Vivo V30e : Vivo కంపెనీ Vivo V30ని ప్రారంభించిన 2 నెలల తరువాత కొత్తగా మరో స్మార్ట్ ఫోన్ ను భారతీయ మార్కెట్ లోకి విడుదల చేయనుంది. ప్రత్యేకంగా రూపు దిద్దుకున్న రిబ్బన్ డిజైన్ మరియు 5,500mAh బ్యాటరీతో వస్తున్న తాజా V సిరీస్ స్మార్ట్‌ఫోన్, Vivo V30e మే 2న భారతదేశంలో లాంచ్ చేయబడుతుందని Vivo ధృవీకరించింది.
Vivo V30e ఇటీవల విడుదలైన OnePlus 12 మరియు Realme 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ లలో కనిపించే రౌండ్ కెమెరా యూనిట్ వలెనే ‘జెమ్-కట్’ ఆకృతిని కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. రాబోయే Vivo V30e స్మార్ట్ ఫోన్ రెండు రంగుల ఎంపికలతో వస్తుంది అవి వెల్వెట్ రెడ్ మరియు సిల్క్ బ్లూ. Vivo V30e స్మార్ట్ ఫోన్ ముందు భాగంలో 3D కర్వ్డ్ డిస్‌ప్లే మరియు స్మార్ట్ కలర్ టెంపరేచర్ అడ్జస్ట్‌మెంట్‌ను కలిగి ఉండి మార్కెట్ లోకి వస్తున్నట్లు కంపెనీ చేత నిర్ధారించబడింది.
Vivo V30e స్మార్ట్ ఫోన్ 50MP సోనీ IMX882 సెన్సార్ మరియు ఆరా లైట్‌తో కూడిన సెకండరీ సెన్సార్‌తో సహా వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా యూనిట్ ను కూడా కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ అవసరాలకోసం స్మార్ట్ ఫోన్ ముందు భాగంలో 50MP ఐ ఆటోఫోకస్ కెమెరా కూడా ఉంటుంది.
ఫోనెరెనా నివేదిక ప్రకారం, VivoV30e 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి 6.78-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్ Qualcomm Snapdragon 6 Gen1 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 8GB RAM మరియు 256GB స్టోరేజ్ కెపాసిటీతో జత చేయబడుతుంది. Vivo V30 e స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారంగా Funtouch OS 14 పై ఆధారపడి నడుస్తుంది. అదేవిధంగా IP64 దుమ్ము మరియు నీటి నిరోధకత కలిగి ఉంది. ఇంకా 5,500 బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో వస్తుంది.
Vivo V30e Estimated Price :
Vivo నుంచి రాబోయే తాజా స్మార్ట్ ఫోన్ V30e ధర గురించి ఏ విధమైన ప్రకటన చేయలేదు. ఈ ఫోన్ కంటే ముందు విడుదలైన Vivo V29e ధరల ప్రకారం రాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్ ధరల శ్రేణి గురించి ఒక అంచనా వస్తుంది. Vivo V29 స్మార్ట్ ఫోన్ భారతదేశంలో 8GB RAM మరియు 128GB నిల్వ కలిగిన పరికరం ప్రారంభ ధర రూ. 26,999. అలాగే 8GB RAM మరియు 256GB స్టోరేజ్ కెపాసిటీ కలిగిన హ్యాండ్ సెట్ ధర రూ. 28,999 గా ఉన్నాయి. అదేవిధంగా, Vivo V30e స్మార్ట్ ఫోన్ ధర భారతదేశంలో రూ. 30,000 కంటే తక్కువగా ఉండవచ్చునని భావిస్తునారు.