్లు నమ్ముతున్నారు. “మంత్రిత్వ శాఖతో జరిపిన కొన్ని అనధికారిక చర్చల ఆధారంగా , బ్యాంకర్స్ యూనియన్(bankers union)నుండి వచ్చిన ఈ డిమాండ్ ను ఆమోదించడానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఉండకపోవచ్చు” అని మూలాలను పేర్కొంటూ ఇంగ్లీష్ డైలీ పేర్కొంది.
Also Read:Digi Locker: ఈరోజు నుంచి పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు ఇలా చేయండి. కొత్తగా డిజిలాకర్ సేవలు
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్(All india bank employees association) వారు ఈ సంవత్సరం మార్చి లో సర్క్యులర్‌ను జారీ చేసారు. బ్యాంక్ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయడానికి IBA అంగీకరించిందని ఆ సర్క్యులర్ లో పేర్కొంది.
AIBA పేర్కొన్న ప్రకారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నగదు లావాదేవీలు మరియు సాయంత్రం 4-30 గంటల వరకు నగదు రహిత లావాదేవీలను నిర్వహించడం ద్వారా మొత్తం పని గంటలను రోజుకు 40 నిమిషాలు పని గంటలను పెంచవచ్చు” అని అభప్రాయపదింది.
బ్యాంకులకు వారానికి ఐదు రోజుల పని కి సంబంధించి గతంలో అనేక మార్లు సమావేశాలు జరిగాయి, కానీ ఇంతవరకు స్థిరమైన ఫలితం మాత్రం రాలేదు.
బ్యాంకు యూనియన్ల ప్రతిపాదనను ఈసారైన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదిస్తుందో లేదో చూడాలి
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…