Virtual credit cards : వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు అంటే ఏంటో తెలుసా? ఎలా ఉపయోగించాలో తెలుసా?
వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు అంటే డిజిటల్ క్రెడిట్ కార్డ్‌లు. ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.
Virtual credit cards : ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డ్ వినియోగం విపరీతమైన పెరుగుతోంది.చాలా మంది క్రెడిట్ కార్డ్స్ తో తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. అయితే సైబర్ క్రైమ్ కూడా ఇదే స్థాయిలో విస్తరిస్తోంది. దీంతో సురక్షితమైన ఆన్లైన్ లావాదేవీలకు డిమాండ్ పెరిగింది. ఇక సేఫ్ లావాదేవీల కోసం బ్యాంకులు వర్చువల్ క్రెడిట్ కార్డ్ (Virtual credit card)ఉపయోగించే ఆలోచన చేశారు,దీనిని VCC అని కూడా పిలుస్తారు. మరి, వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు అంటే ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? ఈ కార్డుల ప్రయోజనాలు ఏమిటి?వంటి విషయాల గురించి తెలుసుకుందాం.
వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు అంటే డిజిటల్ క్రెడిట్ కార్డ్‌లు. అవి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఈ కార్డులకు, సాధారణ క్రెడిట్ కార్డుల వలె కార్డ్ నంబర్, CVV మరియు చెల్లుబాటు తేదీలు ఉంటాయి. మీరు ఈ మొత్తం సమాచారాన్ని ఆన్లైన్లో కనుగొనవచ్చు. ప్రధాన క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్లు ఇప్పుడు వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను అందిస్తున్నారు. అయితే, వినియోగదారులు ఆన్లైన్ లావాదేవీలలో మాత్రమే వీటిని ఉపయోగించగలరు.
వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు వన్-టైమ్ యూసేజ్ ఆప్షన్ (One-time usage option) ను అందిస్తాయి. కార్డ్ నంబర్‌తో లావాదేవీలు రసీదు పొందిన 24 నుండి 48 గంటలలోపు ప్రాసెస్ చేయబడతాయి.దొంగతనం, ఇంత వేరే సమస్యల నుంది పరిష్కరించడానికి వినియోగదారులు ఈ కార్డ్స్ ను ఉపయోగించవచ్చు. కార్డ్ హోల్డర్లు ఈ కార్డును వినియోగించదలచుకుంటే ఈ కార్డును క్యాన్సిల్ చేసుకోవచ్చు లేదా బ్లాక్ చేసుకోవచ్చు.
ఇది ఎలా పనిచేస్తుంది?
దీనికి యూనిక్ క్రెడిట్ కార్డ్ నంబర్ (Unique Credit Card Number) ఉంది. మీ ఒరిజినల్ క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని తెలుపకుండానే ఆన్లైన్ కొనుగోళ్లు చేయవచ్చు. ఇది వన్-టైమ్ కోడ్‌తో పనిచేస్తుంది. ముందుగా, కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి. తర్వాత, వ్యాలిడిటీని నమోదు చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేసి కొనుగోలును పూర్తి చేయవచ్చు.
Comments are closed.