Fixed Deposite : మీ డబ్బు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు ?
SBI ఫిక్స్ డ్ డిపాజిట్ (FD) లేదా పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్.. ఎక్కడైనా సరే వడ్డీ రేట్లు తెలుసా?
Telugu Mirror : ఫిక్స్ డ్ డిపాజిట్ లు గ్యారంటీ కలిగి ప్రయోజనాలను అందిస్తాయి.తక్కువ రిస్క్ కలిగిన పెట్టుబడులు ఫిక్సెడ్ డిపాజిట్ లు.SBI ఫిక్స్ డ్ డిపాజిట్ రేట్లు 3% నుంచి 7.1% వరకు ఉంటాయి.పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 6.9% నుంచి 7.5% వరకు ఉంటాయి.SBI FD అలాగే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ లు రెండూ పన్ను మినహాయింపు కలిగి ఉంటాయి. SBI FD మరియు పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ ల గురించి తెలుసుకుందాం.
ఫిక్సెడ్ డిపాజిట్ లు మదుపరులకు సురక్షిత మైనవి.అలాగే పెట్టుబడి దారులకు మంచి ప్రయోజనాలను అందిస్తాయి.SBI మరియు ఇతర బ్యాంక్ ల ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు మందగించినపుడు,పోస్ట్ ఆఫీస్ కాల పరిమితి డిపాజిట్ పధకాల వంటివి, లో- రిస్క్ కలిగి మంచి లాభదాయకమైన పెట్టుబడి పధకాలు.
Telugu Panchangam : తెలుగు మిర్రర్ న్యూస్ ఈ రోజు శుక్రవారం , జూలై 14, 2023 తిథి ,పంచాంగం
SBI ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు:
SBI తన FD ల మీద 7 రోజుల నుండి 10 సంవత్సరాల మధ్యలో సాధారణ కస్టమర్ లకు 3 శాతం నుండి 7.1 శాతం వరకు వడ్డీని అందిస్తుంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్ లకు ఈ డిపాజిట్ ల మీద 50 బేసిస్(BPS ) పాయింట్లను SBI అందిస్తుంది.భారత దేశం లోనే అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ,అలానే అతిపెద్ద రుణ దాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంవత్సరం నుండి రెండు సంవత్సరాల లోపు కలిగిన డిపాజిట్ లకు 6.8% వడ్డీ రేటుని అదేవిధంగా రెండు నుంచి మూడు సంవత్సరాల లోపు ఉన్న డిపాజిట్ ల మీద 7 శాతం వడ్డీ రేటుని SBI ఇస్తుంది. ఈ వడ్డీ రేట్లు 15 ఫిబ్రవరి 2023 నుంచి అమలులోకి వచ్చాయి.
డిపాజిట్ లపై SBI వడ్డీ రేట్లు :
- 7 నుండి 45 రోజుల వరకు-3%
- 46 రోజుల నుండి 179 రోజుల వరకు-4.5%
- 180 నుండి 210 రోజులకు – 5.25%
- 211 రోజుల నుండి 1సంవత్సరం కంటే తక్కువ – 5.75 శాతం
- ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు – 6.8%
- 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల లోపు – 7.00%
- 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ – 6.5%
- 5 సంవత్సరాల వరకు 6.5%
- 400 రోజుల ప్రత్యేక పధకం
- ‘అమృత్ కలాష్’ 7.10%
- 10 సంవత్సరాలు వరకు 6.5%
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ వడ్డీ రేట్లు:
బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్ ల వలెనే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పధకాలు ఉంటాయి.పోస్ట్ ఆఫీస్(Post Office) లలో సంవత్సరం కాలపరిమితి నుంచి ఐదు సంవత్సరాల వరకు టర్మ్ డిపాజిట్ లను కలిగి ఉంటాయి.ఏడాది మరియు రెండేళ్ళ కాలపరిమితి కి రివిజన్ తో వరుసగా 6.9%,7% వడ్డీ రేటు ఉంటుంది. మూడు సంవత్సరాల డిపాజిట్ పై 7%, ఐదు సంవత్సరాల డిపాజిట్ మీద 7.5 శాతం వడ్డీ రేట్లు కలిగి ఉంటాయి. ఈ వడ్డీ రేట్లు జూలై 1 నుంచి అమలులోకి వచ్చాయి.
Smrithi mandana : ఆటలో నైపుణ్యం..ఆకర్షణీయమైన రూపం..
ఒక సంవత్సరం పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ – 6.9%
పోస్ట్ ఆఫీస్ రెండు సంవత్సరాల కాలపరిమితి డిపాజిట్ 7%
3 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పైన 7శాతం.
5 ఏళ్ళ పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ కు 7.5%
మదుపరులు ఆదాయపు పన్ను చట్టం,1961లోని సెక్షన్ 80C(Section 80C) క్రింద రూ.1.5 లక్షలు విలువైన ఆదాయపు పన్ను మినహాయింపులను పొందవచ్చు.అయితే ఆదాయపు పన్ను మినహాయింపులు ఐదు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ డిపాజిట్ లకు మాత్రమే వర్తిస్తుంది.
ఎంపిక చేసిన పొదుపు పధకాలపై ప్రభుత్వం జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి వడ్డీ రేట్లను 0.3% వరకు పెంచింది.