Telugu Mirror : ఆస్ట్రేలియాతో (Australia) జరిగిన ICC ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లో భారత క్రికెట్ స్టార్ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుతంగా ఆడి చరిత్ర సృష్టించాడు. గతంలో ప్రముఖ స్టార్ బ్యాటర్ అయినా సచిన్ టెండూల్కర్ ICC ఈవెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దిగ్గజ క్రికెటర్ గా చెప్పుకునే సచిన్ టెండూల్కర్ సృష్టించిన రికార్డు ని విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. సచిన్ రికార్డు ని అధిగమించి నెంబర్ వన్ స్థానానికి ఎదిగాడు.
Also Read ; Apple’s Festive Season : అద్భుతమైన పండుగ ఆఫర్ లతో అక్టోబర్ 15 న మీ ముందుకు రానున్న Apple ఉత్పత్తులు
విరాట్ కోహ్లి 65.23 సగటుతో రెండు సెంచరీలు మరియు 25 హాఫ్ సెంచరీలు చేసి రికార్డు తన కైవసం చేసుకున్నాడు. మరోవైపు సచిన్ టెండూల్కర్ ఐసీసీ (ICC) టోర్నీల్లో సగటున 52.28తో 10 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలతో 2,000కు పైగా పరుగులు చేశాడు. అయితే సచిన్ టెండూల్కర్ కేవలం 58 ఇన్నింగ్స్ లలో 2,719 పరుగులు చేసి అద్భుతమైన రికార్డును నమోదు చేయగా ఆ మైలురాయిని అధిగమించడానికి కోహ్లీ 64 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ICC ODI ప్రపంచకప్, ICC ODI ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ICC T20 ప్రపంచకప్ వంటి మూడు పెద్ద ఐసిసి టోర్నమెంట్లలో ఆడటం ద్వారా కోహ్లీ సాధించిన ఘనత మరింతగా ఆకట్టుకుంటుంది.
మరోవైపు టెండూల్కర్ వన్డే ప్రపంచకప్ మరియు ODI ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రమే ఆడాడు. టీ20 ప్రపంచకప్‌లో తన సత్తా చాటే అవకాశం తనకి ఎప్పుడూ రాలేదు. ఐసీసీ (ICC) ఈవెంట్ల విషయానికి వస్తే, భారత కెప్టెన్ రోహిత్ శర్మ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా (Batsman) నిలుస్తాడు. అతను 46.19 సగటుతో 2,422 పరుగులు చేశాడు. వరల్డ్ కప్ (World Cup) గెలిచిన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ 34.77 సగటుతో 1,707 పరుగులు చేశాడు. సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ కూడా సహకారాన్ని అందించారు.
Also Read : 2023 Forbes India’s 100 Richest List : భారతదేశం లో నెంబర్1 సంపన్నుడు అంబానీ, క్రిందకు దిగిన అదాని
ఆస్ట్రేలియా భారత్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వుంది. భారత టాప్ ఆర్డర్ (Top order) బ్యాటర్లలో ముగ్గురు సరైన స్కోరు చేయకుండానే అవుట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించారని చెప్పుకోవాలి. వీరిద్దరూ కలిసి 100 కంటే ఎక్కువ పరుగులు చేశారు, ఇవి భారత్ తమ మొదటి ప్రపంచ కప్ (World cup) మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై గెలవడానికి సహాయపడ్డాయి. భారత్ జట్టు 6 వికెట్ల తేడా తో ఘన విజయాన్ని తమ సొంతం చేసుకుంది.