Telugu Mirror : ప్రపంచవ్యాప్తంగా మెదడుకు సంబంధించిన జబ్బులు ఎక్కువవుతున్నాయి. మెదడు వ్యాధుల నివారణ మరియు ప్రమాదాలను తగ్గించడానికి ,ప్రజలలో అవగాహన కల్పించడం కోసం, ప్రతి ఏడాది జూలై 22న “వరల్డ్ బ్రెయిన్ డే” జరుపుకుంటారు .శరీరం యొక్క అవయవాల కడలికలను అదుపులో ఉంచడంలో బ్రెయిన్(Brain) ఉపయోగపడుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి యొక్క జీవనశైలి, తీసుకునే ఆహారం మరియు ఆరోగ్య పరిస్థితి వీటి మీద ఆధారపడి ఉంటుంది.
జీవన విధానం మరియు ఆరోగ్యం బాగా లేకపోతే అది మెదడు యొక్క పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది .ప్రపంచ స్థాయిలో మెదడుకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా పెరుగుతున్నాయి. మనం తీసుకునే ఆహారంపై మెదడు పనితీరు ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు . మనం తీసుకునే ఫుడ్ దేహం(Body)లోని ముఖ్య భాగమైన మెదడుపై నేరుగా ప్రభావం చూపుతుంది .మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ విధమైన ఆహారం తినాలో, ఏ ఆహారం తినకూడదో తెలుసుకుందాం.
Fish With Human Teeth :మనిషిని పోలిన పళ్ళు ఉన్న చేపను చెరువులో పట్టుకున్నా 11 ఏళ్ల ఓక్లహోమా బాలుడు
మెదడు ఆరోగ్యం కోసం ఏ విధమైన ఆహారం తీసుకోవాలి:
ఆహారంలో కొవ్వు కలిగి ఉన్న చేపలు ఉండేలా చూసుకోవాలి. చేపలలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్(Omega-3 fatty acids) సమృద్ధిగా ఉంటాయి. మెదడు 60 శాతం కొవ్వుతో నిర్మితమై ఉంటుంది .చేపలను తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.పసుపు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. పసుపులో కర్క్యుమిన్(Curcumin) అనే రసాయన పదార్థం ఉంటుంది .ఇది మెదడు కణాలకు సహాయపడుతుందని పరిశోధనలో కనుగొన్నారు. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు ఆంటీ ఇన్ఫ్లోమేటరీ సమ్మేళనంలా పనిచేస్తాయి.
జ్ఞాపకశక్తి మరియు మెదడుసంబంధిత వ్యాధులు సమస్యలను తగ్గించడంలో పసుపు సహాయ పడుతుంది.బ్రొకోలీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. దీనిలో విటమిన్-కె ఉంటుంది. మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో మరియు జబ్బులను నయం చేయడంలో సహాయపడుతుంది. ఇది యాంటిఆక్సిడెంట్లు కలిగి ఉన్న శక్తివంతమైన మొక్క.కొన్ని అధ్యయనాలు ద్వారా తెలిసిన విషయమేమంటే విటమిన్ -కె తీసుకునే వ్యక్తులలో “స్ట్రాంగ్ మెమొరీ పవర్ ” ను కలిగి ఉంటారని గుర్తించారు.
మెదడుకు నష్టం కలిగించే ఆహారం గురించి తెలుసుకుందాం:
తీపి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి .ఇవి రక్తంలో గ్లూకోజ్ పెంచడంతోపాటు మెదడుకు హాని కలిగిస్తుంది .తీపి పదార్థాలు తినడం ద్వారా మెదడులో ఇన్సులిన్ ను నిరోధిస్తుంది .తద్వారా మెమరీ పవర్ మరియు నరాల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్(Trans fat food) తక్కువ తీసుకోవాలి .అనగా నూనెలో వేయించిన పదార్థాలు, బేకరీ ఆహార పదార్థాలు, మైక్రోవేవ్ ఆహార పదార్థాలు, పిజ్జా, బర్గర్ ఇటువంటి ఆహారం ఆరోగ్యానికి చాలా హానికరమని అధ్యయనంలో కనుగొన్నారు .
Vivo Y27 : అదిరిపోయే ఫీచర్స్ తో అందరికి అందుబాటులో Vivo Y27 4G ఫోన్ ..
ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయి. మెదడు సంబంధిత వ్యాధులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరానికి మరియు మెదడుకు హానికరమని పరిశోధనలో కనుగొన్నారు. ఆల్కహాల్(Alcohol) ను కొద్ది మోతాదులో తీసుకున్నప్పటికీ అది శరీరము మరియు మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్ కమ్యూనికేషన్ కు ఆటంకాలను కలిగిస్తుంది. కాలం గడిచే కొద్దీ జ్ఞాపకశక్తిని కోల్పోవడం మరియు అర్థం చేసుకునే శక్తి తగ్గిపోతుంది.
పొగ త్రాగటం(Smoking) వల్ల మెదడు ఆరోగ్యం అనేది దెబ్బ తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని పరిశోధనలో కనుగొన్నారు .ధూమపానం చేసేవారిలో సెరిబ్రల్ కార్టెక్స్(cerebral cortex) సన్నగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. సెరిబ్రల్ కార్టెక్స్ అనగా మెదడులోని ఒక భాగం .ఇది జ్ఞాపకశక్తి మరియు ఆలోచన నైపుణ్యాలకు చాలా ముఖ్యమైనది. పొగ త్రాగటం వలన మెదడుకు అనేక రకాల వ్యాధులను పెంచుతుంది.
ఇటువంటి జాగ్రత్తలు పాటించడం వల్ల మెదడు యొక్క ఆరోగ్యం, ఆరోగ్యంగా ఉంటుంది.
గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాల ద్వారా సమీకరించి వ్రాయబడినది. పాఠకులకు జ్ఞానం మరియు అవగాహన పెంచడానికి సంబంధిత కథనం తయారు చేయబడింది .పై కథనంలో పేర్కొన్న సమాచారం వినియో గించేముందు మీ వైద్యుడి ని సంప్రదించండి.