Telugu Mirror:
రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు.
దామిని యాప్(Damini App) డౌన్లోడ్ పై అవగాహన కల్పించండి..
– జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ .
ఖమ్మం జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ (red alert)ప్రకటించిందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్(V P Gowtham) అధికారులను ఆదేశించారు. జాగ్రత్తగా వుండి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. మంగళవారం డిపిఆర్సీ భవనంలోని సమావేశ మందిరంలో రెవిన్యూ, పోలీస్ అధికారులతో కలెక్టర్ వర్ష పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దామిని యాప్. (Damini App) తో పిడుగుల గురించి ముందస్తుగా తెలుసుకొనే అవకాశం ఉందని ఆయన అన్నారు. వాతావరణ శాఖ సూచన ప్రకారం జిల్లాలోని సింగరేణిి(singareni), కామేపల్లి(kaamepalli) మండలాల్లో 100 మి.మి. పైగా, రఘునాథపాలెం(raghunadhapalem), ఏన్కూరు(enukuru), ఖమ్మం రూరల్ మండలాల్లో 60 నుండి 100 మి.మి. వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు.
Also Read:RainFall : తెలంగాణలో భారీ వర్షాలు, ఉత్తర తెలంగాణకు రెడ్ ఎలర్ట్ జారీ..
ఉరుములు, పిడుగులతో ప్రాణ నష్టం జరగకుండా వీటి నివారణకు దామిని (damini) యాప్ డౌన్లోడ్ పై అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. దామిని యాప్(Damini App) తో పిడుగుల గురించి ముందస్తుగా తెలుసుకొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ చేస్తూ, పరిస్థితులను ఎదుర్కొనేలా చర్యలు చేపట్టాలన్నారు. పిఆర్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ ఇంజనీర్లు సంబంధిత తహసిల్దార్లతో టచ్ లో వుండాలన్నారు. ఇరిగేషన్ ఏ.ఇ. లకు వారి వారి పరిధిలోని చెరువులు, కుంటలు, నీటి వనరులపై పూర్తి అవగాహన వుండాలన్నారు. వాగులు పొంగిపొర్లి కల్వర్టుల వద్ద ప్రవాహం అధికమైన చోట రాకపోకలు జరపకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రమాదానికి ఆస్కారం వున్న రహదారులను మూసివేయాలని, రాకపోకలు జరపకుండా భద్రత ఏర్పాటుచేయాలని అధికారులను కోరారు.
Also Read:Rainy Season: సేఫ్టీ మరియు స్టైలిష్ లుక్స్ కోసం మార్కెట్లో వివిధ రకమైన పాదరక్షలు..
ఈ సమావేశంలో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి(Adarash surabhi), అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్(N Madhusudan), శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా(Radhi Guptha), అదనపు డిసిపి ఏ.ఎస్.సి. బోస్,(A S C Bose) ట్రైనీ ఐపీఎస్ అవినాష్ కుమార్(I P S Avinash Kumar), ఆర్డీవో సూర్యనారాయణ(R D O Surya Narayana), ఎస్డీసి దశరథం(A C D C Dasaradham), ఏసీపీలు, తహశీల్దార్లు, పోలీస్, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.