అంధుని పై చిన్నారి ప్రేమ కు నెటిజన్లు ఫిదా, పది మిలియన్ వ్యూస్ వచ్చిన వీడియో.

పసి వయసులోనే సాటి మనిషిపై బాలిక చూపిన ప్రేమ ఆప్యాయత హృదయాలను హత్తుకుంది. మానవత్వం కనుమరుగైన ఈ రోజుల్లో ఆ పసి హృదయం చూపిన ప్రేమ నెటిజన్లను కట్టిపడేసింది

Telugu Mirror : మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడూ మానవత్వం ఉన్న వాడూ.. నూటికో కోటికో ఎక్కడో ఒక్కడు ఏడ ఉన్నడో తాను కంటికే కనరాడు అని ఓ సినీ కవి అన్నట్లు స్వార్థం ఎక్కువైపోతున్న ఈ లోకంలో మానవత్వం ఇంకా అక్కడక్కడ బ్రతికే ఉంది. కుటుంబ సభ్యులనే పట్టించుకోని మనుషులు ఉన్న ఈ లోకంలో ఇతరులకు సహాయం చేసే మనసు కలిగిన మనుషులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలానే పిల్లలూ దేవుడూ చల్లని వారే కల్ల కపటమెరుగనీ కరుణా మయులే అన్న మరో కవి భావనను నిజం చేస్తూ ఓ పసి మనసు సాటి మనిషిపై చూపిన ప్రేమ ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా మారింది. ఒక చిన్న బాలిక ఒక అంధుడికి సహాయం చేస్తున్నప్పుడు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకు ఇప్పటి వరకు పది మిలియన్ వ్యూస్ ను అందుకుంది.

 

పిల్లలు దేవుని ప్రతిరూపాలు అనే నానుడిని నిజం చేస్తూ ఆ పసి మనసు చేసిన పనికి కళ్ళు చెమర్చక మానవు. హృదయాలను హత్తుకునే ఆ వీడియోలో ఆ చిన్నారి స్కూల్ కి వెళ్తుండగా, దారిలో ఒక అంధవ్యక్తి భిక్షాటన చేస్తుండగా. ఆ వ్యక్తిని చూసి ఈ చిన్నారి మనసు కరిగి పోయి, తన మానవత్వాన్ని చాటుకుంది. ముందుగా తన దగ్గర ఉన్న డబ్బులను అతనికి ఇచ్చింది. ఆ తరువాత తన బ్యాగ్ లో నుంచి తన లంచ్ బాక్స్ ను తీసి తనకు ఇచ్చింది, అతడికి కనపడదుకనుక ఆ చిన్నారి బాక్స్ తీసిందని అతడికి తెలియలేదు. అప్పుడు ఆ చిన్నారి అందులో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ ను అతనికి ఇచ్చింది, అతడు దాన్ని తీసుకున్నాడు.

Also Read : చంద్రుని పైకి జపాన్ ప్రయోగించిన SLIM విజయవంతం

తరువాత తన దగ్గర ఉన్న సాండ్ విచ్ (Sandwich) ను అతనికి ఇచ్చింది, అతడికి కనబడదు కనుక దానిపై ఉన్న పేపర్ ను అలానే ఉంచి తినబోయాడు, అప్పుడు ఆ బాలిక సాండ్ విచ్ పై ఉన్న పేపర్ ను తీసి ఆ వ్యక్తికి తన చేతితో తిపించింది. ఆ వ్యక్తికి ఒక వాటర్ బాటిల్ ఇచ్చి, తర్వాత ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ పాప వెళ్ళిపోయింది. అయితే ఈ వీడియో queen_of_valley అనే ఖాతా ద్వారా X ( ట్విట్టర్ ) లో పోస్ట్ చెయ్యబడింది. సహాయం చెయ్యడమే గొప్ప అనుకుంటే ఈ చిన్నారి ఇంకా ప్రేమగా తినిపించడం విశేషం. వీడియో చూసిన వారు ఆ పాప మనసును మెచ్చుకుంటున్నారు. ఈ తరంలో ఇలాంటి మంచి మనసును కలిగి ఉండటం నిజంగానే ఆశ్చర్యం. ఈ పాప వలె మనం కూడా ఇతరులకు సహాయపడే వారిగా ఉందాం.

Leave A Reply

Your email address will not be published.