ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకోవడం సహజం. మహిళలు (Women) మరియు పురుషులు (Men) శరీరం మీద ఉన్న అవాంచిత రోమాలను తొలగించుకోవడానికి వ్యాక్సింగ్ (waxing ) చేయిస్తారు. వ్యాక్సింగ్ అనేది శరీరంపై ఉన్న బాహ్య చర్మా (Skin) న్ని మరింత అందంగా మార్చడానికి చేసే సులభమైన ప్రక్రియ.
వ్యాక్సింగ్ చేయించడం వల్ల శరీరంపై ఉన్న అవాంఛత రోమాల (Unwanted hair) ను తొలగిస్తుంది. తద్వారా చర్మం చాలా శుభ్రంగా మరియు అందంగా కనిపిస్తుంది. అయితే వాక్సింగ్ వల్ల శరీరంలో అనేక రకాల ఇబ్బందులు రావడం కొన్నిసార్లు జరుగుతుంటుంది. వ్యాక్సింగ్ వల్ల దురద, దద్దుర్లు మరియు చికాకు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యల వల్ల చాలా సార్లు ప్రజలు భయపడిపోతుంటారు. ఎందుకంటే తమ చర్మం పాడైపోతుంది అనే భావనతో భయపడుతూ ఉంటారు.
ఈ సమస్య నుంచి ఉపశమనం (Relief) పొందేందుకు ఈరోజు కథనంలో కొన్ని ఇంటి చిట్కాలను తెలియజేస్తున్నాం. వ్యాక్సింగ్ చేయించుకున్న తర్వాత చర్మంపై చికాకు లేదా ఇబ్బంది కలిగినట్లయితే ఇంట్లోనే కొన్ని రకాల వస్తువులను వాడి మీకు వచ్చిన సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
Also Read : Basil Benefits : జుట్టు సమస్యలకు తులసితో చెక్ పెట్టండిలా
ఫేస్ వాష్ వాడడం వలన ముఖంపై చెడు ప్రభావం ఉంటుందా ? తెలుసుకోండిలా.
కొబ్బరి నూనె : చర్మానికి సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం కలిగించే లక్షణాలు కొబ్బరినూనె (Coconut oil)లో ఉన్నాయి. నిజానికి కొబ్బరినూనెలో ఫినాలిక్ యాసిడ్ మరియు పాలిఫెనాల్ వంటి యాంటీ బ్యాక్టీరియల్ మూలకాలు ఉన్నాయి. ఇవి చర్మంపై వచ్చే దురదను తగ్గిస్తాయి. కాబట్టి చర్మంపై వ్యాక్సింగ్ వల్ల దురద వచ్చినట్లయితే కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
కలబంద : కలబంద (Aloe vera)చర్మాన్ని చల్లబరిచేందుకు చాలా బాగా పనిచేస్తుంది. వ్యాక్సింగ్ తర్వాత చర్మంపై ఏదైనా చిరాకు వంటి ఇబ్బంది కలిగినప్పుడు చర్మంపై కలబంద జెల్ అప్లై చేయడం వల్ల ఉపశమనం పొందవచ్చు .
ఆలివ్ ఆయిల్ : వ్యాక్సింగ్ తర్వాత చర్మంపై ఎర్రటి దద్దుర్లు వచ్చినట్లయితే ఆలివ్ ఆయిల్ (Olive oil) ఉపయోగించడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు. దీన్ని ఉపయోగించాలంటే ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ లో రెండు నుంచి మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్ (Tea tree) ను కలిపి చర్మం పై రాయాలి. ఈ విధంగా చేయడం ఉపశమనం పొందవచ్చు .
మంచు : వాక్సింగ్ తర్వాత చర్మం పై దురద మరియు దద్దుర్ల నుండి బయట పడాలి అంటే ఐస్ క్యూబ్ (Ice cube) ని వాడవచ్చు. కాటన్ క్లాత్ (Cotton cloth) లో ఐస్ క్యూబ్ పెట్టి చుట్టిన తర్వాత మాత్రమే ఐస్ క్యూబ్ ని చర్మంపై పెట్టి రుద్దాలి. నేరుగా ఐస్ క్యూబ్ ని చర్మం పై రుద్దడం వలన చర్మానికి మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి వాక్సింగ్ చేయించుకున్న తర్వాత ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఎదురైతే ఇంటి చిట్కాల (Home remedies) ను పాటించి సులువుగా ఆ సమస్యల నుండి బయటపడండి.