Telugu Mirror : కాలానుగుణంగా మేకప్ చేసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కాబట్టి మేకప్ వేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అనుకోకుండా వర్షంలో తడవాల్సి వస్తే తడిసిన తర్వాత కూడా పాడవకుండా ఎలా మేకప్ వేసుకోవాలో తెలుసుకుందాం.
వానా కాలంలో మేకప్ చిట్కాలు :
ఎండాకాలం తర్వాత రుతుపవనాలు మొదలై వర్షాలు పడటం వల్ల కొంత ఉపశమనం కలిగిస్తుంది కానీ రోజువారి జీవితంలో కూడా ఈ వర్షాల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. వాన కారణంగా ఉద్యోగస్తులకు, బిజినెస్ నడిపే వాళ్లకు మరియు రోజు వారీ పనులకు వెళ్ళే వాళ్ళకు ఆటంకం ఏర్పడుతుంది. వర్షాకాలంలో మేకప్ పాడవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు .
Google Pay: నయా ఫీచర్ UPI లైట్ తో ఇక పై పిన్ అవసరం లేకుండనే చెల్లింపులు..
వారిలో సాధారణంగా పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లేవారు లేదా వారు చేస్తున్న వృత్తికి మేకప్ అవసరమయ్యే వ్యక్తులు మరియు వారానికి చాలా సార్లు పెద్ద పెద్ద కార్యక్రమాలకు హాజరయ్యే వారు అనుకోకుండా వర్షాలు పడినప్పుడు తాము వేసుకున్న మేకప్ పాడయ్యే ఇబ్బందిని తరచుగా ఎదుర్కొంటారు.వర్షం కారణంగా మేకప్ అంతా స్ప్రెడ్ అవ్వడమే కాకుండా ప్రజలు అసౌకర్యానికి గురయ్యేంత చెడుగా మారడం కూడా చాలాసార్లు చూస్తుంటాం. మేకప్(Make Up) చెడిపోకుండా కాపాడుకోవాలంటే మీరు వేసుకునే మేకప్ వాటర్ ప్రూఫ్ గా ఉండేలా చూసుకోవాలి. అలాంటివే కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
ఐస్ క్యూబ్ యూస్ చేయడం ద్వారా:
మేకప్ వేసుకునే ముందు తప్పకుండా ఐస్ ఉపయోగించాలి మేకప్ వేసుకునే ముందు ఐస్ క్యూబ్ తో చర్మం పై రుద్దడం వలన మీరు వేసుకునే మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది. మేకప్ వేసుకునేటప్పుడు బేస్ పై జాగ్రత్త వహించాలి .వీలైతే వానాకాలంలో ఆయిల్- ఫౌండేషన్, అధికంగా మాయిశ్చరైజర్ ,మరియు రిచ్ క్రీమ్ మేకప్ ,మీ స్కిన్ కి దూరంగా ఉంచాలి .ఫేస్ పౌడర్ తప్పకుండా వాడాలి.
Monsoon Diseases : వర్షాకాలంలో వ్యాధులకు గుడ్ బై చెప్పాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
వాటర్ ప్రూఫ్ ఐ షాడో:
వానా కాలంలో కళ్ళకోసం వాటర్ ప్రూఫ్ ఐషాడోను ఉపయోగించండి .ఐబ్రో పెన్సిల్ కి బదులుగా జెల్ వాడండి .మీకు క్రీముకు సంబంధించిన ఐషాడ్ ఉపయోగించే అలవాటు ఉంటే దానికి దూరంగా ఉండటం మంచిది.
క్రీమ్ లిప్ స్టిక్:
క్రీమీగా ఉండే లిప్ స్టిక్(Lipstick) ను ఎక్కువగా అప్లై చేయకూడదు. తరచుగా అమ్మాయిలు, స్త్రీలు ప్రకాశవంతంగా ఉండే అంటే నిగారింపుగా ఉండే క్రీమ్ లిప్ స్టిక్ వాడటానికి ఇష్టపడుతుంటారు .అలాంటప్పుడు వర్షాకాలంలో ఉపయోగించకుండా ఉండడానికి ప్రయత్నించండి .వానాకాలంలో మ్యాట్ లిప్ స్టిక్ ను వాడటం ఉత్తమం.మేకప్ వేసుకునేవారు వర్షాకాలంలో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన అనుకోకుండా వర్షంలో తడవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మేకప్ పాడవుతుందనే ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు.