Telugu Mirror: మానవ శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో విటమిన్ బి-12(Vitamin B-12) ఒకటి.ఇది దేహంలోని నరాల మరియు రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతుంది. బి-12 లోపం ఉన్న వారిలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ బి-12 లోపం ఉన్న వారు ఈ లక్షణాలను కలిగి ఉంటారు. కాళ్లు తిమ్మిర్లు, బలహీనత, చిరాకు , వికారం, అలసట, బరువు తగ్గిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. విటమిన్ బి-12యొక్క లోపం దీర్ఘకాలంగా కొనసాగితే మెదడు దెబ్బతినే అవకాశం ఉంటుంది .మరియు రక్తహీనతకు గురి కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆహారం ద్వారా విటమిన్ బి -12 ను శరీరానికి అందించాలి.
విటమిన్ బి12 తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుండి బయటపడవచ్చు. విటమిన్ బి12 అనేక రకాల పండ్లు, కాయగూరలలో ఉంటుంది. విటమిన్ బి-12 మాంసాహారం లో ఎక్కువగా ఉంటుంది. మాంసాహారులకు ఈ సమస్య పెద్దగా ఉండదు. మాంసాహారులలో విటమిన్ బి-12 లోపం అనేది అరుదుగా ఉండే సమస్య. కానీ శాఖాహారులకుఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. శాఖాహారులు విటమిన్ బి-12 వేటిలో ఉంటాయో, ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో చూద్దాం.
అరటి పండ్లు(Bananas):
అధికంగా విటమిన్లు మరియు అత్యంత పోషక విలువలు ఉన్న పండ్ల లో అరటిపండు ఒకటి. దీనిని తినడం వల్ల శరీరానికి విటమిన్ బి -12 అందుతుంది. దీనిలో ఫైబర్ శాతం కూడా ఉండటం వలన రక్తపోటుని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. అల్సర్, మలబద్ధకం మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది .శరీరం యొక్క ఉష్ణోగ్రతను కూడా అదుపులో ఉంచే శక్తి అరటి పండుకు ఉంది.
బీట్ రూట్(beetroot):
బీట్ రూట్ లో క్యాల్షియం, విటమిన్లు ,ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి ,బీట్ రూట్ ని విటమిన్ బి – 12 యొక్క “పవర్ హౌస్” అంటారు. దీనిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరగడం మరియు రక్తహీనతను తొలగిస్తుంది. రక్తపోటు సమస్యను కూడా తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు బీట్ రూట్ తీసుకోవడం వలన శరీరానికి లభిస్తాయి.
కాబూలీ శనగలు ( చిక్ పీస్): మాంసాహారం తినని వారికి చిక్ పీస్ ద బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. దీనిలో విటమిన్ బి-12 పుష్కలంగా ఉంటుంది. బి -12 లో ఉన్న ఐరన్ గ్రహించడంలోనూ , మరియు ప్రోటీన్ పెంచడంలోనూ చిక్ పీస్ ఉపయోగకరంగా ఉంటుంది.
వీటితో పాటుగా పప్పు మరియు మొలకలు ఆహారంలో తప్పకుండా భాగం చేయాలి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
శాఖాహారులలో విటమిన్ బి-12 లోపం ఉన్నవారు ఇటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీ శరీరానికి విటమిన్ బి -12 ను అందించవచ్చు. అప్పుడు మీ శరీరం ఫిట్ గా, బలంగా మరియు దృఢంగా ఉంటుంది.