Automobile

Volvo XC40 Recharge, Efficient EV: వోల్వో నుంచి కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ XC40.

Volvo XC40 Recharge

Volvo XC40 Recharge :వోల్వో XC40 రీఛార్జ్ E60 హై-ఎండ్ మోడల్‌ల యొక్క అధిక ధర లేదా హై పెర్ఫార్మన్స్ లేకుండా లగ్జరీ యొక్క టచ్‌తో ఎలక్ట్రిక్ వాహనాన్ని కోరుకునే వారికి చక్కటి ఛాయస్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ పరంగా, ఇది వోల్వో యొక్క సిగ్నేచర్ స్మార్ట్ మరియు రెస్ట్రెయిన్డ్ డిజైన్‌ను కలిగి ఉంది, బ్లాంక్డ్-అవుట్ గ్రిల్, స్లిమ్ వెంట్స్ మరియు క్లామ్‌షెల్ బోనెట్ వంటి ఆకర్షణీయమైన ఎలెమెంట్స్ ఉన్నాయి. వెనుక భాగం కూడా సింపుల్ గ డిజైన్ చేయబడి, 19-ఇంచ్ వీల్స్ తో ఏ కార్ చాల పెద్దదిగా కనిపిస్తుంది. XC40 రీఛార్జ్ E60 31 L ఫ్రంట్ ట్రంక్ మరియు 419 L బూట్‌తో ప్రాక్టికల్ ఇంటీరియర్‌ను అందిస్తుంది, అయినప్పటికీ స్పేర్ వీల్ కొంచం స్పేస్ ని కవర్ చేస్తుంది.

Volvo XC40 Recharge Features

8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, రెండు-జోన్ క్లైమేట్ కంట్రోల్, 12.3-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ADAS, 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. కానీ ఇందులో పిక్సెల్ LED హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్‌లు, 360-డిగ్రీ కెమెరాలు మరియు హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్‌ రావు.

Volvo XC40 Recharge Interior

ఇంటీరియర్ విషయానికి వస్తేయ్, క్యాబిన్ హై-క్వాలిటీ మెటీరియల్స్ మరియు ఆలోచనాత్మకమైన లే అవుట్‌తో మంచి ఫీల్ ని ఇస్తుంది. మైక్రోప్లాస్టిక్‌ల నుండి తయారైన స్వెడ్ వంటి రీసైకిల్ చేసిన మెటీరియల్స్ వల్ల ఎకో-ఫ్రెండ్లీ టచ్ వస్తుంది. ముందు సీట్లు అద్భుతమైన కుషనింగ్ మరియు సపోర్ట్ అందిస్తాయి మరియు పెద్ద డోర్ పాకెట్స్ మరియు రెమోవబుల్ గార్బేజ్ బిన్ వంటివి మనం ఈ కార్ లో చూడవచ్చు. 9-ఇంచ్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, కొద్దిగా చిన్నదిగా అనిపించినప్పటికీ, గొప్ప Google ఇంటిగ్రేషన్‌ను అందిస్తుంది. అయితే, Apple CarPlay అందుబాటులో ఉన్నప్పటికీ, iPhone వినియోగదారులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. 12.3-ఇంచ్ డ్రైవర్ డిస్‌ప్లే మినిమలిస్టిక్ మరియు క్లీన్‌గా ఉంటుంది, అయితే మరిన్ని లేఅవుట్ ఆప్షన్స్ ఇస్తేయ్ బాగుండేది అని నిపుణులు అంటున్నారు.

Volvo XC40 Recharge Rear Seats

వెనుక సీట్లు విశాలమైన మోకాలి(Knee) మరియు లెగ్‌రూమ్‌తో పాటు మంచి హెడ్‌రూమ్‌తో తగిన స్పేస్ అందిస్తుంది. విండో కొద్దిగా చిన్నది, కానీ మంచి లుక్ ని ఇస్తుంది. మూడవ ప్రయాణీకుడు హై సెంటర్ కన్సోల్ సమస్యాత్మకంగా ఉండవచ్చు. XC40 రీఛార్జ్ E60 యొక్క హెడ్‌రెస్ట్‌లు ఫోల్డబుల్ ఆప్షన్ తో వస్తున్నాయి.

Volvo XC40 Recharge Motor

సింగిల్-మోటారు వేరియంట్ అయినప్పటికీ, XC40 రీఛార్జ్ E60 తక్కువ పవర్ అనిపించదు, ఇది 238 PS మరియు 420 Nm టార్క్‌ను అందిస్తుంది. ట్రాఫిక్‌లో ఇది స్మూత్ మరియు చక్కని డ్రైవ్ ఫీల్ ని ఇస్తుంది. కారు తేలికగా మరియు పవర్-ఫుల్ గ అనిపిస్తుంది. సస్పెన్షన్ ట్యూనింగ్, 19-ఇంచ్ వీల్స్ పై ప్రయాణించినప్పటికీ, కఠినమైన రోడ్స్ పై సౌకర్యవంతమైన రైడ్‌ను అందిస్తుంది.

Volvo XC40 Recharge Safety Features

ADAS ఫంక్షన్ల పూర్తి ఫీచర్స్, రేర్ కొల్లిజాన్ సపోర్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు ఏడు ఎయిర్‌బ్యాగ్‌లతో సేఫ్టీ ఫీచర్స్ చక్కగా ఉన్నాయ్. XC40 రీఛార్జ్ E60 మంచి WLTP-రేటెడ్ పరిధిని మరియు మంచి ఛార్జింగ్ వేగాన్ని కూడా అందిస్తుంది. మొత్తంమీద, XC40 రీఛార్జ్ E60 చక్కని ప్యాకేజీని అందజేస్తుంది, ప్రత్యేకించి దాదాపు రూ. 50 లక్షల ధర ఉంటే, లగ్జరీ, సామర్థ్యం మరియు డ్రైవింగ్ డైనమిక్స్ కాంబినేషన్ అందిస్తుంది.

Volvo XC40 Recharge Price

రూ. 54.95 లక్షల వద్ద, సింగిల్-మోటార్ వోల్వో XC40 రీఛార్జ్ టాప్ డ్యూయల్-మోటార్ కంటే రూ. 2.95 లక్షలు తక్కువగా ఉంది. మీరు 475 కిమీ WLTP రేంజ్ తో 69 kWh బ్యాటరీ ప్యాక్‌ని పొందుతారు. వెనుక-మౌంటెడ్ మోటార్ 238PS మరియు 420 Nm చేస్తుంది మరియు EV 7.3 సెకన్లలో 0 నుండి 100 kmph వరకు అందుకుంటుంది.

Volvo XC40 Recharge Specifications

Category Specification
Model Volvo XC40 Recharge E60
Body Style SUV
Seats 5
Drive Layout Front-Wheel Drive
Motor Single Electric Motor
Power 238 PS (175 kW)
Torque 420 Nm
Battery Capacity 69 kWh
WLTP Range 475 km
0-100 km/h N/A
Top Speed N/A
Wheels 19-inch Efficiency-Focused Wheels
Front Suspension MacPherson Strut
Rear Suspension Independent Multi-link
Front Brakes Disc Brakes
Rear Brakes Disc Brakes
ADAS Full Suite including Rear Collision Support
Safety Seven Airbags, Hill Descent Control
Infotainment 9-inch Central Touch Screen, 12.3-inch Driver’s Display
Connectivity Apple CarPlay, Android Auto, Bluetooth
Materials Recycled Materials (e.g., Microplastics)
Interior Features Soft Materials, Felt Lighting, Thoughtful Storage
Exterior Features Smart, Restrained Design
Price Rupees 54,95,000 (Ex-Showroom)

Volvo XC40 Recharge

Telugu Mirror

Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in

Share
Published by
Telugu Mirror

Recent Posts

ವಿಕ್ರಂ ಗೌಡ ನಕ್ಸಲ್ ನಿಗ್ರಹ ಪಡೆ ಪೊಲೀಸರ ಬಲೆಗೆ ಅಷ್ಟು ಸುಲಭವಾಗಿ ಬಿದ್ದಿದ್ಹೇಗೆ

ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್​ಎಫ್​ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್​​ಕೌಂಟರ್​…

4 weeks ago

make sure working

ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್​, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್‌ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…

4 weeks ago

Aadhaar Update : ఆధార్ కార్డు నవీకరణకు మరో అవకాశం.. ఏపీలో ప్రత్యేక డ్రైవ్.. ఎప్పటి నుంచి అంటే?

[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…

5 months ago

Microsoft Windows crashes : మైక్రోసాప్ట్ విండోస్ క్రాష్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు.

[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…

5 months ago

Samsung Galaxy M35 5G : శాంసంగ్ నుంచి క్రేజీ డీల్.. తక్కువ ధరలో సూపర్‌ ఫీచర్స్‌.

Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…

5 months ago

Honor 200 5G Series : అదరగొట్టిన హానర్.. టెలిఫొటో కెమెరాలతో హానర్ 200 5జీ సిరీస్.. ధర ఎంతో తెలుసా?

Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…

5 months ago