Telugu Mirror: సాధారణంగా ప్రతి ఒక్కరికి ప్రతి అధ్యాయం లో ఒకటికి మించిన సీక్రెట్స్ ఉంటూనే ఉంటాయి.భార్య భర్తల విషయం కూడా రహస్యాలు దాగి ఉంటాయి. దాని వల్ల లోకంలో , తెలియని నిజాలు అధిక సంఖ్యలో పెరుగుతాయి. అయితే కొంత మంది ఆడవారు భార్యాభర్తల మధ్య ఉండే రహస్యాలను బహిర్గతం చేస్తుంటారు. అలా చేయడం వల్ల భార్య భర్త ల బంధం లో సమస్యలు మొదలవుతాయి. దంపతుల మధ్య ఉండే రహస్యాలు యాదృచ్చికంగా భర్తకు తెలిస్తే భర్తకు వచ్చే కోపానికి వారి దాంపత్య జీవితం ముక్కలవడానికి ఎంతో సమయం పట్టదు.
ఇప్పుడు మేము చెప్పబోయే ఈ ఐదు సలహాలు పాటించి , మీ భార్యలో ఈ అలవాటు ఉంటె ఆమెను మార్చేందుకు ప్రయత్నిచండి. ఇలానే ఉంటె బంధం చివరి దశలో ఉంటుంది అనే విషయాన్నీ గమనించండి.
1. ఆమెకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేయండి.
స్త్రీలు తన తల్లితో ఏ విషయాన్నీ అయినా పంచుకోవడానికి ఇష్టపడుతారు.పెళ్లి అయిన తర్వాత కూడా భార్యభర్త మధ్య జరిగే విషయాలను పంచుకుంటారు. ఈ సిట్యుయేషన్ నుండి బయటకు రావాలంటే ,మొదట మీ భార్యతో మాట్లాడండి. రహస్యంగా ఎందుకు ఉండాలో పూర్తిగా ఆమెకు వివరించే ప్రయత్నం చేయండి. మరియు సమస్యను పరిష్కరించుకోండి.ఇది ఒక మార్గం, ఇది పని చేసే అవకాశం ఉంది.
2. ఇబ్బంది పెడితే ఇబ్బందుల్లో పడే అవకాశం.
ఇంటి గుట్టు బయట పెట్టె భార్యలంటే భర్తలకు కోపం పీక్స్ లో వెళ్తుంది. ఆలా ఉంటె మీకే ప్రమాదం. చెడు మాటలు తిట్టి , మీ అర్ధాంగి మనసు నొప్పిస్తే ఆ భాధ స్త్రీ గుండెల్లో నాటుకుపోతుంది. కాబట్టి మీ కోపాన్ని ఆమె మీద చూపిస్తే బంధం తొందరగా విడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఆగ్రహాన్ని భార్య పై ప్రదర్శించే ప్రయత్నం చేయకండి.
3. మీ అర్ధాంగికి సమయం ఇచ్చి చూడండి.
భర్త భార్య యొక్క తల్లి స్థానం లోకి రావాలి. ఆమెకి అతి ప్రియమైన స్నేహితుడుగా ఉండండి. ఇలా చేస్తే ఆమె తన తల్లికి చెప్పే అవకాశమే ఉండదు. ఈ విషయం గురించి మీరు తీవ్రంగా ఆలోచినాల్సిన అవసరం లేదు. దిగులు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు జీవనాధారం కోసం చేసే పని పూర్తి అవగానే ఇంటికి వెళ్ళండి. ఆమెతో సమయాన్ని గడపండి. ఇలా చేయడం వల్ల ఆమెకు మరింత ఆత్మీయంగా మారుతారు.
4. మీ అత్తమ్మ (భార్య తల్లితో ) తో మాట్లాడండి.
మీ అత్తమ్మ తో మాట్లాడుతున్నారు అంటే మీ తల్లి తో మాట్లాడుతున్నారు అనే విషయాన్నీ గుర్తుపెట్టుకోండి. ఆమెతో సంభాషణ చేసేటప్పుడు తప్పుడు మాటలు మాట్లాడకండి. మీ మనుసులో మాటలను ఆమెకు వివరించండి. ఆమె తనకున్న అనుభవంతో దీనికి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తుంది మరియు తన బిడ్డను ఆ విషయంలో మందలింస్తుంది.మీ జీవితం శాంతియుతంగా మారాలంటే ఇలా చేయడం మంచిది.
5. మీ నోటికి తాళం వేయండి.
మీరు ఇన్ని ప్రయత్నాలు చేసిన కూడా ఫలితం లభించకపోతే మీరు ఇక ఏమి చేయలేరు అనే విషయాన్నీ గమనించండి.ఈ పరిస్థితి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మీ నోటికి తాళం వేసి ఇంకెప్పుడు మీ రహస్యాలను మీ భార్యతో పంచుకోకండి.