Whatsapp New Feature : వాట్సాప్ (Whatsapp) కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. యూజర్ ఫ్రెండ్లీగా రూపొందిస్తోంది. త్వరలో మరో ఫీచర్ రాబోతుంది. ఇకపై మొబైల్‌లో నెట్ లేకున్నా వాట్సాప్ ద్వారా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ షేర్ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వాట్సాప్ మాతృసంస్థ మెటా (Meta) వెల్లడించింది.
మొబైల్‌లో ఇంటర్‌నెట్ (Internet) సదుపాయం లేకుండా పంపే ఫైల్స్ సైతం ఎన్‌క్రిప్ట్ (Encrypt) చేయబడుతాయని.. తద్వారా సెక్యూరిటీ ఉంటుందని నివేదిక పేర్కొంది. కొత్త ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ని సైతం రివీల్ చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. విజయవంతమైతే త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానున్నది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ను వినియోగించకుండా ఫైల్స్‌ను షేర్ చేసేందుకు బ్లూటూత్, షేర్‌ఇట్, నియర్‌బై షేర్ అప్లికేషన్స్‌తో ఫైల్స్‌ను షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదే తరహాలోనే మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఈ యాప్‌ను తీసుకురాబోతున్నది. ఈ ఫీచర్ ఎనేబల్ చేసుకోవాలంటే వాట్సాప్ సిస్టమ్ ఫైల్, ఫొటోల గ్యాలరీ యాక్సెస్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. మరో వైపు వాట్సాప్ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) సదుపాయాన్ని పరిచయం చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌పై సైతం పని చేస్తున్నది. చాట్‌లిస్ట్‌లో ఫేవరెట్స్ ఆప్షన్‌ను తీసుకురాబోతున్నది. ఇందులో యూజర్లకు తమకు ఇష్టమైన వ్యక్తులను అందులో యాడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దాంతో తరచూ చాట్‌చేసే వారితో పాటు కాంటాక్ట్స్ మొత్తం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు.
ఇవి గుర్తుంచుకోండి..
మీ ఫోన్ గ్యాలరీ, ఫైల్స్, వీడియోస్, డాక్యుమెంట్స్ యాక్సెస్ చేయడానికి వాట్సాప్‌ని అనుమతించాలి. లేదంటే ఈ ఫీచర్ పని చేయదు. అయితే యూజర్ నెంబర్‌ను గోప్యంగా ఉంచుతామని, షేర్ చేసిన ఫైల్స్‌ను ఎన్‌క్రిప్ట్ చేస్తామని వాట్సాప్ తెలిపింది. ఈ ఫీచర్ Shareit యాప్ మాదిరిగా పని చేస్తుంది. ప్రస్తుతం వీటి వాడకం తగ్గింది. నెట్ కనెక్షన్ లేదా వైఫై లేకపోయినా ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ సెండ్ చేసుకోవచ్చు. ఇది యూజర్లకు ఎక్కువ టైమ్, డేటాను సేవ్ చేస్తుంది.