Vijay Deverakonda : పేరు మార్చుకుంటున్న విజయ్ దేవరకొండ.. రౌడీ బాయ్ నిర్ణయానికి గల కారణం ఇదేనా!
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాని, ఫాలోయింగ్ కాని ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది. వివరాల్లోకి వెళ్తే..
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ…పేరు వింటే చాలు ఒక వైబ్రేషన్ వస్తుంది. వరుసగా ప్లాప్‌లు చూస్తుంటే… వైబ్రేషన్స్ లో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. విజయ్ ఫ్యాన్స్ కాని, ఫాలోయింగ్ కాని ఏమాత్రం తగ్గడం లేదు. విజయ్ దేవరకొండకు ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది. ఇక అమ్మాయిలు అయితే, విజయ దేవరకొండ అంటే అమితంగా ఇష్టపడతారు. అర్జున్ రెడ్డితో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ వరుస ఫ్లాప్ లను చూస్తున్నారు.
నిజానికి, గీత గోవిందం తర్వాత విజయ్ (Vijay) కి సాలిడ్ హిట్ అందలేదు. టాక్సీవాలా కాస్త ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పవచ్చు. ఆ తర్వాత వచ్చిన చిత్రాలేవీ విజయ్ కెరీర్‌పై అంతగా ప్రభావం చూపలేదు. యావత్ ఇండియానే లక్ష్యంగా చేసుకుని భారీ బడ్జెట్ తో పూరి జగన్నాథ్ తీసిన లైగర్ సినిమా ఘోర పరాజయం పాలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా కనపడకుండా పోయింది.
తర్వాత వచ్చిన ఖుషీ నుండి తాజాగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ (Family star) వరకు ఎటువంటి హిట్స్ పొందలేదు. దాంతో విజయ్ ఆలోచనలో పడ్డాడు. హిట్ రావాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. మాస్ ఇమేజ్ నుంచి బయటకి వచ్చి కుటుంబ కథా చిత్రాలు చేస్తున్నా లాభం లేకపోయింది. అందుకే విజయ్ దేవరకొండ ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కుటుంబ ఒత్తిడితో కూడా చేస్తున్నాడు.
విజయ్‌కి హిట్‌లు లేకపోయినా అభిమానుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఇక ముందు కూడా అలాగే ఉంటుందని భావించలేం. అందుకే విజయ్‌ను పట్టించుకున్న తల్లిదండ్రులు అతడి జాతకాన్ని చూపించారు. విజయ్ దేవరకొండ తల్లి అతని జాతకాన్ని పరిశీలించింది. ఈ క్రమంలో పేరు మార్చాలని సూచించారు. మీరు దీన్ని నమ్మినా నమ్మకపోయినా, విజయ్ దేవరకొండ తన తల్లి కోసం తన పేరును మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
విజయ్ మొదటి నుంచి తల్లిదండ్రుల మాటలను గౌరవిస్తాడు. విజయ్ కి తన అమ్మ అంటే ప్రాణం. అందుకే తన తల్లిని సంతోషపెట్టేందుకు విజయ్ దేవరకొండ తన పేరు మార్చుకునే యోచనలో ఉన్నారనే వార్త ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. అయితే, ఇందులో నిజమెంతో తెలియదు కానీ, ఈ వార్త మాత్రం వేగంగా వ్యాపిస్తోంది.
విజయ్ దేవరకొండ పేరు ఇండస్ట్రీలో గట్టిగ రిజిస్టర్ అయిపోయింది. విజయ్ నిజంగా తన పేరు మార్చుకుంటే, ప్రజలు గతంలో ఉన్న ఫీలింగ్ ను కోల్పోవచ్చు. అయితే విజయ్ దేవరకొండ పేరు నిజంగానే మార్చినట్లయితే, అదృష్టం కలిసి వస్తుందా? లేదా? అనేది ఇక వేచి చూడాలి.
Vijay Deverakonda
Comments are closed.